ఈ దారి... సోలార్ రహదారి!
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. దక్షిణ కొరియాలోని ఈ ఫొటో చూస్తే ఈ సామెత నిజమేననిపించక మానదు. దాజియా- సెజాంగ్ పట్టణాలను కలిపే ఈ హైవే మధ్యలో సైకిళ్లు మాత్రమే వెళ్లేందుకు ఓ దారి ఏర్పాటు చేశారు. దాదాపు 32 కిలోమీటర్ల పొడవున్న ఈ దారికి అంత ప్రత్యేకత ఉండకపోవచ్చుగానీ... దానిపై కప్పు మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే అంతపొడవునా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారుమరి! సైకిళ్లలో ప్రయాణించేవారికి చల్లటి నీడనిస్తూ... విద్యుత్ కూడా ఉత్పత్తి చేసుకోగలగడం భలే ఆలోచన కదూ!