
సైకిల్‌కు సై..
మోటారు వాహనాల సంఖ్య పెరిగిపోతుండడంతో వాతావరణ కాలుష్యం అధికమవుతోంది.
హైదరాబాద్: మోటారు వాహనాల సంఖ్య పెరిగిపోతుండడంతో వాతావరణ కాలుష్యం అధికమవుతోంది. దీన్ని నివారించడానికి సైకిల్ లాంటి వాహనాల వినియోగం పెంచాలని పర్యావరణ వేత్తలు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ఇప్పుడిప్పుడే అధిక సంఖ్యలో సైకిల్ వైపు మళ్లుతున్నారు. అందుకు తగ్గట్టుగా రోడ్లు ఏర్పాటు చేయాలని వందలాది మంది సైక్లిస్టులు ఇటీవల ఇలా సైకిల్ పెకైత్తి నినదించారు.