సైకిల్‌పై వెళుతుండగా చిన్నపాటి ప్రమాదానికి గురైన ఇరవెరైండేళ్ల ఐరిష్ యువకుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు.
లండన్: సైకిల్‌పై వెళుతుండగా చిన్నపాటి ప్రమాదానికి గురైన ఇరవెరైండేళ్ల ఐరిష్ యువకుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. హ్యాండిల్‌కు, సీటుకు మధ్యనున్న సైకిల్‌బార్ గట్టిగా తాకడంతో ఏడువారాలుగా అతడి పురుషాంగం స్తంభించిపోయింది. అది తిరిగి సాధారణ స్థితికి చేరుకోకపోవడంతో అతడు నానా తంటాలు పడుతున్నాడని ‘ఐరిష్ ఇండిపెండెంట్’ దినపత్రిక వెల్లడించింది.
చివరకు అతడు డబ్లిన్‌లోని టాలాట్ ఆస్పత్రిలో చికిత్స పొందాక తన బాధ నుంచి ఉపశమనం పొందినట్లు తెలిపింది. కాగా, పురుషాంగంలోకి అసాధారణంగా రక్తప్రసరణ కావడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ‘ఐరిష్ మెడికల్ జర్నల్’ వివరించింది. చికిత్స చేయకుండా విడిచిపెడితే, పురుషాంగంలో రక్తం గడ్డకట్టి ప్రాణాంతకంగా మారుతుందని తెలిపింది.