
న్యూఢిల్లీ: బ్రిటిష్ ఎలక్ట్రిక్ బైక్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ ‘గోజీరో మొబిలిటీ’ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. వచ్చే వారం రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు... వన్, మైల్‌లను ఢిల్లీ మార్కెట్లోకి విడుదల చేయనున్నది. గోజీరో వన్ బైక్‌లో 400 వాట్‌అవర్(డబ్ల్యూహెచ్) లిథియమ్ బ్యాటరీని అమర్చామని, గోజీరో మొబిలిటీ సీఈఓ అంకిత్ కుమార్ తెలిపారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే, 60 కీమీ.దూరం ప్రయాణిస్తుందని పేర్కొన్నారు.
గోజీరో మైల్ బైక్‌ను 300 వాట్‌అవర్ లిథియమ్ బ్యాటరీతో రూపొందించామని, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 45 కిమీ. దూరం ప్రయాణించవచ్చని వివరించారు. ఈ రెండు బైక్‌లతో జాకెట్లు, బెల్ట్‌లు, వాలెట్స్ వంటి లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేస్తామని పేర్కొన్నారు. కాగా తాజా ఉత్పత్తుల ధరలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment