
బట్టలు ఉతకొద్దు... తొక్కితే చాలు!
ఒకే పనికి రెండు ప్రయోజనాలు.. అటు ఆరోగ్యం, ఇటు దుస్తులు శుభ్రం. మనం చేయవల్సిందల్లా జస్ట్ ఈ సైకిల్ తొక్కడమే. చాలా మంది వ్యాయామం కోసం వారానికోసారైనా సైకిల్ తొక్కుతుంటారు.
ఒకే పనికి రెండు ప్రయోజనాలు.. అటు ఆరోగ్యం, ఇటు దుస్తులు శుభ్రం. మనం చేయవల్సిందల్లా జస్ట్ ఈ సైకిల్ తొక్కడమే. చాలా మంది వ్యాయామం కోసం వారానికోసారైనా సైకిల్ తొక్కుతుంటారు. అలాగే రోజూ లేదా వారానికోసారైనా బట్టలు ఉతుకుతుంటారు. మరి ఆ రెండు పనులనూ కలిపి ఒకేసారి చేసుకుంటే పోలా? అని ఆలోచించిన చైనాలోని దలియన్ నేషనలిటిస్ యూనివర్సిటీ పరిశోధకులు.. సైకిల్‌ను, వాషింగ్‌మెషిన్‌ను కలగలిపి ఇలా ఈ ‘బైక్ వాషింగ్ మెషిన్’ను తయారు చేశారు.
దీని సైకిల్ పెడల్స్‌ను తొక్కుతుంటే వాషింగ్ మెషిన్‌లోని డ్రమ్ తిరుగుతుంది. అదే సమయంలో విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ను మెషిన్‌పై డిస్‌ప్లే స్క్రీన్ పనిచేయడానికి ఉపయోగించడమే కాకుండా.. బ్యాటరీలో కూడా నిల్వ చేసుకోవచ్చట. భలే ఉంది కదూ.. బట్టలుతకాలంటే ఇక ఉసూరుమనకుండా ఉత్సాహంగా సైకిల్ తొక్కొచ్చు.