రొద్దం మండ లం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ దళిత విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనపై బాధిత బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు..
రొద్దం : రొద్దం మండ లం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ దళిత విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనపై బాధిత బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పెద్దగువ్వలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల వదిలిన అనంతరం సోమవారం సాయంత్రం విద్యార్థిని సైకిల్‌పై స్వగ్రామానికి బయలుదేరింది. దారిలో మాటువేసిన టీడీపీ కార్యకర్త, చౌక దుకాణం డీలర్ ఉజ్జినప్ప బాలిక చేయి పట్టుకుని పక్కకు లాగాడు.
బాలిక అతని నుంచి తప్పించుకుని వేగంగా ఇల్లు చేరుకుంది. దారిలో జరిగిన విషయం తల్లికి చెప్పింది. అత్యాచార యత్నం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను విచారించిన అనంతరం ఉజ్జినప్పపై ఐపీసీ 354 సెక్షన్ 8 కింద కేసు నమెదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ గోవిందు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా, ఈ ఘటనపై దళిత, విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి.