
శ్రీకాకుళం ,కాశీబుగ్గ : తోడబుట్టిన చెల్లి ఆడబిడ్డకు జన్మన్వివగా.. మేనకోడలిని చూసేందుకు మామ ఏకంగా వంద కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించాడు. రణస్థలం గ్రామానికి చెందిన ధ ర్మవరపు సురేష్ పలాస మండలం రామకృష్ణాపురం వద్ద ఉన్న బోగేష్ ఇటుకల క్వారీలో పనిచేస్తున్నా రు. ఆయన చెల్లి దుర్గకు ప్రసవ సమయం దగ్గరపడడంతో కావాల్సిన డబ్బు, సరుకులు తీసుకుని రావాలనుకున్నాడు. దుర్గ సోమవారమే రిమ్స్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. బుజ్జాయి మేనమామ ఘడియల్లో పుట్టడంతో మంగళవారం నాటికి తప్పకుండా చూడాలని, లేదంటే ఐదేళ్లు చూడకూడదని పెద్దలు చెప్పారు. దీంతో సురేష్ పలాస నుంచి రణస్థలం వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment