సాక్షి, హైదరాబాద్: రివోల్ట్ ఇంటెల్లి కార్పొరేషన్ తన ఈ-బైక్‌లను హైదరాబాద్ మార్కెట్లో లాంచ్ చేసింది. రివోల్ట్ ఆర్‌వీ 400, ఆర్‌వీ300 పేరుతో ఈ ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లను విడుదల చేసింది. ఈ సందర్భంగా టెలికార్ప్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ మాట్లాడుతూ స్థిరమైన, సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు అందుబాటులో తెచ్చే క్రమంలో తమ నిబద్ధతను తమకొత్త వాహనాలు ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.
నగదు చెల్లించి తీసుకుంటే ఆర్‌వీ 400 బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,03,999. దీనికి బుకింగ్ చార్జ్ రూ.3,999 అదనం. ఆర్‌వీ300 మోటార్ సైకిల్ ధర రూ. 84,999. దీనికి రూ.2,999 బుకింగ్ చార్జ్ అదనం. 38 నెలలు నెలకు రూ.3,999 చెల్లించి ఆర్‌వీ400ను ముందుగానే పొందే అవకాశంకూడా అందుబాటులో వుంది. ఆర్‌వీ300 బైక్‌కు నెలకు రూ.2,999 చొప్పున 36 నెలలు చెల్లించాలి. బుకింగ్ ఫీజు అదనం.
ఆర్‌వీ 400 బైక్: 3.24 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ, ఇది ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళుతుందని చెప్పారు. గంట కు గరిష్ఠంగా 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగే రివాల్ట్ గూగుల్ భాగస్వామ్యంతో కనెక్ట్ చేసిన హెల్మెట్‌ను కూడా అందిస్తుంది. ఇది రైడర్‌ను వాయిస్ కమాండ్, రివాల్ట్ స్టార్ట్ ఉపయోగించి బైక్‌ను ప్రారంభించడానికి అనుమతిస్తుంది. కాగా ఢిల్లీ పుణేలలో ఇప్పటికే ఈ బైక్‌లను ఇప్పటికే లాంచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment