Joy E-Bike in India Travels 500 KM With Rs 115 Only - Sakshi
Sakshi News home page

Joy E-Bike: 500 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.115 ఖర్చు..!

Published Thu, Mar 3 2022 6:50 PM | Last Updated on Thu, Mar 3 2022 7:40 PM

Joy e-bike in India Travels 500 km With 115rs only - Sakshi

దేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ఊపు అందుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దేశీయంగా కూడా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉండవచ్చు అని చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన ఓ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 23 పైసలకు 1 కిలోమీటరు నడవనున్నట్లు కంపెనీ పేర్కొంది. జాయ్ ఇ-బైక్ మాన్‌స్టర్ ఎలక్ట్రిక్ బైకును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. ఈ బైక్‌ మీద 500 కిలోమీటర్లు ప్రయాణించడానికి అయ్యే ఖర్చు కేవలం 115 రూపాయలే మాత్రమే అవుతుంది. 

సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ బైక్ 72V, 39 AH లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బైక్ 1500వాట్ డీసీ బ్రష్‌లెస్ హబ్ మోటార్‌తో పనిచేస్తుంది. జాయ్ ఈ-బైక్ మాన్‌స్టర్ ఫుల్ ఛార్జ్ చేయడానికి కనీసం 5 నుంచి 5.5 గంటల సమయం పడుతుంది. ఈ బైక్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి 3.3 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 60 కి.మీ కాగా ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.98,666గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ Revolt Motors RV 400 వంటి ఇతర ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది. జాయ్‌ ఈ-బైక్స్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధరలపై సుమారు 12 వేల సబ్సిడీను గుజరాత్‌ ప్రభుత్వం అందిస్తోంది. ఈ సబ్సిడీ కేవలం గుజరాత్‌లో చదువుకునే తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు వర్తించనుంది. జాయ్‌ ఈ-బైక్స్‌ శ్రేణిలోని జెన్‌ నెక్ట్స్‌, వోల్ఫ్‌, గ్లోబ్‌, మాన్‌స్టర్‌ వేరియంట్‌లకు ఈ సబ్సిడీ లభించనుంది.   

(చదవండి: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement