
అగర్తల: త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ జరుగుతుండగా ఆయన ఫోన్లో అశ్లీల వీడియోలు చూసినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజాప్రతినిధి అయి ఉండి అసెంబ్లీలో ఇలాంటి పనులు చేయడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
జాదవ్ లాల్ నాథ్ బాగ్‌బస్సా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఫోన్లో వీడియోలు చూస్తూ కన్పించారు. ఈ క్రమంలోనే ఓ ఆశ్లీల వీడియోను చూస్తున్న సమయంలో వెనకాల ఉన్న సభ్యులెవరో రికార్డు చేశారు. అది బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది.
చదవండి: ఛీ, తను కూతురేనా?.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కన్నవాళ్లను దారుణంగా..
ఈ వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయింది. వెంటనే వివరణ ఇవ్వాలని జాదవ్‌కు సమన్లు పంపింది. అయితే ఆయన మాత్రం ఇంకా వీటిపై స్పందించలేదు. అసెంబ్లీ సెషన్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
బీజేపీ నేతలు అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూడటం ఇది తొలిసారేం కాదు. 2012లో కూడా కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు మంత్రులు లక్ష‍్మణ్ సవాది, సీసీ పాటిల్.. అశ్లీల వీడియోలు చూస్తూ కన్పించారు. అనంతరం తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే బీజేపీ దీనిపై విచారణ జరిపి వారు తప్పుచేయలేదని నిర్ధరించుకున్న తర్వాత తిరిగి మంత్రి పదువులు ఇచ్చింది.
చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్..
Comments
Please login to add a commentAdd a comment