
బ్రేకింగ్ న్యూస్ జర్నలిస్టు ఇక లేరు!
హాంగ్ కాంగ్: ప్రఖ్యాత జర్నలిస్టు క్లేర్ హాలింగ్ వర్త్ (105)ఇకలేరు. జర్మన్ ట్యాంకులు కెట్వైస్ పోలిష్ పట్టణం చుట్టు ముట్టాయంటూ రెండవ ప్రపంచయుద్ధ వార్తను ముందుగా ప్రపంచానికి అందించిన బ్రిటిష్ జర్నలిస్టు క్లేర్ కన్నుమూశారు. లండన్ డెయిలీ టెలిగ్రాఫ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న ఆమె 1939, ఆగస్టు లో నాజీల దాడిని రిపోర్టు చేసి రెండవ ప్రపంచ యుద్ధ వార్తను బ్రేక్ చేసిన ఘనతను సాధించారు.
1911 అక్టోబర్ 10న ఇంగ్లాండ్ లో జన్మించిన క్లేర్ హాలింగ్ వర్త్ లండన్ డైలీ టెలిగ్రాఫ్ లో 27 వయస్సులో జర్నలిస్టులు కరియర్ మొదలు పెట్టారు. కేవలం ఒక వారంలోనే రెండవ ప్రపంచయుద్ధ వార్తతో జీవితకాలానికి మంచి పేరును సాధించారు. అసామాన్య ప్రతిభా పాటవాలతో జర్నలిజంలో అనేక అవార్డులను ఆమె గెలుచుకున్నారు. ముఖ్యంగా 'వాట్ ద పేపర్ సే' అనే జీవిత సాఫల్య పురస్కారాన్నికూడా అందుకున్నారు. విధి నిర్వహణలో అనేకస్లారు మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నారు. దశాబ్దాల పాటు తన సేవలందించిన హాలింగ్ వర్త్ ప్రమాదానికి చేరులో వార్తలను సేకరించడంలో దిట్ట. దాదాపు 100 మంది మృతికి కారణమైన 1946 లో, జెరూసలేంలో కింగ్ డేవిడ్ హోటల్ ను ఉగ్రవాదుల కూల్చివేసిన ఘటనలో ఆమె హోటల్ కు కేవలం 300 గజాల (మీటర్లు) దూరంలో ఉన్నారు. అలాగే వియత్నాం యుద్ధం, అల్జీరియన్ స్వాతంత్ర్య పోరాటంలో తదితర క్లిష్టమైన ఘట్టాలను ఆమె కవర్ చేశారు.
జెండర్ వివక్షను ఎదుర్కొంటూనే జీవితంలో వృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. జీవిత చరమాంకంలో కూడా అనేక అంతర్జాతీయ పత్రిలకు ఆర్టికల్స్ రాసేవారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ , ఆసియా వాల్ స్ట్రీట్ జర్నల్ కు వ్యాసాలు రాశారు. ఇటీవలే ఆమె 105 వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆమె మరణంతో జాతీయ, అంతర్జాతీయ మేధావులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.
కాగా క్వీన్ ఎలిజబెత్ II బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆర్డర్ ఆఫ్ ఆఫీసర్ గా హాలింగ్ వర్త్ పనిచేశారు. అలాగే మాజీ బ్రిటిష్ ప్రధానమంత్రి టెడ్ హీత్ , మాజీ హాంగ్ కాంగ్ గవర్నర్ క్రిస్ పాటెన్ సహా, పలు బ్రిటిష్ సైనికాధికారులు ఆమెకు అభిమానులుగా ఉండటం ఆమె జర్నలిజం ప్రతిభకు నిదర్శనం.