భారత్ మా నిజమైన భాగస్వామి
• మోదీతో ఫోన్‌లో ట్రంప్
• అమెరికా రావాలని మోదీకి ఆహ్వానం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత్ తమకు నిజమైన భాగస్వామి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిం చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజుల తర్వాత భారత ప్రధాని మోదీకి ట్రంప్ మంగళవారం రాత్రి ఫోన్ చేశారు. జనవరి 20న బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ బ్రిటన్, కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల అధినేతలతో ఫోన్‌లో సంభాషించారు. తాజాగా మోదీకి ఫోన్ చేశారు.
ఉగ్రవాదంపై పోరాటానికి ఇరు దేశాలు భుజం భుజం కలిపి పనిచేయాలని, రక్షణ, ఆర్థిక సంబం ధాలను మరింత బలోపేతం చేయాల ని ఈ సందర్భంగా ట్రంప్, మోదీ నిర్ణయించారు. ఫోన్ సంభాషణ సంద ర్భంగా ట్రంప్ భారత్‌లో పర్యటిం చాల్సిందిగా మోదీ ఆహ్వా నించారు. ద్వైపాక్షిక పర్యటన నిమి త్తంగా మోదీ అమెరికా రావాలని ట్రంప్ కూడా ఆహ్వానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కో వడంతో భారత్ తమకు నిజమైన మిత్రదేశం, భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నట్టు వైట్‌హౌస్ తెలిపింది.