జేబులో ఉన్న మొబైల్తో మంటలు! | phone catches fire in his pocket | Sakshi
Sakshi News home page

జేబులో ఉన్న మొబైల్తో మంటలు!

Published Mon, Mar 21 2016 10:18 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

జేబులో ఉన్న మొబైల్తో మంటలు! - Sakshi

జేబులో ఉన్న మొబైల్తో మంటలు!

ఇస్లామాబాద్: మొబైల్ ఫోన్ చార్జింగ్ పెడుతుంటే పేలిపోయిన ఘటనలు మనం చూశాం. అయితే జేబులో ఉన్న మొబైల్ ఫోన్కు అకస్మాత్తుగా మంటలంటుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

పాకిస్తాన్లో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి అప్పుడే బస్ దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అతని జేబులోని మొబైల్ ఫోన్ బ్యాటరీ నుండి అకస్మాత్తుగా మంటలు వెలువడి చూస్తుండగానే అతన్ని మొత్తం కమ్మేశాయి. దీంతో ఆర్తనాదాలు చేస్తూ అతడు రోడ్డుపై పరిగెడుతోంటే.. అక్కడి వారు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంతలోనే అక్కడి స్థానిక మార్కెట్లోని ఓ వ్యక్తి బకెట్తో నీళ్లు తీసుకొచ్చి అతనిపై పోయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తి ఎవరో దీనిని వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement