లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో విషాద ఘటన జరిగింది. శ్రీపాల్ అనే 50 ఏళ్ల రైతు పొలంలో ఫోన్ మాట్లాడుతుండగా అతనిపై పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తాడనుకున్న వ్యక్తిని విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాగా.. పోలీసులు రైతు ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీపాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు.
ఈ రైతు పొలం పనుల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం పడే సూచనలు కన్పించాయి. ఈ సమయంలోనే ఆయనకు కుటుంబసభ్యులు ఫోన్ చేయడంతో.. వారితో మాట్లాతుండగా పిడుగు అతనిపైనే పడింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఫోన్ భారీ శబ్దంతో సడన్‌గా ఆగిపోవడంతో కుటంబసభ్యులు భయంతో పొలానికి పరుగులు తీశారు. వ్యవసాయ క్షేత్రంలో శ్రీపాల్‌ను విగతజీవిగా చూసి షాక్ అయ్యారు.
చదవండి: ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. ఆరుగురు మృతి, పలువురికి అస్వస్థత
Comments
Please login to add a commentAdd a comment