అవునన్నా కాదన్నా మనం డిజిటల్ ప్రపంచంలోకి వచ్చాం. అయితే ‘అతి’ ఎప్పుడు మంచిది కాదని చరిత్ర చెబుతూనే ఉంది. సెల్‌ఫోన్ అతివాడకం వలన వచ్చే మానసిక సమస్యలు పక్కన పెడితే అసలు మనం మాట్లాడే భంగిమ సవ్యంగా లేదని, అది ‘టర్టెల్ నెక్ సిండ్రోమ్’కు దారితీస్తుందని అంటున్నారు శాస్త్రనిపుణులు. ‘సెల్‌ఫోన్ నా శరీరంలో భాగం. అది లేకుండా నేను లేను’ అనుకునే అతి సాంకేతిక ప్రేమికులను దారి మళ్లించడానికి లండన్ డిజైన్ స్టూడియో ‘స్పెషల్ ప్రాజెక్ట్స్’ పేపర్ ఫోన్ యాప్ రూపొందించింది.
కాల్ చేయడం, కాల్ రిసీవ్ చేసుకోవడం సంగతి సరే, ప్రతి అతి చిన్న విషయానికి కూడా సెల్‌ఫోన్‌పై ఆధారపడకుండా మనం తప్పనిసరి, అత్యవసరం అనుకున్న సమాచారాన్ని ఏ-4 పేపర్‌కు బదిలీ చేస్తుంది ఈ పేపర్ ఫోన్. కాసేపు అయినా ఫోన్‌కు దూరంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యమైన సమాచారాన్ని ప్రింట్ తీసుకొనిపెట్టుకోవడం ద్వారా కొంత సేపు అయిన ఆ డిజిటల్ బయట పడవచ్చు. అసలు యూజర్లు ఏయే విషయాలపై ఎక్కువగా సెల్‌ఫోన్‌పై ఆధారపడుతున్నారు, అందులో ముఖ్యమైనవి ఏమిటి? కానివి ఏమిటి? అనే విషయంపై వందలాది మందిని ఇంటర్వ్యూ చేసి సమాచారాన్ని సేకరించారు. ‘టెక్నాలజీని బ్యాలెన్స్ చేయడానికి పేపర్ ఫోన్ ఒక మార్గం’ అంటున్నాడు ‘స్పెషల్ ప్రాజెక్ట్’ కో-ఫౌండర్ ఆడ్రియన్.
Comments
Please login to add a commentAdd a comment