digital world
-
సురక్షిత డిజిటల్ ప్రపంచం కోసం!
కాలం మారుతున్నకొద్దీ, సాంకేతికతలు విస్తరిస్తున్నకొద్దీ కొత్త భయాలు పుట్టుకొస్తాయి. తమ పిల్లలు సోషల్ మీడియా వ్యామోహంవల్ల చెడిపోతున్నారని కొన్నాళ్లుగా తల్లిదండ్రుల్లో బెంగ పట్టు కుంది. అక్కడ తారసపడే విశృంఖల పోకడలు, తప్పుడు భావాలు పిల్లల మెదళ్లపై దుష్ప్రభావం కలగ జేస్తున్నాయి. వారి బాల్య, కౌమార దశలను కొల్లగొడుతున్నాయి. పిల్లలకు మాదకద్రవ్యాలు అల వాటు చేయడంలో సామాజిక మాధ్యమాల పాత్ర కాదనలేనిది. నిజానికి సోషల్ మీడియా దుర్వ్యసనంగా మారిన వైనమూ, దాని పర్యవసానాలూ చెదురుమదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చినప్పుడు కొత్త తలనొప్పులు సహజమే. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరవటానికి తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం ముసాయిదా నిబంధనలను కేంద్రం రూపొందించింది. అభ్యంతరాలు, సూచనలు వచ్చే నెల 18లోగా తెలియజేయాలని కోరింది.డేటా పరిరక్షణ కోసం, వ్యక్తిగత గోప్యత భద్రత కోసం ఒక చట్టం అవసరమన్న సంగతిని మన పాలకులు గ్రహించటంలో అలవిమాలిన జాప్యం చోటుచేసుకుంది. పౌరుల వేలిముద్రలు, బ్యాంకు ఖాతాలతో సహా సమస్త వివరాలనూ సేకరించే ఆధార్ వ్యవస్థ తీసుకొచ్చిన ఏడెనిమిదేళ్ల వరకూ ఆ డేటా పరిరక్షణకు ఎలాంటి కట్టుదిట్టాలు అవసరమన్నది ఎవరికీ తట్టలేదు. 2017లో జస్టిస్ పుట్టస్వామి పిటిషన్‌పై ఇచ్చిన తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను తొలిసారి ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మరో ఆరేళ్ల తర్వాత 2023 ఆగస్టులో డీపీడీపీ చట్టం వచ్చింది. దాని అమలుకు సంబంధించిన నిబంధనల రూపకల్పనకు మళ్లీ ఇన్ని నెలలు పట్టింది. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్న వర్త మానంలో ఈ అంశంపై ఇప్పటికైనా ముసాయిదా నిబంధనలు రావటం హర్షించదగ్గది. ప్రస్తుతం ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని వాతావరణంలో ప్రపంచం మనుగడ సాగిస్తోంది. గోడలకు చెవులుంటాయన్నది పాత సామెత. స్మార్ట్ ఫోన్లకు చెవులే కాదు... కళ్లు కూడా ఉంటున్నాయి. మనం పక్కవారితో సాగించే పిచ్చాపాటీని సైతం వినే సదుపాయం ఆ ఫోన్లలో ఉంటున్నదని, మన ఇష్టాయిష్టాలు తెలుసుకోవటం, వాటి ఆధారంగా డేటా రూపొంది క్షణాల్లో ఎవరెవరికో చేరిపోవటం రివాజైందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఫోన్లు వినియోగించనప్పుడు సైతం వాటి కెమెరాలు కళ్లు తెరిచే సాంకేతికత ఉన్నదంటున్నారు. ఇలాంటి ఫోన్లు తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లలకు ఎంత చేటు తీసుకురాగలవో ఊహించటానికి కూడా భయం వేస్తుంది. అందువల్లే ఎప్పుడెప్పుడు తగిన నిబంధనలు వస్తాయా అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తమ డేటా, బ్యాంకు ఖాతాల సమాచారం బయటకెలా పోతున్నదో తెలియక పెద్దలు కంగారు పడుతుంటే సామాజిక మాధ్యమాల్లో దుండగుల బారినపడి పిల్లలు తల్లడిల్లు తున్నారు. వినియోగదారుల డేటా సేకరణలో పారదర్శకతనూ, ఎందుకోసం సేకరిస్తున్నారో వెల్ల డించటాన్నీ నిబంధనలు తప్పనిసరి చేస్తున్నాయి. ఒకవేళ సంస్థల అజాగ్రత్త వల్ల లేదా ఉద్దేశపూర్వక చర్యవల్ల డేటా లీకైతే ఫిర్యాదు చేయటానికి కూడా ఏర్పాట్లున్నాయి. అలాగే సంస్థల్లో డేటా సేకర ణకు అనుసరిస్తున్న విధానాలను సవాలు చేయటానికి, వివరణ కోరటానికి అవకాశం ఉంది. నిబంధనల అమలును పర్యవేక్షించటానికి ప్రభుత్వం డేటా పరిరక్షణ బోర్డు (డీపీబీ) ఏర్పాటు చేస్తుంది. ఇదిగాక ప్రతి సంస్థా తమ ఖాతాదార్ల గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు, వినియోగదారుల నుంచి అవసరమైన అనుమతులు పొందేందుకు డేటా పరిరక్షణ ప్రత్యేక అధికారిని నియమించు కోవటం, నిఘా పెట్టడం తప్పనిసరవుతుంది. డేటా లీక్‌ను అరికట్టడంలో విఫలమయ్యే సంస్థకు రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. మొత్తంగా మనం పౌరుల డేటా పరిరక్షణలో వెనకబడినట్టే, సామాజిక మాధ్యమాల దుష్ప్ర భావాల నుంచి పిల్లల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న విషయంలోనూ వెనకబడ్డాం. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల్లో 137 దేశాలు చాన్నాళ్ల క్రితమే డేటా పరిరక్షణ చట్టాలు తెచ్చాయి. అమెరికాలో పదమూడేళ్లలోపు పిల్లలు ఆన్లైన్ వీక్షణపై కఠిన నిబంధనలున్నాయి. యూరప్‌లో పదహారేళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఆస్ట్రేలియా సామాజిక మాధ్యమాల్లో పదహారేళ్లలోపు పిల్లల ప్రవేశంపై ఇటీవలే పూర్తి నిషేధం విధించింది. మన దేశంలో లేదుగానీ... టిక్‌టాక్ వల్ల విదేశాల్లో ఎన్నో సమస్యలొస్తున్నాయి. టీనేజ్ పిల్లల్లో 58 శాతంమంది దాన్ని చూస్తు న్నారని ఒక సర్వే చెబుతోంది. పసిహృదయాలకు ఉండాల్సిన అమాయకత్వం మాయమై అవాంఛ నీయ పోకడలు ప్రవేశించి వారిలో విషబీజాలు నాటుతున్నాయి. తప్పుడు భావాలూ, అభిప్రా యాలూ వ్యాపిస్తున్నాయి. పిల్లల సంగతలావుంచి... పెద్దలే వాటి మాయలో పడి తప్పుడు నిర్ణ యాలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా కలిగే నష్టం నేరుగా కనబడుతుంది. కానీ మానసికంగా అది కలగజేసే ప్రభావం లెక్కకు అందనిది. ఇప్పుడు ఏఐ సైతం వచ్చి ప్రమాద తీవ్రతను పెంచింది. పిల్లల ముచ్చట కాదనకూడదని కార్లు, టూ వీలర్లు అందించి కొందరు తల్లిదండ్రులు పరోక్షంగా వారి చావుకు కారణమవుతున్నారు. ప్రజలకు ముప్పు కలిగిస్తున్నారు. అందువల్ల సామాజిక మాధ్య మాల్లో పొంచి వుండే ప్రమాదాలపై ముందు తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. పిల్లల సంరక్షణకు ఇది తప్పనిసరి. -
మీకు తెలుసా! ఆ ఊరికి లైఫ్ లైబ్రరీనే!
కరెంటు.. రోడ్డు.. మంచినీళ్ల వసతి .. గ్రామాభివృద్ధికి చిహ్నాలు! గ్రంథాలయం.. ఆ ఊరి చైతన్యానికి నిదర్శనం! ఈ డిజిటల్ వరల్డ్‌లో అలాంటి చైతన్యంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది పశ్చిమగోదావరి జిల్లాలోని కుముదవల్లి.. 127 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కందుకూరి విరేశలింగం కవిసమాజ గ్రంథాలయానికి చిరునామాగా నిలిచి! 1890వ దశకంలోకి వెళితే.. కుముదవల్లిలోని మధ్యతరగతి రైతుకుటుంబానికి చెందిన తిరుపతిరాజుకు పుస్తక పఠనం అంటే ప్రాణం. దానికి కారణం.. ఆ ఊరికే చెందిన పడ్రంగి చిన్నమారాజు.అప్పట్లో ఆయన తన దగ్గరున్న 50 పుస్తకాలను తిరుపతిరాజు తండ్రి లచ్చిరాజుకిచ్చి లైబ్రరీ ఏర్పాటుకు సాయపడ్డారు. తిరుపతిరాజులో పఠనాసక్తిని కలిగించింది ఆ గ్రంథాలయమే. అందులోని పుస్తకాల వల్లే స్వాతంత్య్ర సమరం గురించి తెలిసింది ఆయనకు. అలా తను చదివిన విషయాలన్నీ తన ఊళ్లోని వాళ్లకూ తెలియాలని.. తమ ఊరూ స్వాతంత్య్ర సమరంలో పాల్గొనాలని తపించారు తిరుపతి రాజు.ఆ చైతన్యం తన ఊరి ప్రజల్లో రావాలంటే తన తండ్రి ఏర్పాటు చేసిన ఆ చిన్న లైబ్రరీని మరిన్ని పుస్తకాలు, పత్రికలతో అభివృద్ధిపరచాలని నిర్ణయించుకున్నారు. అలా 1897 నవంబర్ 28న ఆ ఊళ్లో చిన్న గుడిసె వేసి ‘కందుకూరి వీరేశలింగం కవి సవూజ గ్రంథాలయం’ను ఏర్పాటు చేశారు. పుస్తకాలు, గ్రంథాలు, పత్రికలు కొనుగోలు చేయడానికి తిరుపతిరాజు తనకున్న ఎకరం భూమిని విరాళంగా ఇచ్చేశారు. ఈ గ్రంథాలయాన్ని స్వయంగా సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులే ప్రారంభించారు.గ్రంథాలయంలో పుస్తక పఠనం చేస్తున్న గ్రామస్థులు, అలనాటి పుస్తకాలుతిరుపతిరాజు.. కోరుకున్నట్టే స్థానికులు స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన సమాచారాన్ని గ్రంథాలయానికి వచ్చే పత్రికల్లో చదివి స్ఫూర్తిపొందారు. ఆ గ్రామం నుంచి దాదాపు 24 మంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. అలా ఆ గ్రంథాలయం దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించింది. 1934లో గ్రంథాలయోద్యమానికీ పట్టుగొమ్మగా నిలిచింది కుముదవల్లి. ఈ లైబ్రరీ గురించి విరేశంలింగం పంతులు స్వదస్తూరీతో ఇక్కడి మినిట్స్ బుక్‌లో రాసి, చేసిన సంతకం ఇప్పటికీ భద్రంగా ఉంది. రూథర్‌ఫర్డ్ రాసిన అభిప్రాయమూ అందులో కనపడుతుంది.పూరిగుడిసె నుంచి పక్కా భవనం.. కాలక్రమంలో ఈ లైబ్రరీ పూరిగుడిసె నుంచి పెంకుటిల్లుగా, దాన్నుంచి అధునాతన వసతుల భవంతిగా మారింది. అక్షరాస్యత వ్యాప్తి, స్త్రీ విద్య, వితంతు వివాహాలు, సహకార పరపతి సంఘం తదితర ప్రజోపయోగ అంశాలకు వైదికయింది. విజ్ఞాన గని.. ఇందులో.. ఎందరో మహామహులు రచించిన గ్రంథాలు, ప్రవుుఖుల చేతిరాత ప్రతులు వంటి అవుూల్యమైన అక్షర సంపద పోగై ఉంది.ఆత్మకథలు, వచనాలు, నవలలు, ఆధ్యాత్మిక, ఆయుర్వేదం, భారతి, ఆంధ్రపత్రిక, శారద, విజ్ఞానం, గృహలక్ష్మి, కృష్ణాపత్రిక, బాల వ్యాకరణం, వేదాంతసారం వంటి 17 వేల పుస్తకాలు కనిపిస్తాయిక్కడ. కోస్తా జిల్లాలోని విద్యార్థులు తెలుగుభాష, చరిత్రపై పీహెచ్డీ చేసేందుకు ఇది ఎంతో దోహదపడుతోంది. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, అయ్యంకి వెంకటరమణయ్య, చిలకవుర్తి లక్ష్మీనర్సింహం, దుగ్గరాల బలరామకృష్ణయ్య, అడివి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి, డాక్టరు సి నారాయణరెడ్డి, నండూరి కృష్ణవూచార్యులు వంటి పెద్దలు ఈ గ్రంథాలయానికి వస్తూపోతూండేవారట.ప్రత్యేకతలెన్నో..పుస్తక పఠనాన్ని ఈ గ్రామస్థుల జీవనశైలోలో భాగం చేసిన ఆ గ్రంథాలయాభివృద్ధి కోసం కుముదవల్లి ఓ సంప్రదాయాన్ని పాటిస్తోంది. అక్కడ ఎవరి పెళ్లి జరిగినా ఎంతోకొంత డబ్బును ఆ లైబ్రరీకి విరాళంగా ఇస్తూ! ఇప్పటికీ ఆ లైబ్రరీని దేవాలయంగా భావిస్తారు కుముదవల్లి వాసులు. పాదరక్షలతో లోనికి వెళ్లరు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి లైబ్రేరియన్‌గా పెనుమత్స సూర్యసుగుణ సేవలందిస్తున్నారు. ఆధునిక సాంకేతికతకనుగుణంగా ఆ లైబ్రరీలోని పుస్తకాల డిజిటలైజషన్ ప్రక్రియా మొదలైంది. – విజయ్‌కుమార్ పెనుపోతుల -
Cover Story: వర్చువల్ లోకం కొంచెం వెర్రి.. కొంచెం వర్రీ
వాస్తవం కన్నా కల్పనే అందంగా ఉంటుంది! ప్రాక్టికాలిటీ కన్నా భ్రమే ఆనందాన్నిస్తుంది! నిజానికి బంధనాలుంటాయి.. ఊహలకు ఆకాశం కూడా హద్దు కాదు! అందుకే వర్చువల్ వరల్డ్‌లో అందరూ హీరోలే.. అసలు ఆ కిక్కే వేరప్పా! కల చెదిరి.. స్పృహలోకొచ్చాక రియాలిటీ ఇచ్చే షాక్ కూడా వేరప్పా! వర్చువల్ ప్రభావాలు.. రియాల్టీ ప్రమాదాలు ఇప్పుడు చర్చనీయాంశాలు! పాతికేళ్ల కిందట.. మ్యాట్రిక్స్ అనే హాలీవుడ్ సినిమా ప్రపంచాన్ని ఊపేసింది. ఇంటెలిజెంట్ మెషిన్లు అందులో మనుషుల శరీరాలను ఎనర్జీ సోర్స్‌గా ఉపయోగించుకుని.. అచ్చంగా వారిని పోలిన రూపాలతో వర్చువల్ వరల్డ్‌ని రూపొందించి తామనుకున్న సంఘ వ్యతిరేక పనులు చేస్తుంటాయి. ఈ వర్చువల్ బాడీకి ఏదైనా ప్రమాదం జరిగితే దాని తాలుకు ప్రభావం ఎనర్జీ సోర్స్ రూపంలో ఉన్న అసలైన మనిషిపై కనిపిస్తుంటుంది. ఆఖరికి వర్చువల్ వరల్డ్ కారణంగా ఎనర్జీ సోర్సెస్ చనిపోతాయి కూడా! పన్నెండేళ్ల కిందట.. వచ్చిన ‘అవతార్’ సినిమా కూడా అలాంటిదే. పండోరా గ్రహంలో ఉన్న అపార సహజ వనరులపై కన్నేసిన మనుషులు వాటిని సొంతం చేసుకునేందుకు తమ శరీరాలను ఎనర్జీ సోర్స్‌గా ఉపయోగించుకుంటూ వర్చువల్ మనుషులను తయారు చేస్తారు. ఆ పండోరా గ్రహవాసులు, వర్చువల్ మనుషుల మధ్య ప్రేమానుబంధాలు, కుట్రకుతంత్రాలతో పండోరా మీద మనుషుల ఆధిపత్య పోరుతో సాగుతుంది సినిమా. తాజాగా.. ఓటీటీలో హల్చల్ చేస్తోన్న హారర్ కామేడీ.. ‘కంజూరింగ్ కన్నప్పన్స్’ అనే తమిళ సినిమా ‘డ్రీమ్ క్యాచర్’ పాయింట్ చుట్టూ తిరుగుతుంది. నిజ జీవితంలో సాధ్యంకాని విషయాలను కలలో సాధ్యం చేసుకోవడమనే అంశంపైనే ఈ సినిమా నడుస్తుంది. అయితే ఇందులోని క్యారెక్టర్స్‌కి ఆ కలలో అనుకోకుండా ఎదురయ్యే ప్రమాదాల వల్ల నిజ జీవితంలోనూ ముప్పు వాటిల్లుతుంది. చివరకు జీవితం భయానకం అవుతుంది. కలల మీద అంతకుముందే హాలీవుడ్లో ‘ఇన్స్సెప్షన్స్ ’ పేరుతో ఒక సినిమా వచ్చింది. పై చిత్రాలన్నీ ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్స్ ఆధారంగా ‘వర్చువల్ వరల్డ్’ కేంద్రంగా వచ్చినవే. మన జీవితాల్లో వర్చువల్ వరల్డ్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలను కళ్లకుకట్టే ప్రయత్నం చేసినవే. అలా సిల్వర్స్క్రీన్స్కే పరిమితమైన వర్చువల్ వరల్డ్ మెల్లమెల్లగా రియల్ వరల్డ్‌లోకీ చేరింది. అందరూ ఊపయోగించే వాట్సాప్ నుంచి పబ్జీ వంటి గేమ్స్, స్నాప్‌చాట్ వంటి యాప్‌ల దాకా ప్రత్యేకంగా అవతార్లు పుట్టుకొస్తున్నాయి. ఆ యాప్‌లను వాడే కొద్దీ తమ రియల్ వరల్డ్‌లోని బాడీ కంటే యాప్‌లలో ఉపయోగించే అవతార్లనే మనుషులు మానసికంగా సొంతం చేసుకోవడం మొదలైంది. గంటల తరబడి వాటితోనే గడుపుతున్నారు, లక్షల కొద్ది డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆఖరికి ఆ వర్చువల్ అవతార్‌కి ఏమైనా అయితే దాని తాలుకు లక్షణాలతో మనుషులు రియల్ వరల్డ్‌లో మంచం పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. అయితే ఇంగ్లండ్‌లో జరిగిన ఘటన వర్చువల్ వరల్డ్‌పై మరింత చర్చకు కారణమైంది. సరికొత్త ఐడెంటిటీ రియల్ వరల్డ్‌లో.. పుట్టిన ఊరు, కుటుంబం వంటి తదితర వివరాలతో సామాజికంగా మనుషులకు ఒక గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ పరంగా అయితే ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ పాస్‌పోర్ట్‌తో వ్యక్తిగత గుర్తింపు లభిస్తుంది. కానీ డిజిటల్ వరల్డ్ దీనికి భిన్నం. నిర్ధారిత తనిఖీ, పరిశీలన, విచారణ వంటివేమీ లేకుండానే గుర్తింపును పొందే వీలుంటుంది. సోషల్ మీడియాలోని ఒక్కో ఫ్లాట్‌ఫామ్‌లో.. ఓక్కో యాప్‌లో ఒకే మనిషి పదుల సంఖ్యలో ఐడెంటిటీలు పొందవచ్చు. దీంతో డిజిటల్ వరల్డ్‌లో అసలైన ఊరు, పేరు తెలియకుండానే చలామణి కావొచ్చు. సామాజిక కట్టుబాట్లు, ఇంట్లో వాళ్ల ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విహరించవచ్చు. ఈ వెసులుబాటు కారణంగానే యువతరం మొదలు పెద్దల వరకు అంతా డిజిటల్ ఐడెంటిటీ వైపు అడుగులు వేస్తున్నారు. నిజమైన గుర్తింపులేని ఈ తీరే మోసాలకు కారణమవుతోంది. డీపీలతో గిట్టని వ్యక్తులను అప్రతిష్ఠపాలు చేయడానికి ఫేక్ ఫొటోలతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అభాసుపాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ చర్యలు ముఖ్యంగా మహిళలను ఇబ్బందిపెడుతున్నాయి. అవమానాలకు గురిచేస్తున్నాయి. పరిచయస్తులు, మొన్నటి వరకు మనతో ఉన్న వాళ్లే.. స్పర్థల కారణంగా దూరమైతే చాలు టార్గెట్ మహిళల ఫొటోలు, ఫోన్స్ నంబర్లను పోర్న్స్ సైట్లలో పెడుతూ తీవ్రమైన మానసిక హింసకు పాల్పడుతున్నారు. లేదా ఫేక్ డీపీలతో చాటింగ్ చేస్తూ మోసాలకు దిగుతున్నారు. స్త్రీ, పురుష స్నేహాలతోనే కాకుండా మరోరకం నకిలీ ఖాతాలకూ ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఆ నకిలీ ఖాతాలు చక్కగా మనతో ఇన్స్బాక్స్ లేదా డైరెక్ట్ మెసేజెస్‌తోనే స్నేహాన్ని పెంచుకుంటాయి. హఠాత్తుగా.. చాలా అవసరం పడిందని.. ఫలానా అంత నగదు పంపాలంటూ వేడుకుంటాయి. తిరిగి చెల్లిస్తామని నమ్మబలుకుతాయి. నమ్మి నగదు పంపిన వెంటనే డిసపియర్ అయిపోతాయి. ఫేస్బుక్లో దాదాపు అందరూ ఈ నకిలీ ఖాతాలు – మనీ రిక్వెస్ట్‌లకు బాధితులుగా మారారు. దీన్ని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకుండాపోతోంది. నకిలీ గుర్తింపు ఆధారంగా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. డీప్ ఫేక్‌తో ఇటీవల సినిమా నటి రష్మికా మందన్న డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా అమెరికా, యూరప్ దేశాల్లో ఈ డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి సంబంధించి.. డీప్ ఫేక్ వీడియోలు కోకొల్లలుగా వచ్చాయి. రెండు వేర్వేరు వీడియోలను కలుపుతూ నిఖార్సైన నకిలీని క్రియేట్ చేయడంలో డీప్ ఫేక్‌లు ఆరితేరిపోయారు. దశబ్దాల కిందటే మార్ఫింగ్ అనేది ఉనికిలోకి వచ్చినా దాన్ని గుర్తించడం తేలికే. ఎక్కడో కంప్యూటర్ గ్రాఫిక్స్, వీఎఫెక్స్ వాడితే తప్ప సహజంగా అనిపించేది కాదు అది. కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ.. చేతిలోని స్మార్ట్ ఫోన్స్‌తో ఫేక్‌ని క్రియేట్ చేయగలుగుతుండటంతో సమస్య తీవ్రమైంది. నకిలీ వర్సెస్ అవతార్ డిజిటల్ దునియా/వర్చువల్ వరల్డ్‌లో నకిలీ ఖాతాలను సృష్టించడం వెనుక కచ్చితమైన ఉద్దేశం అర్థమవుతోంది. ఆర్థికంగా దోచుకోవడం, పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసి మానసికంగా కుంగదీయడం వాటి ప్రధాన లక్ష్యాలు. కొన్నిసార్లు ఎదుటి వారితో ఆడుకోవడానికీ నకిలీ ఖాతాలు వస్తున్నాయి. వీటిని సృష్టించే వారు తమకు సంబంధించిన వివరాలను ఆ ఖాతాలో పొందుపరచరు. ఇందుకు భిన్నం అవతార్. పూర్తిగా మనకు సంబంధించిన మరో రూపమే అవతార్ అన్నట్టుగా ఉంటుంది. మన అవతార్‌కు ఎలాంటి హెయిర్ స్టైల్ ఉండాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, శరీరం రంగు ఎలా ఉండాలి.. వంటి అన్ని విషయాల్లో మన ఇచ్ఛకు తగ్గట్టుగా వర్చువల్ అవతార్‌ను రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ అవతార్తోనే సోషల్ మీడియా, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్, ఆన్స్లైన్స్ గేమ్స్‌లో పాల్గొనవచ్చు. ఈ పాల్గొనడమే చెలరేగే స్థాయికి చేరితే వర్చువాలిటీ రియాల్టీకి మధ్య ఉండే గీత చెరిగిపోతుంది. ఆ తర్వాత వర్చువల్‌గా జరిగే విషయాలకు రియాల్టీలో నష్టపోవాల్సి వస్తుంది. మానసిక ఆనందం కోసం వచ్చిన వర్చువల్ వరల్డ్ చివరకు మానసిక వేదనకు దారి తీస్తోంది. ఇలా ఇబ్బందులకు గురవుతున్న వారిలో టీనేజర్లు, మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. అసలు కంటే ఎక్కువ రియల్ వరల్డ్‌లో ఉన్న గుర్తింపు కంటే డిటిజల్ దునియాలో దక్కే గుర్తింపే ఎక్కువ అనుకునే వారు పెరుగుతున్నారు. ఉదాహరణకు మోస్ట్ పాపులర్ పబ్జీ గేమ్. ఈ గేమ్‌ను.. ఆన్స్‌లైన్స్‌లో ఎవరికి వారు తమ ‘అవతార్’ను ఎంచుకుని ఏక కాలంలో ఆడుకునే వీలుంది. అవతార్ ధరించే డ్రెస్‌లు, వాడే ఆయుధాలకు ఇక్కడ రేట్ ఫిక్స్ అయి ఉంటుంది. ఒక్కో లెవెల్‌ను దాటుకుంటూ ఈ అవతార్లు గేమ్‌లో ముందుకు వెళ్తుంటాయి. ఆయా లెవెల్స్ ఆధారంగా ఆ ఆటగాడు ఎంతటి మొనగాడనే గుర్తింపును డిజిటల్ దునియా ఇస్తుంది. ఈ రికగ్నిషన్స్ ఇచ్చే కిక్ కోసం పరీక్ష ఫీజులు మొదలు.. తల్లిదండ్రుల అకౌంట్ల దాకా డబ్బును స్వైప్ చేయడానికి ఏ మార్గం దొరికినా వదలకుండా లక్షల రూపాయలను ఈ గేమ్స్ కోసం ధారపోసే గేమర్లు ఉన్నారంటే ఆశ్చర్యమూ అతిశయోక్తీ ఎంతమాత్రం లేదు.. కాదు. చిక్కులు వాస్తవ ప్రపంచంలో.. మనుషులు తప్పులో.. నేరాలో చేస్తే వాటిని అరికట్టేందుకు, శిక్షించేందుకు చట్టాలు, శిక్షాస్మృతులున్నాయి. కానీ రోజురోజుకూ విస్తరిస్తున్న డిజిటల్ దునియాలో జరుగుతున్న మోసాలు, నేరాలకు అడ్డుకట్ట వేసేదెలా అన్నదే అంతు చిక్కని ప్రశ్న. దీనిపై ఇప్పటికే కొన్ని దేశాలు చట్టాలను తయారుచేసుకున్నాయి. మరికొన్ని పకడ్బందీ చట్టాలను రూపొందించే పనిలో ఉన్నాయి. అయితే డిజిటల్ దునియాలో.. ప్రపంచంలోని ఓ మూలనున్న వారు మరో మూలనున్న వారిని మోసం చేసేందుకు, వేధించేందుకు అవకాశం ఎక్కువ. సైబర్ క్రైమ్‌కి సంబంధించిన చట్టాలు వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటాయి. దీంతో నేరాలు, మోసాలకు పాల్పడిన వారిని పట్టుకోవడమే కష్టం అనుకుంటే వారిని ఏ చట్టాల పరిధిలో శిక్షించాలనేది మరో తలనొప్పిగా మారింది. మెటావర్స్ డిజిటల్ దునియా కారణంగా ఇలాంటి సమస్యలు ఒకొక్కటిగా ముందుకు వస్తున్నా టెక్నోక్రాట్స్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడంలేదు. సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకర్‌బర్గ్.. మనం జీవిస్తున్న యూనివర్స్‌కి పోటీగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్‌స్టాగ్రామ్‌లో మెటావర్స్‌ను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే ప్రకటించారు. రెండేళ్ల కిందట ఆయన మెటావర్స్‌ను పరిచయం చేశారు కూడా. అది ఆశించిన స్థాయిలో జనాల్లోకి చొచ్చుకుపోలేదు. అయితే మరింత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే యూనివర్స్‌కి పోటీగా మెటావర్స్ లేదా మరోవర్స్ రావొచ్చు. ఇలాంటి ప్రత్యామ్నయ ‘వర్స్’ల కారణంగా ఏర్పడే దుష్పరిణామాలకు ఎలా చెక్ పెట్టాలన్నది ఇటు టెక్నోక్రాట్స్, అటు దేశాధినేతల ముందున్న సవాల్. ఎప్పటి నుంచో నిజ జీవితంలో సాధ్యం కాని విషయాలను ఊహల్లో సాధ్యం చేసుకోవడం మనిషి పుట్టుక నుంచీ ఉన్నదే. దానికి కథలు, కవితలు ఇతర కళారూపాలను సాధనాలుగా మలచుకోవడం నాగరికత నేర్పిందే. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వర్చువల్ టెక్నాలజీ రూపంలో మనుషులకు కొత్త కొత్త అవతార్లను సృష్టించి ఇస్తోంది. ఆనందలోకంలో తిప్పుతోంది. కానీ క్రమంగా సీన్స్ రివర్స్ అవుతోంది. డిజిటల్ అవతార్ రూపంలో ఉన్న మనిషి ‘టార్గెట్’ అవుతున్నాడు. వర్చువల్ వరల్డ్‌లో జరిగిన సంఘటనలకు ఇచ్చే ప్రతి స్పందనలతో భౌతిక ప్రపంచంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు. వర్చువల్ వరల్డ్‌లో దాడికి గురైన వ్యక్తులు రియల్ వరల్డ్‌లో అసలైన బాధితులుగా మారుతున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిందితులను ఎలా పట్టుకోవాలి ? వారిని ఎలా శిక్షించాలి ? రియల్ వరల్డ్ తరహాలోనే వర్చువల్ వరల్డ్ విషయంలోనూ చట్టాలు తయారు చేయాలనే ప్రశ్నలు ఉత్నన్నమవుతున్నాయి. పరిష్కారమార్గాల అన్వేషణలో కాలయాపన తగదని ఇంగ్లండ్ అవతార్ రేప్ ఘటన చెబుతోంది. చట్టాల రూపకల్పన వేగంవంతం కావాలని హెచ్చరిస్తోంది. వర్చువల్ రేప్ ఇంగ్లండ్‌లో ఓ మైనర్ బాలిక ఆన్స్‌లైన్స్‌లో వర్చువల్ గేమ్‌కు బాగా అలవాటు పడింది. ఆ గేమ్‌లో తన అవతార్‌తో మమేకమైపోయింది. గ్రూప్‌గా ఆడే ఆ గేమ్‌లో కొందరు మగ అవతార్లు ఈ మైనర్ బాలిక అవతార్‌పై కన్నేశారు. గేమ్ ఆడుతూ ఆ బాలిక అవతార్‌పై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. గేమ్‌లో పూర్తిగా లీనమైపోయిన ఆ అమ్మాయి ఆ వర్చువల్ గ్యాంగ్ రేప్‌కు కంపించిపోయింది. వాస్తవంగానే తనపై లైంగికదాడి జరిగినట్టుగా ట్రామాలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అమల్లో ఉన్న చట్టాల ద్వారా ఆ వర్చువల్ గ్యాంగ్ రేప్‌ని ఎలా నిర్ధారించాలి? దానికి కారణమైన నిందితులను ఎలా గుర్తించాలి? ఏ గ్రౌండ్ మీద వారిని శిక్షించాలనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. మొత్తానికి విషయం వైరల్ అయింది. వర్చువల్ వరల్డ్‌కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంకా అలసత్వం తగదంటూ ఒకరకంగా ప్రపంచాన్ని హెచ్చరించిందీ సంఘటన. ఏకాభిప్రాయం ఉండాలి ఫేస్బుక్, యూట్యూబ్‌లో అసభ్య పదజాలంతో దూషించే వారిని పట్టుకుని శిక్షించడమే కష్టమవుతుంటే.. డిజిటల్ వరల్డ్‌లో వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత డిజిటల్ రైట్స్ అనే సమస్యలకు పరిష్కారం చూపడమనేది ఇంకా బాలారిష్టాలనే దాటలేకపోతుంటే.. వీటి తర్వాత లెవెల్లోని డిజిటల్ వరల్డ్, వర్చువల్ రియాల్టీలో జరుగుతున్న .. జరిగే అరచాకాలను అరికట్టడం సాధ్యమయ్యే పనేనా అనిపిస్తోంది. వాటిని నిలువరించే సమర్థవంతమైన వ్యవస్థలు, చట్టాలు ఇంకా రాలేదనే చెప్పాలి. ఇది అనేక సంక్లిష్టతలతో కూడుకున్నది. డిజిటల్ వరల్డ్, వర్చువల్ రియాల్టీలో క్రియేట్ అవుతున్న సమస్యలపై ప్రపంచ దేశాలు ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ట్రోలింగ్, బులీయింగ్, డిఫమేషన్స్ వంటి అంశాలపై అందరికీ ఏకాభిప్రాయం ఉండాలి. నేరం/ఘటన ఎక్కడ జరిగినా అందుకు సంబంధించిన వ్యక్తులను పట్టుకోవడం, విచారణ చేయడంలో దేశాల మధ్య ఒప్పందాలు జరగాలి. అదేవిధంగా వర్చువల్ /డిజిటల్ వరల్డ్‌కి సంబంధించిన అంశాలపై సామాన్యులకూ అవగాహన కలిగేలా కెపాసిటీ బిల్డింగ్ జరగాలి. కనీసం అవతార్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీగా మారాలి. అప్పుడే జరగబోయే అనర్థాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. – అనిల్ రాచమల్ల, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగిస్తున్న సాంకేతిక నిపుణులు కేసులు పెరుగుతున్నాయి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 2022లో.. సైబర్ క్రైమ్‌కి సంబంధించి దేవశ్యాప్తంగా 65,843 కేసులు నమోదు అయ్యాయి. వాటిల్లో అత్యధికంగా చీటింగ్ కేసులు 42,710 (64.8 శాతం) ఉండగా బెదిరింపులకు పాల్పడిన కేసులు 3,648 (5.5 శాతం) ఉన్నాయి. ఇక సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్స్కి సంబంధించి 3,434 (5.2 శాతం) కేసులు నమోదయ్యాయి. సైబర్ కేసుల పెరుగుదలను పరిశీలిస్తే 2012లో దేశవ్యాప్తంగా 3.693 కేసులు నమోదుకాగా 2022కి వచ్చేసరికి ఈ సంఖ్య 65,893కి చేరుకుంది. నమోదు కాని కేసులు సంఖ్య ఇంతకు నాలుగింతలు ఉండొచ్చని అంచనా. గత దశాబ్దకాలంగా స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం పెరగడంతో అదే స్థాయిలో సైబర్ కేసుల తీవ్రతా పెరుగుతోంది. 2012లో దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నవారు 12.5 శాతం ఉండగా 2022 చివరికి అది 76.6 శాతానికి పెరిగింది. హై స్కూల్ పిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్స్ ఉంటోంది. ప్రస్తుతమైతే సైబర్ నేరాల్లో ఆర్థిక నేరాలదే అగ్రస్థానం. సరైన జాగ్రత్తలు, నియంత్రణ లేని పక్షంలో లైంగిక వేధింపులు, మానసిక సమస్యలకూ డిజిటల్ దునియానే ప్రధాన కారణం కావడానికి అవకాశాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. పేరెంట్స్‌పైనే భారం ఇంటర్నెట్ వినియోగం నేడు అనివార్యమైపోయింది. చిన్నా, పెద్దా అందరికీ అత్యవసరం అయింది. అయితే అవసరానికి.. వ్యసనానికి మధ్య ఉన్న హద్దును అందరూ మరచిపోతున్నారు. ముందు తేరుకోవాల్సింది పెద్దలే. ఇంటర్నెట్నే ఇల్లులా భ్రమపడుతున్న పిల్లలను ఆ మాయజాలం నుంచి బయటకు తేవాల్సిన బాధ్యత పెద్దలదే. అవసరానికి.. వ్యసనానికి మధ్య ఉన్న గీత మీద అవగాహన కల్పించాలి. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన గోపత్యను పాటించడం ఇప్పుడు చాలా అవసరం. అన్నీ గూగుల్లోనే ఉన్నాయిశ వేవ్‌లో పడిపోయిన నేటి తరం అంతర్జాలంలో తమ వ్యక్తిగత వివరాలను ప్రూవ్స్తోసహా (ఫొటోలు, వీడియోలు వగైరా) ఎంత తక్కువగా అప్ డేట్ చేస్తే అంత సేఫ్‌గా ఉండొచ్చనే ఫ్యాక్ట్‌ని బ్రెయిన్స్ చిప్‌లోకి ఎక్కించాలి. ‘వర్చువల్ వరల్డ్ అనేది ఒక భ్రాంతి.. అదొక కాలక్షేపం..’ అనే సత్యాన్నీ వీలైనన్ని సార్లు మెదడులో సేవ్ చేయించాలి. ఇదీ పేరెంటింగ్‌లో భాగం కావాలి. -కృష్ణగోవింద్ -
International Youth Day 2022: చైతన్యతరంగాలు.. ఈ ప్రపంచమే నా ఊరు!
‘నా ఊరే నా ప్రపంచం’ అనే పరిమిత భావనకు భిన్నంగా– ‘ఈ ప్రపంచమే నా ఊరు’ అంటూ వివిధ రకాల సామాజిక అంశాలపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తుంది యువతరం... నిధి మయూరిక బెంగళూరుకు చెందిన నిధి మయూరికకు చిన్నప్పటి నుంచి అంతరిక్షం అంటే అంతులేని ఆసక్తి. పదకొండు సంవత్సరాల వయసులోనే ‘ఆస్ట్రోబయోలజీ’ చదవడం మొదలుపెట్టింది. 2016లో నాసా ఏమ్స్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో పాల్గొంది. ‘సైకతం’ పేరుతో డిజైన్ చేసిన త్రీ లెవెల్ స్పేస్ కాలనీ, ఆ తరువాత రూపొందించిన ‘స్వస్తికం’.. ‘సొహం’ డిజైన్లు మొదటి బహుమతి గెలుచుకున్నాయి. ఈ బహుమతులతో సైన్స్‌పై తన ఆసక్తి రెట్టింపు అయింది. గొప్ప శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు చదవడం మొదలుపెట్టింది. స్పేస్సైన్స్ను ప్రమోట్ చేయడానికి రకరకాలుగా కృషి చేస్తున్న సొసైటీ ఫర్ స్పేస్ ఎడ్యుకేషన్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌లో టీమ్‌లీడర్‌గా పనిచేస్తుంది నిధి. యూఎన్ ఉమెన్ ఇండియా సొసైటీ ఫర్ స్పేస్‌లాంటి ఆర్గనైజేషన్లలోని యంగ్ లీడర్స్‌తో కలిసి పనిచేస్తోంది. జెండర్–సెన్సిటివిటీ ప్రకటనలు, సినిమాలు, సాహిత్యంలో ఉదాత్తమైన మహిళల పాత్రలు, స్త్రీల హక్కులు...ఇలా ఎన్నో విషయాల గురించి అనర్గళంగా మాట్లాడగలదు నిధి. ‘నేను పయనిస్తున్న దారిపై నమ్మకం ఉంది. నేను ఆశావాదిని. మార్పు త్వరలోనే సాధ్యపడుతుందని నమ్ముతున్నాను’ అంటున్న నిధి మయూరిక ‘ఐయామ్ జనరేషన్ ఈక్వాలిటీ’ అని నినదిస్తోంది. పాత, కొత్తతరం అనే తేడా లేకుండా అందరం ఎడ్యుకేట్ కావాలి అంటుంది నిధి మయూరిక. దేవిష్ ఝా 19 సంవత్సరాల దేవిష్ ఝా హైస్కూల్లో చదివేరోజుల నుంచే ఇంటర్నేషనల్ క్లైమెట్ ఆర్గనైజేషన్ ‘జీరో అవర్’ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. పర్యావరణ విధ్వంసం గురించి బాధపడుతూ కూర్చోవడం కంటే ఈతరం, భవిష్యత్తరాలను దృష్టిలో పెట్టుకొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలి అంటుంది దేవిష్. ‘ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయకార్యక్రమాల్లో పాల్గొనాలి. జీరో అవర్లాంటి అంతర్జాతీయ సంస్థల గురించి ప్రచారం చేయాలి. వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని ఫ్రెండ్స్, కుటుంబసభ్యులతో పంచుకోవాలి... ఇవి క్లైమెట్ యాక్టివిస్ట్ ప్రధానబాధ్యతలు’ అంటుంది దేవిష్. ‘యువతరంలో ప్రతి ఒక్కరికీ సంకల్పబలం ఉంది. బలమైన గొంతుక ఉంది. అది సామాజిక మార్పుకు ఉపయోగపడాలి’ అంటుంది దేవిష్. ఈతరం ప్రతినిధులందరూ సుందర భవిష్యత్ నిర్మాణానికి తమవంతుగా కృషి చేయాలని అంటుంది 23 సంవత్సరాల అవని అవస్తి. అంటార్కిటికా యాత్రకు అవకాశం వచ్చినప్పుడు తన వయసు 18 సంవత్సరాలు. తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ‘అక్కడి వాతావరణం తట్టుకోవడం కష్టం. నువ్వు ఏమైనా అబ్బాయివా! ఈ డబ్బును నీ పెళ్లి కోసం బ్యాంకులో పొదుపు చేస్తే మంచిది’ అన్నారు. ఇలాంటి సంఘటనలు తన ఉత్సాహాన్ని నీరుగార్చలేకపోయాయి. అంటార్కిటికాలో దేశదేశాల నుంచి వచ్చిన యువతరంతో మాట్లాడే అవకాశం అవనికి లభించింది. ఎన్నో విషయాలు తెలుసుకునేలా చేసింది. విస్తృతప్రపంచాన్ని దర్శించినట్లు అనిపించింది. ‘రీసైకిల్ ఆర్మీ’ ద్వారా రీసైకిలింగ్, జలసంరక్షణ....మొదలైన విషయాలపై విస్తృత ప్రచారం చేసిన అవని– ‘వయసుతో నిమిత్తం లేకుండా అన్ని తరాల వాళ్లు పర్యావరణ పరిరక్షణకు తమవంతు ఆలోచన చేయాలి. ఆచరించాలి’ అంటుంది. త్రిష శెట్టి.. ‘షీ సే’ ముంబైకి చెందిన త్రిష శెట్టి ‘షీ సే’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా స్త్రీ చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్త్రీల భద్రతపై ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘ఆన్లైన్లో బార్ల గురించి సమాచారం వెదికితే క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. బాధితులకు సంబంధించిన సమాచారం మాత్రం కనిపించదు’ అంటున్న త్రిష బాధితులకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఐక్యరాజ్య సమితి ‘యంగ్ లీడర్స్’ జాబితాలో చోటు సంపాదించిన త్రిష శెట్టి ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ సదస్సులలో పాల్గొనడం ద్వారా తన ఉద్యమ కార్యచరణకు పదును పెడుతుంది. ..... రకరకాల సామాజిక అంశాలపై అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కలిసి పనిచేస్తున్న యువతరంలో వీరు కొందరు మాత్రమే. ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారికి ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా అభినందనలు తెలియజేద్దాం. చదవండి: సమ గౌరవమే సరైన రక్ష -
Youtube Studio: డిజిటల్ వరల్డ్ మీకు నచ్చేలా మీరు మెచ్చేలా..
యూట్యూబ్ తెలిసినంతగా చాలామందికి యూట్యూబ్ స్టూడియో తెలిసి ఉండకపోవచ్చు. ఆ స్టూడియోలో ఏం ఉంటాయి? క్రియేటర్లకు దారి చూపించే విశ్లేషణ పరికరాలు ఉంటాయి. మన బండికి వేగం పెంచే ఇంధనాలు ఉంటాయి... ‘యూట్యూబ్ స్టూడియో’ క్రియేటర్స్‌కు ఇల్లులాంటిది. ఆ ఇంటిలో చిన్నవాళ్లకు విలువైన సలహాలు ఇచ్చే పెద్దమనిషిలాంటిది. భరోసా ఇచ్చే బాస్లాంటిది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా వీజి. దాన్ని నిలబడేలా చేయడం, పరుగెత్తేలా చేయడం శానా కష్టం. ఇది ఎందరికో అనుభవంలో ఉన్న విషయం. యూట్యూబ్ ఛానల్ హిట్టు,ఫట్టు వెనుక ‘అదృష్టం’ పాత్ర ఏమీ ఉండదు. మన పాత్రే ఉంటుంది. ఆ పాత్ర రక్తి కట్టాలంటే, మీరు విజయపథంలో దూసుకెళ్లాలంటే.. మీకు అవసరమైనది యూట్యూబ్ స్టూడియో. ఆడియన్స్ ఇంటరాక్షన్ నుంచి ఛానల్ డెవలప్మెంట్ వరకు రకరకాలుగా ఉపయోగపడుతుంది. యూట్యూబ్ స్టూడియోలో.. ఛానల్ డ్యాష్‌బోర్డ్, వీడియోస్, ప్లేలిస్ట్, ఎనాలిటిక్స్, కామెంట్స్, సబ్‌టైటిల్స్, మోనిటైజేషన్, కస్టమైజేషన్, ఆడియోలైబ్రరీ.. మొదలైన ఫీచర్లు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి ప్లేలిస్ట్, ఎనలిటిక్స్. ఛానల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండాలంటే ప్లేలీస్ట్లు తప్పనిసరి. యూట్యూబ్ స్టూడియోలో ప్లేలీస్ట్లు క్రియేట్ చేయడానికి... 1.సైన్ ఇన్ యూట్యూబ్ స్టూడియో 2. లెఫ్ట్ మెను, సెలెక్ట్ ప్లేలీస్ట్ 3. క్లిక్–న్యూ ప్లే లీస్ట్ 4.ఎంటర్–ప్లే లీస్ట్ టైటిల్ 5. సెలెక్ట్–ప్లేలీస్ట్ విజిబిలిటీ సెట్టింగ్స్ 6. క్లిక్ ఆన్ క్రియేట్ ఎడిట్ చేయడానికి...1.సైన్ ఇన్ యూట్యూబ్ స్టూడియో 2. సెలెక్ట్ ప్లేలీస్ట్ 3.ఎడిట్–క్లిక్ 4. డిస్క్రిప్షన్–క్లిక్ 5.సేవ్ ఛానల్ స్పీడ్ అందుకోవడానికి, కంటెంట్ స్ట్రాటజీని రీడిజైన్ చేసుకోవడానికి ‘ఎనాలిటిక్స్’ కావాలి. ఇందులోకి వెళ్లాలంటే...1.మీ ఎకౌంట్లోకి లాగ్ అవ్వాలి 2. క్లిక్–ప్రొఫైల్ ఐకాన్ 3.సెలెక్ట్–యూట్యూబ్ స్టూడియో 4. క్లిక్–గో టూ ఛానల్ ఎనాలిటిక్స్ 5. సెలెక్ట్–ఎనాలిటిక్స్ (లెఫ్ట్ హ్యాండ్ మెనూ) బిగ్గెస్ట్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూట్ కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే వినూత్నమైన అప్డెట్స్తో ముందుంటుంది. ‘యూట్యూబ్ స్టూడియో’కి సంబంధించి తాజా అప్డ్ట్ల విషయానికి వస్తే.. హైలీ రిక్వెస్టెడ్ ఫీచర్‌గా చెప్పుకునే ‘డార్క్‌మోడ్’ ఫీచర్ యూట్యూబ్‌కు మాత్రమే కాకుండా ‘యూట్యూబ్ స్టూడియో’కు వచ్చేసింది. ఫ్రెష్‌లుక్ ఇవ్వడమే కాదు కళ్లకు భారం పడకుండా తేలిగ్గా ఉంటుంది. బ్యాటరీ సేవ్ అవుతుంది. రియల్‌టైమ్ కార్డ్స్‌ను మెరుగుపరిచారు. గతంలో ఈ కార్డ్స్ ‘బేసిక్ వోవర్ వ్యూ డాటా’ డిస్‌ప్లేకే పరిమితం. తాజా అప్డేట్తో సబ్‌స్క్రైబర్ కౌంట్స్, వీడియో వ్యూస్.. ఇలా అప్–టు–ది–మినిట్ డాటా డిస్ప్లే అవుతుంది. యూట్యూబ్ స్టూడియోలోని ‘మెన్షెన్ ఇన్‌బాక్స్’తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. దీని ద్వారా మీ ఛానల్ ఎక్కడెక్కడ మెన్షెన్ అయిందనే విషయం తెలుసుకోవచ్చు. ఉదా: మరో ఛానల్ వీడియో కామెంట్ సెక్షన్లో మీ ఛానల్ ట్యాగ్ అయితే దాని గురించి తెలుసుకోవచ్చు. ‘మీ సినిమా ఆడాలంటే మీకు నచ్చగానే సరిపోదు. ప్రేక్షకులకు మీకంటే బాగా నచ్చాలి’ అనేది అత్యంత పాత విషయం అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా మరిచిపోతూనే ఉంటాం. ఛానల్ వ్యవహారం కూడా అంతే. ‘చేసిందంతా చేసేశాను. ఇంకేటి సేత్తాం’ అనుకోవద్దు. ‘యూట్యూబ్ స్టూడియో’పై లుక్కేయండి. ఆడియెన్స్ నాడి కనిపెట్టండి. సరదిద్దుకోండి. దూసుకుపోండి. -
అదిరిపోయే వీడియో ఎడిటింగ్ యాప్స్ మీకోసం..
పిండి కొద్ది రొట్టెలాగే... టెక్నాలజీ కొద్ది వీడియో! టెక్నాలజీతో ‘బొమ్మ అదిరిపోయింది’ అనిపించడానికి బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకొని మీ వీడియోలకు సాన పెడితే ‘శబ్భాష్’ అనిపించుకోవడం ఎంతసేపని! వీడియో ఎడిటింగ్‌కు మీరు కొత్త అయితే ‘ఎడోబ్ ప్రీమియర్ ఎలిమెంట్స్’ బెటర్. ‘క్రియేట్ - ఎడిట్- ఆర్గనైజ్ -షేర్ యువర్ వీడియోస్’ అంటున్న ఎడోబ్ ప్రీమియర్ ఎలిమెంట్స్‌కు ఈజీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌గా పేరుంది. స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవచ్చు. సెకండ్ల వ్యవధిలో వీడియోలను షార్ప్‌గా తీర్చిదిద్దవచ్చు. పర్ఫెక్ట్లెంత్తో మ్యూజిక్‌ను సెట్ చేయవచ్చు. ‘ఫైనల్ కట్ ప్రో’ను ప్రొఫెషనల్ టూల్‌గా చెబుతుంటారు. టాప్ యూట్యూబర్స్ దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. లాంగ్ టర్మ్ యూట్యూబర్స్కు ఎక్కువగా ఉపయోగపడే ‘ఫైనల్ కట్’లో ఫిల్టర్స్, మల్టీఛానెల్ ఆడియో టూల్స్, అడ్వాన్స్డ్ కలర్ గ్రేడింగ్ ఫీచర్లు ఉన్నాయి. మొబైల్‌ఫోన్ ఉపయోగించే సోషల్ మీడియా వీడియో క్రియేటర్స్ కోసం ‘ఎడోబ్ యాప్ ప్రీమియర్ రష్’ ఉపయోగపడుతుంది. వాయిస్ అండ్ మ్యూజిక్ మధ్య సౌండ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేసే ‘ఆటో డకింగ్’ సదుపాయం అందుబాటులో ఉంది. ఆకట్టుకునే మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్స్ ఉన్నాయి. ‘షాట్‌కట్’ సాఫ్ట్‌వేర్‌తో సులభంగా వీడియోలు ఎడిట్ చేయవచ్చు. ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మెరుగైన వీడియో, ఆడియో టూల్స్, 4కే లాంటి వైడ్‌రేంజ్ ఫార్మట్స్ ఉన్నాయి. ‘వీమియో’ అనేది బెస్ట్ ఏఐ-అసిస్టెడ్ ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనిపించుకుంది. వేలాది ఫోటోలు, వీడియోలు ఉన్న స్టాక్లైబ్రరీతో యాక్సెస్ కావచ్చు, లైసెన్స్డ్ మ్యూజిక్ లైబ్రరీ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను వాడుకోవచ్చు. ‘ఇన్వీడియో’ అనేది ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్. సోషల్ మీడియా కోసం మాత్రమే కాకుండా కంపెనీ వెబ్సైట్ల కోసం ఆకట్టుకునేలా వీడియోలు క్రియేట్ చేయవచ్చు. అయిదువేలకు పైగా ప్రీ-మేడ్ టెంప్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్రీస్టాక్ లైబ్రరీ నుంచి ఫోటో,వీడియోలు,మ్యూజిక్‌ను ఉపయోగించవచ్చు. టెక్స్ - టు - వీడియో టూల్లాంటి స్రై్టకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ‘వుయ్వీడియో’ అనేది క్లౌడ్-బేస్డ్ ఆన్లైన్ ఎడిటర్. స్టాక్వీడియో లైబ్రరీ నుంచి వేలాది ఇమెజెస్, వీడియోలు, మ్యూజిక్‌తో యాక్సెస్ కావచ్చు. గ్రీన్‌స్క్రీన్, స్క్రీన్ రికార్డింగ్, కలర్గ్రేడింగ్... మొదలైన అడ్వాన్స్డ్ ఎడిటింగ్ టూల్స్‌తో వీడియోలకు సినిమాటిక్ లుక్ ఇవ్వొచ్చు. స్లైడ్షోలు,ప్రచారయాత్రలతో పాటు సోషల్ మీడియాలో మార్కెటింగ్ వీడియోలు క్రియేట్ చేయడానికి పర్ఫెక్ట్ వీడియో మేకర్ బైటబుల్. స్టన్నింగ్ టెంప్లెట్స్ దీని సొంతం. వీడియోలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడానికి హై రిజల్యూషన్‌తో కూడిన ఫోటోలు, స్టాక్వీడియోలు ఉన్నాయి. ఇక మీరు రెడియా! త్రినేత్రం అనుభవాన్ని మించిన జ్ఞానం ఏంఉంటుంది! తన అపారమైన అనుభవంతో అమెరికన్ ఫిల్మ్ఎడిటర్, డైరెక్టర్, సౌండ్ డిజైనర్ వాల్టర్ మర్చ్ ‘ఇన్ ది బ్లింక్ ఆఫ్ యాన్ ఐ’ అనే మంచి పుస్తకం రాశారు. వీడియో లేదా ఫిల్మ్ ఎడిటింగ్‌కు సంబంధించి బోలెడు విషయాలు తెలుసుకోవచ్చు. డిజిటల్ ఎడిటింగ్‌లో వచ్చిన మార్పులు, డిజిటల్ ఎడిటింగ్ ఉపయోగాలు, పరిమితులు...మొదలైనవి తెలుసుకోవడానికి ఉపయోగపడే పుస్తకం ఇది. -
మొబైల్ లవర్స్ కోసం పేపర్ ఫోన్!
అవునన్నా కాదన్నా మనం డిజిటల్ ప్రపంచంలోకి వచ్చాం. అయితే ‘అతి’ ఎప్పుడు మంచిది కాదని చరిత్ర చెబుతూనే ఉంది. సెల్‌ఫోన్ అతివాడకం వలన వచ్చే మానసిక సమస్యలు పక్కన పెడితే అసలు మనం మాట్లాడే భంగిమ సవ్యంగా లేదని, అది ‘టర్టెల్ నెక్ సిండ్రోమ్’కు దారితీస్తుందని అంటున్నారు శాస్త్రనిపుణులు. ‘సెల్‌ఫోన్ నా శరీరంలో భాగం. అది లేకుండా నేను లేను’ అనుకునే అతి సాంకేతిక ప్రేమికులను దారి మళ్లించడానికి లండన్ డిజైన్ స్టూడియో ‘స్పెషల్ ప్రాజెక్ట్స్’ పేపర్ ఫోన్ యాప్ రూపొందించింది. కాల్ చేయడం, కాల్ రిసీవ్ చేసుకోవడం సంగతి సరే, ప్రతి అతి చిన్న విషయానికి కూడా సెల్‌ఫోన్‌పై ఆధారపడకుండా మనం తప్పనిసరి, అత్యవసరం అనుకున్న సమాచారాన్ని ఏ-4 పేపర్‌కు బదిలీ చేస్తుంది ఈ పేపర్ ఫోన్. కాసేపు అయినా ఫోన్‌కు దూరంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యమైన సమాచారాన్ని ప్రింట్ తీసుకొనిపెట్టుకోవడం ద్వారా కొంత సేపు అయిన ఆ డిజిటల్ బయట పడవచ్చు. అసలు యూజర్లు ఏయే విషయాలపై ఎక్కువగా సెల్‌ఫోన్‌పై ఆధారపడుతున్నారు, అందులో ముఖ్యమైనవి ఏమిటి? కానివి ఏమిటి? అనే విషయంపై వందలాది మందిని ఇంటర్వ్యూ చేసి సమాచారాన్ని సేకరించారు. ‘టెక్నాలజీని బ్యాలెన్స్ చేయడానికి పేపర్ ఫోన్ ఒక మార్గం’ అంటున్నాడు ‘స్పెషల్ ప్రాజెక్ట్’ కో-ఫౌండర్ ఆడ్రియన్. చదవండి: బిల్ గేట్స్ కు ఎన్ని ఎకరాల భూమి ఉందో మీకు తెలుసా? -
ఆ దేశానికి 12 లక్షల మంది ఉద్యోగులు కావాలంట
సింగపూర్: 2025 నాటికి వివిధ సంస్థలు ఎంపిక చేసుకునే ఉద్యోగాలకు డిజిటల్ నైపుణ్యాలే కీలకంగా మారతాయని ఓ సర్వేలో వెల్లడైంది. సింగపూర్ వంటి చిన్న దేశాలు సైతం ఇందుకు సన్నద్ధం కావాలని అంచనా వేసింది. 2025 నాటికి సింగపూర్ ఆర్థికవ్యవస్థకు 12 లక్షల మంది డిజిటల్ నైపుణ్యం గల ఉద్యోగులు అవసరమవుతారని తేల్చింది. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న 22 లక్షల మందిలో వీరి వాటా 55% వరకు ఉంటుందని తేలింది. డిజిటల్ నైపుణ్య పరంగా ఎదురయ్యే సవాళ్లను ఉద్యోగులు భవిష్యత్‌లో ఎలా ఎదుర్కోనున్నారనే కోణంలో చేపట్టిన ఈ సర్వే వివరాలను ఆన్లైన్ వార్తాపత్రిక ‘టుడే’లో గురువారం వెల్లడయ్యాయి. ఆస్ట్రేలియా, భారత్, ఇండోనేసియా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియాతో కలిపి మొత్తం ఆరు దేశాల్లోని 3 వేల మంది నుంచి వివరాలు సేకరించారు. ఇప్పటికే సింగపూర్‌లోని ప్రతి 10 మంది ఉద్యోగుల్లో ఆరుగురు తమ విధుల్లో డిజిటల్ నైపుణ్యాలను వినియోగిస్తున్నారు. ఈ విషయంలో సింగపూర్ రెండో స్థానంలో, 64%తో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. అడ్వాన్స్డ్ డిజిటల్ స్కిల్స్ పరంగా చూస్తే ఆస్ట్రేలియాలోని ప్రతి ఐదుగురిలో ఒకరు..అంటే 22% మంది వినియోగిస్తున్నారు. ఆరు దేశాల్లో ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానంలో 21%తో దక్షిణ కొరియా ఉంది. భారత్‌లోని ఉద్యోగుల్లో 12% మందికే డిజిటల్ స్కిల్స్ ఉన్నప్పటికీ, అడ్వాన్స్డ్ డిజిటల్ స్కిల్స్ కోసం అత్యధికంగా 71% మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ విషయంలో సింగపూర్ 59%తో మూడో స్థానం నిలిచింది. ఈ దేశంలోని ఉద్యోగులు సాంకేతికపరమైన మార్పులకు అనుగుణంగా ఎదిగేందుకు సరాసరిన ఏడు డిజిటల్ స్కిల్స్‌ను నేర్చుకోవాల్సి ఉంటుందని సర్వే అంచనా వేసింది. సింగపూర్‌కు భవిష్యత్తులో అవసరమయ్యే 12 లక్షల మందిలో.. ఇప్పటి వరకు ఎలాంటి డిజిటల్ నైపుణ్యాలను వినియోగించని వారు, నిరుద్యోగులు/ 2025 నాటికి ఉద్యోగం అవసరమయ్యే వారు, ప్రస్తుతం విద్యార్థులుగా ఉండి ఉద్యోగాల్లో చేరే వారు డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న వారితో కలిపి మొత్తం 2025 నాటికి సింగపూర్‌లోని ఉద్యోగులకు 2.38 కోట్ల డిజిటల్ స్కిల్ ట్రయినింగ్ సెషన్స్ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. అదే భారత్‌లో, 2025 నాటికి 39 కోట్ల ట్రయినింగ్ సెషన్స్ అవసరమవుతాయని అంచనా వేసింది. 2020–2025 మధ్య భారత్‌తోపాటు, జపాన్, సింగపూర్లలోని డిజిటల్ స్కిల్డ్ సిబ్బందికి అడ్వాన్స్డ్ క్లౌడ్ స్కిల్స్‌లోకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని వెల్లడించింది. ఈ నైపుణ్యాలను ఉద్యోగులు అందిపుచ్చుకోకుంటే 2025 నాటికి డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యం ఉండే సిబ్బంది కొరతను వాణిజ్య సంస్థలు ఎదుర్కోనున్నాయని అంచనా వేసింది. చదవండి: ధైర్యం చేసి.. నీళ్లలోకి దిగి -
ఈ ఆరు అటాక్స్ ప్రపంచాన్ని గడగడలాడించాయి..
డిజిటల్ ప్రపంచం.. ముందస్తు కంటే శరవేగంగా విస్తరిస్తున్న కొత్త లోకం. ఈ ప్రపంచం ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే స్పీడుగా దానిపై సైబర్ అటాక్స్ కూడా విజృంభిస్తున్నాయి. ఈ అటాక్స్ కొత్తమీ కాకపోయినా... వీటి సంఖ్య పెరగడం ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు సైబర్ అటాక్స్ విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా.. వీటి సంఖ్య పెరగడమే కానీ, తగ్గుముఖం పట్టడం లేదు. ప్రతి రోజు ఆన్లైన్లో దొంగలించే సమాచారం పెరిగిపోతోంది. ఈ ఏడాది ర్యామ్‌సమ్‌వేర్ అటాక్స్ వల్ల ఏర్పడిన నష్టం 5 బిలియన్ డాలర్ల(రూ.32,091 కోట్లకు పైన) పైగే ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఖర్చు తదుపరి ఏళ్లలో మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా సైబర్ సెక్యురిటీ ఖర్చులు కూడా వచ్చే నాలుగేళ్లలో 1 ట్రిలియన్ డాలర్లకు పైన ఉంటుందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో 2017లో ప్రపంచాన్ని వణికించిన ఆరు క్రూరమైన సైబర్ అటాక్స్ ఏమిటో ఓ సారి చూద్దాం.. షాడో బ్రోకర్స్.... షాడో బ్రోకర్స్. ఇదో సైబర్ గ్యాంగ్. అమెరికా నిఘా సంస్థ ఎన్ఎస్ఏ నుంచి ఏప్రిల్ నెలలో ఈ షాడో బ్రోకర్స్ ఓ సైబర్ ఆయుధాన్ని చోరీ చేశారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌ను వాడుకుని ఆ ఆయుధంతో ఎటువంటి కంప్యూటర్ను అయినా హ్యాక్ చేయవచ్చు. వాస్తవానికి ఎటర్నల్ బ్లూ పేరుతో హ్యాకింగ్ ఆయుధాన్ని అమెరికా భద్రతా సంస్థ తయారు చేసింది. ఆ హ్యాకింగ్ టూల్‌నే షాడో బ్రోకర్స్ ఎత్తుకెళ్లారు. ఆ ప్రమాదకరమైన బగ్‌ను ఏప్రిల్ 14వ తేదీన షాడో గ్యాంగ్ కంప్యూటర్లపై వదిలింది. దాంతో కంప్యూటర్ సిస్టమ్‌లు అన్నీ కరప్ట్ అయ్యాయి. షాడో బ్రోకర్స్ అనేది ఓ రహస్య సంస్థ. వాళ్ల ఆచూకీ ఎక్కడా ఉండదు.అయితే సిరియాపై అమెరికా బాంబు దాడి చేసినందుకే ఆ గ్యాంగ్ ఈ బగ్‌తో కంప్యూటర్లను హ్యాక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ గ్యాంగ్‌కు రష్యాతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. వాన్నక్రై.... ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా వ్యాపించిన ర్యామ్‌సమ్‌వేర్ అటాక్స్‌లో వాన్నక్రై మాల్వేర్ ఒకటి. భారత్ సహా దాదాపు 100 దేశాలను ఈ వాన్నక్రై గడగడలాడించింది. కంప్యూటర్లలోని డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి, సొమ్ము చెల్లిస్తేగానీ దాన్ని విడిచిపెట్టబోమంటూ ప్రపంచాన్ని హడలెత్తిచింది. బాధిత దేశాల్లోని ఆసుపత్రులు, పోలీసు శాఖలు, ప్రజా రవాణా వ్యవస్థలు, టెలికం సంస్థలు, కంపెనీలు, యూనివర్సిటీలపై దీని ప్రభావం పడింది. ఈ తరహా సైబర్‌దాడిలో ఇది ప్రపంచంలోనే అతిపెద్దదని నిపుణులు చెప్పారు. ఈ దాడుల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన 102 సిస్టమ్స్ కూడా ప్రభావితమయ్యాయి. 24 గంటల్లో లక్షకుపైగా కంప్యూటర్ వ్యవస్థలు ఈ వైరస్ బారిన పడినట్లు మాల్‌వేర్‌టెక్ ట్రాకర్ సంస్థ కనుగొంది. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ వ్యవస్థలో బలహీనతలను ఇది సొమ్ము చేసుకుంటోందని నిపుణులు చెప్పారు. నాట్‌పెట్యా..... ఈ ఏడాది ప్రపంచాన్ని కుదిపివేసిన మాల్వేర్లో నాట్‌పెట్యా ఒకటి. 2016 ర్యామ్‌సమ్‌వేర్ పెట్యాకు దీనికి చాలా పోలికలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంప్యూటర్లకు ఇది దాదాపు విస్తరించింది. అమెరికాలోని కార్పొరేట్ దిగ్గజాలు, ఫార్మాస్యూటికల్ కంపెనీ మెర్క్, డానిష్ షిప్పింగ్ కంపెనీ, రష్యన్ ఆయిల్ దిగ్గజం రోస్నేఫ్ట్ వంటివి దీని బారిన పడ్డాయి. ఉక్రేయిన్‌లో పవర్ కంపెనీలను, ఎయిరఫోర్టులను, పబ్లిక్ ట్రాన్సిస్ట్ను, ఈ దేశ సెంట్రల్ బ్యాంకును నాట్‌పెట్యా గడగడలాడించింది. ఆసియా-పసిఫిక్‌లో నాట్పెట్యాతో ఎక్కువగా ప్రభావితమైనది భారత్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాలు దీని బారిన ఎక్కువగా పడ్డాయని సైబర్ సెక్యురిటీ సంస్థ సిమాంటెక్ పేర్కొంది. జోమాటో హ్యాక్... జోమాటో.. భారత్‌లోని అతిపెద్ద రెస్టారెంట్ అగ్రిగేటర్లలో ఒకటి. ఈ సంస్థ భారీ హ్యాకింగ్‌కు గురైంది. ఈ సంస్థకు చెందిన170 లక్షలకు పైగా యూజర్ల అకౌంట్ల సమాచారాన్ని హ్యాకర్లు డార్క్ వెబ్‌లో విక్రయించారు. ఈ డేటా బేస్ లో రిజిస్ట్రర్డ్ జోమాటో యూజర్ల ఈ-మెయిల్స్, పాస్ వర్డ్ లు ఉన్నాయి. దొంగలించిన డేటా జుమాటోకి చెందినదేనని నిరూపించడానికి నమూనా డేటాను కూడా ఆ విక్రయదారుడు షేర్ చేశాడు. దీంతో జోమాటో భద్రతా వైఫల్యాలతో తీవ్ర సతమతమైంది. అదృష్టశాత్తు యూజర్ల పేమెంట్ వివరాలు వేరే ప్రాంతంలో నిక్షిప్తం చేయడంతో, యూజర్లు ఆర్థిక నష్టం బారిన పడలేదు. ది హెచ్‌బీఓ హ్యాక్... గత దశాబ్దం కాలంగా స్క్రీన్లపై సంచలనం సృష్టిస్తున్న అత్యంత పాపులర్ టెలివిజన్ షో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'. దీనిపై కూడా హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. ఈ షోకు చెందిన స్క్రీప్ట్‌లను, 1.5 టెర్రాబైట్స్ డేటాను ''మిస్టర్ స్మిత్'' అనే హ్యాకింగ్ గ్రూప్ దొంగతనం చేసింది. డేటాను దొంగతనం చేసిన హ్యాకర్లు కంపెనీ నుంచి ఆరునెలల వేతనాన్ని డిమాండ్ చేశారు. అంటే 6 మిలియన్ డాలర్లకు పైగా వారు కోరారు. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఎక్కువ మొత్తంలో ఫైల్స్‌ను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. అయితే హ్యాకర్లు డిమాండ్ చేసిన మొత్తాన్ని హెచ్‌బీఓ చెల్లించిందో లేదో చెప్పడాన్ని మాత్రం ఆ సంస్థ చాలా సీక్రెట్‌గా ఉంచింది. ఈక్విఫ్యాక్స్... అమెరికాలో అతిపెద్ద క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీలో ఒకటి ఈక్విఫాక్స్. ఈ ఏడాది జూలైలో ఈ క్రెడిట్ ఏజెన్సీపై హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. 145 మిలియన్ ప్రజల వ్యక్తిగత డేటాను వీరు దొంగతనం చేశారు. హ్యాకింగ్ బారిని పడిన అత్యంత చెత్త సంఘటనలో ఈక్విఫ్యాక్స్ దొంగతనం ఒకటి. కీలకమైన సమాచారం(క్రెడిట్ కార్డు నెంబర్లు, బర్త్‌డే వివరాలు, సోషల్ సెక్యురిటీ నెంబర్లు) హ్యాకర్లు దొంగలించారు. -
‘డిజిటల్’లో హిందీ రాజ్యం
యాప్స్ తయారీ ద్వారా కంపెనీలకు లబ్ధి: మోదీ * హిందీని విస్మరించటం దేశానికి నష్టదాయకం * ప్రపంచ హిందీ సదస్సులో ప్రధాని మోదీ భోపాల్: రాబోయే రోజుల్లో డిజిటల్ ప్రపంచంలో ఇంగ్లిష్, చైనీస్, హిందీ భాషలు రాజ్యమేలుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భాషా మార్కెట్ భారీగా ఉంటుందని.. దానిపై సత్వరమే యాప్స్ (అప్లికేషన్లు) తయారు చేయటం ద్వారా కంపెనీలు లాభపడవచ్చని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 6,000 భాషల్లో 90 శాతం భాషలు గతించిన ఆనవాళ్లుగా మిగిలిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండటాన్ని ప్రస్తావిస్తూ.. అంతరించిపోతున్న భాషలను పరిరక్షించటానికి చర్యలు చేపట్టాలని కూడా ప్రధాని పిలుపునిచ్చారు. గురువారం భోపాల్‌లో పదో ప్రపంచ హిందీ సదస్సును మోదీ ప్రారంభిస్తూ ప్రసంగించారు. హిందీ ప్రాముఖ్యతను, దానిని సుసంపన్నం చేయాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తూ.. హిందీని విస్మరించటం దేశానికి నష్టదాయకమని పేర్కొన్నారు. ‘‘నా మాతృభాష గుజరాతీ అయినప్పటికీ.. నాకు హిందీ తెలియకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదని నేను అప్పుడప్పుడూ అనుకుంటుంటాను. ఏ భాషను అయినా తెలుసుకోవటం వల్ల ఉండే బలమేమిటనేది నాకు బాగానే తెలుసు. దున్నపోతులను కొనుగోలు చేసేందుకు గుజరాత్ వచ్చే ఉత్తరప్రదేశ్ వ్యాపారులకు టీ అమ్ముతూ నేను హిందీ నేర్చుకున్నాను’’ అని తెలిపారు. మారిషస్, మంగోలియా, చైనా, రష్యా తదితర దేశాల్లో హిందీకి పెరుగుతున్న ప్రజాదరణను తాను వీక్షించానని చెప్పారు. హిందీ భాషను విదేశాల్లో విస్తరించటంలో బాలీవుడ్ సినిమాల పాత్ర ఎంతో ఉందన్నారు. దేశంలో మాట్లాడే వివిధ ప్రాంతీయ భాషల్లోని మంచి పదాలను హిందీలో చేర్చటానికి కార్యసదస్సులు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘హిందీ మహాకుంభ మేళా’గా మోదీ అభివర్ణించిన ఈ సదస్సులో 40 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. విశ్వ హిందీ సదస్సు ఇతర సదస్సులకన్నా భిన్నమైనదని పేర్కొన్నారు. హిందీ భాష సాహిత్య కోణాలపై మాత్రమే కాకుండా.. వివిధ రంగాల్లో ఈ భాషను విస్తరించటానికి గల అవకాశాలపై ఈ సదస్సులో దృష్టి కేంద్రీకరించటం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా సదస్సు జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును మోదీ ఆవిష్కరించారు. -
డిజిటల్ ప్రపంచం చీకటైతే!
ప్రపంచమే ఓ గ్లోబల్ గ్రామంగా మారిన నేటి సమాజంలో కొన్ని తరాలుగా మనం డిజిటల్ ఫామ్‌లో భద్రపరుస్తున్న చారిత్రక,భౌగోళిక, శాస్త్ర విజ్ఞాన, సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించినవే కాకుండా మన వ్యక్తిగత జ్ఞాపకాలుకు సంబంధించిన ఫొటోలు, డాక్యుమెంట్లు ఒక్కసారిగా కంప్యూటర్ ప్రపంచ తెర మీది నుంచి మాయమైతే ఎలా ఉంటుంది? చరాచర ప్రపంచమంతా చీకటిమయంగా కనిపించదా, ఒక్కసారిగా చేష్టలుడిగి నిశ్చేష్టులంకామా? సరిగ్గా ఇదే సంశయం ఇంటర్నెట్ పితామహుడు వింట్ సర్ఫ్‌కు వచ్చింది. సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్లు ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోతే 21 శతాబ్దం చరిత్రను మన భవిష్యత్ తరాలకు ఎలా అందించగలమని ప్రస్తుతం గూగుల్ వైస్ ప్రెసిడెంట్గావున్న వింట్ సెర్ఫ్‌లో ఓ అనూహ్య ప్రశ్న మొలకెత్తింది. శాన్‌జోస్‌లో ఇటీవల జరిగిన ‘అమెరికన్ ఆసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్’ వార్షిక సమావేశం వేదికపై వింట్ సెర్ఫ్ ఈ సరికొత్త ప్రశ్నను లేవనెత్తారు. అలాంటి పరిస్థితిని తలెత్తడాన్ని ‘డిజిటల్ డార్క్ ఏజ్’గా అభివర్ణించవచ్చని కూడా ఆయన అన్నారు. ఆ పరిస్థితి తలెత్తకుండా ప్రతి రంగానికి సంబంధించి మనం డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేసిన యావత్ సమాచారాన్ని భారీ భారీ పురావస్తు భాండాగారాల్లో (ఆర్కీవ్స్)లో భద్రపరిచినా, అవేమిటో, వాటిని ఎలా శోధించాలో మన భవిష్యత్ తరాలకు తెలిసే అవకాశం ఉంటుందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. కంప్యూటర్ రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా మన తరంలో వాడుతున్న హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లు భవిష్యత్ తరంలో మనుగడలో ఉండవని, అలాంటప్పుడు ఇప్పటి హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లతో నిక్షిప్తం చేసిన సమాచారం భవిష్యత్ తరాలకు అందకపోయే ప్రమాదం ఉందన్నది స్థూలంగా వింట్ సెర్ఫ్ అభిప్రాయం. మన చరిత్రను చరిపేసే ప్రమాదానికి పరిష్కారం కనుగొనడమే తన ప్రస్తుత కర్తవ్యమని కూడా ఆయన అదే వేదికపై నుంచి చెప్పారు. వర్తమానంలో మనం వినియోగిస్తున్న ప్రతి సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌ను ఏదోరూపంలో భద్రపర్చుకోవడం ఈ సమస్యకు పరిష్కారంగా కనిపిస్తోందని అన్నారు. ప్రతి అప్లికేషన్‌ను, ఆపరేటింగ్ సిస్టమ్‌ను, దానికి సంబంధించిన కాంటెంట్‌ను ‘ఎక్స్‌రే స్నాప్ ఫాట్’ రూపంలో కంప్యూటర్ మ్యూజియంలో భద్రపర్చడం ఉత్తమమార్గమని ఆయన సూచించారు. ఇలా భద్రపర్చడం సాధ్యమేనని కార్నీజ్ మెలన్ విశ్వవిద్యాలయానికి చెందిన మహదేవ్ సత్యనారాయణ నిరూపించి వింట్ సెర్ఫ్ సందేహాలకు తాత్కాలిక ఉపశమనం కల్పించారు.