Why Bollywood Actor Aamir Khan Switches Off His Phone: Know The Exact Reason - Sakshi
Sakshi News home page

ఫోన్‌ స్విచ్ఛాఫ్‌‌ చేసుకున్న హీరో, ఎందుకంటే?

Published Tue, Feb 2 2021 3:41 PM | Last Updated on Tue, Feb 2 2021 4:10 PM

Aamir Khan Switch Off Phone Until Laal Singh Chaddha Release - Sakshi

సినిమా కోసం నటించేవాళ్లు కొంతమందైతే, జీవించేవాళ్లు మరికొంత మంది! తన పాత్ర పర్ఫెక్ట్‌గా రావడం కోసం ఎంతకైగా తెగిస్తారు, ఏదైనా చేస్తారు. అలా చాలామంది హీరోలు తమ శరీరాలను సిక్స్‌ప్యాకులు, ఎయిట్‌ ప్యాకులుగా మలిచారు. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే గుర్రపు స్వారీలు, బైక్‌ రైడింగులు, కత్తియుద్ధాలు ఇలా అన్ని కళలనూ నేర్చుకుంటారు. పాత్రలో లీనమైపోయేందుకు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఫోన్లను సైతం పక్కన పెట్టేస్తుంటారు. బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ కూడా ఇదే కోవకు చెందుతాడు. తను నటిస్తోన్న లాల్‌ సింగ్‌ చద్దా కోసం ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేశాడు. (చదవండి: అమీర్‌ ఖాన్‌ 'విక్రమ్‌ వేదా' లేదా?)

వ్యక్తిగత జీవితం, కెరీర్‌ రెండూ దేనికదే సెపరేట్‌గా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఫోన్‌ వల్ల ఏకాగ్రతగా షూటింగ్‌ చేయలేనని మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా అర్జంట్‌ పనైతే తన మేనేజర్‌కు కాల్‌ చేయమని బంధువులకు చెప్పి ఉంచాడట. అంతే కాదు, అమీర్‌ సోషల్‌ మీడియా అకౌంట్లను కూడా ప్రస్తుతం అతడి టీమే చూసుకుంటోందట. అయితే ఇదంతా లాల్‌ సింగ్‌ చద్దా షూటింగ్‌కు శుభం కార్డు పడేవరకు కాదు సినిమా థియేటర్లలో రిలీజ్‌ అయ్యేవరకు. కాగా మూడేళ్ల తర్వాత అమీర్‌, కరీనా మరోసారి ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు 3 ఇడియట్స్‌, తలాష్‌లో జోడీగా నటించారు. (చదవండి: ఆ టెక్నిక్‌తో ఆఫీసుల్లోకి ఈజీగా వెళ్లేవాడిని : పంకజ్‌ త్రిపాఠి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement