
ఆఖరికి తమిళనటుడు మాధవన్ సైతం "తల్లి ముఖంలో తెచ్చిన ఆనందం వెలకట్ట లేనిది" అని తమిళంలో క్యాప్షన్ ఇచ్చి మరీ రీట్విట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి మీరు కూడా..
ఇంతవరకు మనం ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. చాలా వరకు మనస్సుకు హత్తుకునేవి, కదిలించేవి చూశాం. అచ్చం అలాంటి వైరల్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. పైగా తమిళ నటుడు మాధవన్‌ని సైతం ఆకట్టుకుంది.
(చదవండి: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం!)
అసలు విషయంలోకెళ్తే...ఆ వీడియోలో ఒక కొడుకు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా బహుమతి తీసుకువచ్చి ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆమె సందేహంగా ఆ కవర్‌ని తెరుస్తుంది. ఆ తర్వాత ఆమె అందులో ఉన్న రూ. 8 వేలు ఖరీదు చేసే ఫోన్‌ని చూసి ఒక్కసారిగా చాలా సంబరపడిపోతుంది. పైగా ఆ ఆనందం మాటల్లో చెప్పలేనది, వెలకట్టలేనిది.
ఈ మేరకు మనసును కదిలించే ఈ వీడియోకి "ఈ ఆనందాన్ని వెలకట్ట లేం" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ విఘ్నేష్ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో ఎంతో మంది నెటిజన్లను కదిలించింది. ఆఖరికి తమిళనటుడు మాధవన్ సైతం "తల్లి ముఖంలో తెచ్చిన ఆనందం వెలకట్ట లేనిది" అని తమిళంలో క్యాప్షన్ ఇచ్చి మరీ రీట్విట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!)
Adhula Irundha Mobile-oda Velai Verum 8800 Rs Dhan...! Aana Enga Amma Patta Sandhoshathuku Velayae Kidayaadhu ❤️ Birthday Gift..! pic.twitter.com/4QZJE7Ocii
— Vignesh (@VigneshSammu) January 5, 2022