
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసే పరిశోధన సారాంశమిది. మనం నిత్యం ఉపయోగించే వస్తువుల ఉపరితలంపై కరోనా వైరస్ 28 రోజుల వరకు జీవించి ఉంటుందని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ పరిశోధనలో వెల్లడైంది. కరెన్సీ నోట్లు, గ్లాసులు, స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులపై ఈ వైరస్ 28 రోజులదాకా జీవిస్తుందని తేలింది.
మనం నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులను తరచుగా శుభ్రం చేసుకోవాలని, చేతులను సైతం శుభ్రం చేసుకోవాలని పరిశోధకులు సూచించారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందని, అలాగే సున్నితంగా ఉండే ఉపరితలాలపై దీని జీవన కాలం అధికమని పరిశోధనలో స్పష్టమైంది. ప్లాస్టిక్ నోట్ల కంటే కాగితపు కరెన్సీ నోట్లు కరోనా వైరస్ ఆవాసానికి అనుకూలమని చెప్పొచ్చు. 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ వైరస్ సున్నితమైన ఉపరితలాలపై 28 రోజుల దాకా జీవించి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment