రాజేశ్ ధ్రువ
కర్ణాటక, యశవంతపుర : కట్నం వేధింపుల నేపథ్యంలో బుల్లితెర నటుడు రాజేశ్ ధ్రువపై కుమారస్వామి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు..శృతి అనే యువతితో 2017లో రాజేశ్‌కు వివాహమైంది. అయితే కట్నం కోసం తనను వేధిస్తున్నట్లు శృతి కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేష్ మరో మహిళతో అనైతిక సంబంధం కొనసాగిస్తున్నాడని శృతి ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉండగా శృతి చేసిన ఆరోపణలు అవాస్తవమని రాజేష్ పేర్కొన్నారు. తమది సంప్రదాయమైన కుటుంబమని, శృతి బయట మాంసం తిని ఇంటికి వచ్చి తన తల్లిని వేధిస్తున్నట్లు అరోపించారు. కట్నం విషయంలో తాను శృతిని వేధించలేదన్నారు. విడాకులు కావాలని గతంలో శృతి కోర్టులో కేసు వేసిందని, కట్నం కోసం తాను వేధించినట్లు అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని రాజేష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment