
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బనశంకరి(కర్ణాటక): వివాహానికి ముందు తనపై భర్త అత్యాచారానికి పాల్పడ్డాడని బుల్లి తెరనటి బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కట్నం కావాలని కూడా వేధిస్తున్నారని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని భర్త, అతని తల్లిదండ్రుల మీద ఆరోపించింది. వివరాలు... ఇద్దరూ కూడా టీవీ, సినీ రంగంలో రాణించాలని పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయం కాగా, టీవీల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు.
ఒకరోజు కలుద్దామని సూచించాడు. సరేనని ఆమె ఇంటికి ఆహ్వానించగా, లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనేకసార్లు వాంఛలు తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అడగడంతో అప్పటినుంచి దూరంగా ఉండసాగాడు. ఎంతో ఒత్తిడి చేసి స్నేహితులతో ఒప్పించడంతో గుడిలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. అత్తవారింటికి తీసుకెళ్లిన తరువాత.. బలవంతంగా తాళి కట్టానని భర్త చెప్పుకున్నాడు.
ఆరోజు నుంచి గొడవలు జరుగుతున్నాయని, కట్నం తేవాలని ఒత్తిడి చేస్తూ కులం పేరుతో దూషిస్తున్నాడని వాపోయింది. తాను తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపింది. పోలీసులు ఇద్దరి నుంచీ సమాచారం సేకరించి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment