కూతురి సంగీత్‌లో చిందేసిన చిరు | Megastar Chiranjeevi DANCE at Srija's Sangeet | Sakshi
Sakshi News home page

కూతురి సంగీత్‌లో చిందేసిన చిరు

Published Tue, Mar 29 2016 2:31 PM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

కూతురి సంగీత్‌లో చిందేసిన చిరు

కూతురి సంగీత్‌లో చిందేసిన చిరు

మెగా ఫ్యామిలీ అంతా పెళ్లిపనుల్లో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్న మెగా కుటుంబసభ్యులు అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా ఈ పెళ్లివేడుకల్లో సంగీత్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. చాలాకాలం తరువాత చిరు స్టెప్పేయటం ఈ వీడియోలో కనిపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

చిరు సూపర్ హిట్ పాట 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'కు తన పెద్దకూతురు సుష్మితతో కలిసి చిందేస్తూ కనిపించాడు చిరు. డెస్టినేషన్ మ్యారేజ్ కాన్సెప్ట్తో జరిగిన శ్రీజ పెళ్లి వేడుకలు బెంగళూరులోని చిరు ఫాంహౌస్లో ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 28న, తన చిన్ననాటి స్నేహితుడు, జ్యువెలరీ డిజైనర్ అయిన కళ్యాణ్ తో శ్రీజ వివాహం ఘనంగా జరిగింది. మెగా కుటుంబసభ్యులతో పాటు వారికి అత్యంత సన్నిహితులైన అతికొద్ది మంది మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement