సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన సోమ సుస్మిత నాలుగు స్వర్ణాలు సొంతం చేసుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఈ పోటీలు ముగిశాయి. సీనియర్ విభాగంలో బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్, వాల్టింగ్, అన్‌ఈవెన్ బార్‌లలో సుస్మిత మొదటి స్థానంలో నిలిచింది. చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం చివరి రోజు అండర్-17, సీనియర్స్ విభాగాల్లో ఆరు ఈవెంట్లు జరిగాయి. ఈ చాంపియన్‌షిప్ ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్ట్‌ల హవా కొనసాగింది. పెద్ద సంఖ్యలో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించారు.
ఇతర ఫలితాలు: అండర్-17 (పోమెల్ హార్స్): 1. నీరజ్ (కేరళ), 2. ధర్మేందర్ (ఏపీ), 3. సంజీవ్ (ఏపీ). (రింగ్స్): 1. సంజీవ్ (ఏపీ), 2. ధర్మేందర్ (ఏపీ), 3. ప్రశాంత్ (కేరళ).
(టేబుల్ వాల్ట్): 1. ధర్మేందర్ (ఏపీ), 2. విక్రమ్ (ఏపీ), 3. శ్యామ్‌సుందర్ (కర్ణాటక), (ప్యార్‌లల్ బార్స్): 1. నీరజ్ (ఏపీ), 2. ధర్మేందర్ (ఏపీ), 3. ప్రశాంత్ (కేరళ), (హారిజాంటల్ బార్): ధర్మేందర్ (ఏపీ), 2. సంజీవ్ కుమార్ (ఏపీ), 3. నీరజ్ (కేరళ)
సీనియర్స్: (ఫ్లోర్ ఎక్సర్‌సైజ్): 1. లఖన్ వాల్మీకీ (ఏపీ), 2. తేజదీప్ (ఏపీ), 3. వివేక్ సింగ్ .(పోమెల్ హార్స్): 1. మణికంఠ (ఏపీ), 2. తేజదీప్ (ఏపీ), 3. వివేక్ సింగ్ (ఏపీ), (రింగ్స్): 1. కాసుల నాయుడు (ఏపీ), 2. తేజదీప్ (ఏపీ), 3. వివేక్ సింగ్ (ఏపీ), (టేబుల్ వాల్ట్): 1. తేజదీప్ (ఏపీ), 2. లఖన్ వాల్మీకీ (ఏపీ), 3. కాసుల నాయుడు (ఏపీ), (ప్యార్‌లల్ బార్స్): 1. తేజ దీప్ (ఏపీ), 2. లఖన్ వాల్మీకీ (ఏపీ), 3. వివేక్ సింగ్ (ఏపీ), (హారిజాంటల్ బార్): 1. వివేక్ సింగ్ (ఏపీ), 2. కాసుల నాయుడు (ఏపీ), 3. లఖన్ వాల్మీకీ (ఏపీ).
సుస్మితకు నాలుగు స్వర్ణాలు
Published Mon, Sep 9 2013 1:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement