gachibowli indoor stadium
-
హైదరాబాద్ : మొదలైన ప్రో కబడ్డీ పోటీలు..బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సందడి (ఫొటోలు)
-
దేవి శ్రీ ప్రసాద్ కి చిరంజీవి గారంటే ఎంత ఇష్టమో చూడండి..
-
గచ్చిబౌలి స్టేడియంలో తొడగొట్టనున్న తెలుగు టైటాన్స్.. ఎప్పుడంటే?
క్రీడా సంబురాలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ప్రో కబాడ్డీ లీగ్ సీజన్ 10లో తమ హోమ్ మ్యాచ్‌లను ప్రారంభించడానికి తెలుగు టైటాన్స్ సిద్ధమైంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం తెలుగు టైటాన్స్ తలపడనుంది. హోమ్ మ్యాచ్‌లను జనవరి 19 నుండి 24 వరకు హైదరాబాద్‌లో ఆడనుంది. వీటికి సంబంధించిన టికెట్లు bookmyshow లో అందుబాటులో ఉన్నాయి. తెలుగు టైటాన్స్ సీఈఓ త్రినాధ్ రెడ్డి మాట్లాడుతూ: “ఈ లీగ్ పోటీ నాణ్యత, గేమ్‌ప్లే, ఆటగాళ్ల ప్రదర్శనల పరంగా గొప్ప స్థాయికి పెరిగిందన్నారు. . ప్రో కబడ్డీ లీగ్ ప్రస్తుత సీజన్‌లా గట్టి పోటీతో కూడిన కొన్ని మ్యాచ్‌లకు సాక్షిగా నిలబోతుందన్నారు. తెలుగు టైటాన్స్‌లో కెప్టెన్ పవన్ సెహ్రావత్, సందీప్ ధుల్, పర్వేష్ వంటి దిగ్గజాలు తమ ఆటను పునర్నిర్వచించుకోవడం తో పాటుగా కొత్త ఆటగాళ్లు కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వనున్నారని చెప్పారు. తెలుగు టైటాన్స్ తమ మొదటి హోమ్ లెగ్ మ్యాచ్‌ను జనవరి 19, 2024న బెంగళూరు బుల్స్‌తో ఆడుతుంది. అభిమానులు ప్రతి మ్యాచ్‌ని లైవ్‌లో, రాత్రి 7:30 గంటలకు FTA ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 2 & స్టార్ స్పోర్ట్స్ 2 HD – ఇంగ్లీష్, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, కన్నడలో స్టార్ సువర్ణ ప్లస్‌లో, తెలుగులో స్టార్ మా గోల్డ్ మరియు హాట్‌స్టార్ తో సహా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. -
స్విమ్మింగ్ విన్యాసాలు (ఫొటోలు)
-
8 ‘కరోనా’ ఆస్పత్రులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ జన సమూహంలోకి వ్యాపించిందన్న నిపుణుల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా వైరస్ అనుమానితులను ఐసోలేట్ చేయడానికి, రోగులకు అవసరమైన చికిత్స అందించడానికి వీలుగా రాష్ట్రంలో 8 ఆసుపత్రులను పూర్తిగా వినియోగించుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గాంధీ, కింగ్‌కోఠి ఆసుపత్రులను కరోనా చికిత్సకే పూర్తిగా వినియోగించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా వాటిని సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. తాజాగా మరో 6 ఆస్పత్రులను కూడా పూర్తిగా కరోనా చికిత్సల కోసమే వాడుకోవాలని నిర్ణయించారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి, ఫీవర్ హాస్పిటల్, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం, నాచారం ఈఎస్ఐ ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఇక గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కూడా పూర్తిస్థాయిలో కరోనా ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నారు. ఈ ఎనిమిదింటిలో మొత్తం కలిపి 5 వేల పడకలు కరోనా రోగుల చికిత్స కోసం సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ఆ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు తప్ప మిగతా సేవలన్నీ నిలిపేశారు. త్వరలోనే ఐదు ఆస్పత్రుల్లోనూ ఇతర వైద్య సేవలను నిలిపేసి కేవలం కరోనా చికిత్సలనే అందించనున్నారు. ఇక గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పూర్తిస్థాయిలో కరోనా ఆసుపత్రిగా తీర్చిదిద్దేలా చర్యలు మొదలయ్యాయి. కరోనా కోసం ఆర్డర్ చేసిన వెంటిలేటర్లను సైతం ఈ ఎనిమిదింటిలోనే అమర్చనున్నారు. జిల్లాల్లోని ఆస్పత్రులను తొలుత ఐసోలేషన్‌కే వాడుకోవాలని, కేసుల సంఖ్య ఊహించనంతగా పెరిగితేనే అక్కడ చికిత్సలు ప్రారంభించాలని యోచిస్తున్నారు. ప్రైవేటు బోధనాస్పత్రుల్లో 10 వేల పడకలు... ప్రైవేటు మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో 10 వేల పడకలను కరోనా ఐసోలేషన్‌కు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో 80 శాతం వరకూ కరోనా కోసమే వాడుకొనే అవకాశముంది. ఆయా ప్రైవేటు బోధనాస్పత్రుల్లో ఉంచే కరోనా రోగులకు అక్కడి డాక్టర్లు, సిబ్బందే చికిత్స అందించనున్నారు. కానీ రోగులకు కావాల్సిన ఆహారం, మందులు, మాస్కులు, శానిటైజర్లు ఇతరత్ర వస్తువులను ప్రభుత్వమే ఆయా ప్రైవేటు బోధనాస్పత్రులకు అందించనుంది. మూడో దశలోకి వెళ్తున్నందునే... కరోనాపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు ఎందుకు చేస్తోందన్న దానిపై సీరియస్‌గా చర్చ జరుగుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం వల్లే సర్కారు ముందస్తు చర్యలు చేపడుతోందని అంటున్నారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ దాటిందని, మూడో దశలోకి ప్రవేశించిందని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయని చెబుతున్నారు. ‘ప్రధాని మోదీ 21 రోజులపాటు దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారంటేనే వైరస్ కిందిస్థాయికి వెళ్లినట్లు భావించాల్సి వస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చినవారు స్థానికంగా ఉన్న ప్రజలతో మమేకమైపోయారు. కాబట్టి వైరస్ ఎప్పుడో జన సమూహంలోకి వెళ్లిపోయింది. అది ఎప్పుడు బాంబులా పేలుతుందో తెలియదు’అని కరోనా వైరస్‌ను రాష్ట్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న ఒక కమిటీలోని కీలకమైన అధికారి వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు చర్యల్లో భాగంగా భారీ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే మరింత ముప్పు తప్పదంటున్నారు. వైద్య సిబ్బందికి మాస్కులేవీ? గాంధీ ఆస్పత్రి సహా పలు ఇతర ఆస్పత్రుల్లో కరోనా వైరస్ నియంత్రణ కోసం పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి మాస్కులు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్95 మాస్కులు, శానిటైజర్లను తెప్పించినా అవి కొందరు వీఐపీల కోసమే వెళ్తున్నాయని వైద్య సిబ్బంది ఆరోపిస్తున్నారు. ‘బాక్సులకొద్దీ మాస్కులు, శానిటైజర్లు మా కార్యాలయానికి తెప్పించాం. అయినా అనేక మంది నుంచి విన్నపాలు వస్తున్నాయి. ఎన్ని తెచ్చినా సరిపోవడంలేదు’అని సంబంధిత కీలక ప్రజాప్రతినిధి అనుచరుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఒక అంచనా ప్రకారం వేలాది మాస్కులు, శానిటైజర్లు మాయమైపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అవి ఎక్కడికి వెళ్లాయన్న దానిపై అంతర్గత స్థాయిలో విచారణ జరుగుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. దీంతో మాస్కుల కొరత ఉందని వైద్యాధికారులు అంటున్నారు. ఇటీవల జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో 2 లక్షల మాస్కులను తెప్పించేందుకు కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చినట్లు సంబంధిత అధికారి ఉన్నతస్థాయి అధికారికి వివరించారు. సీఎం కేసీఆర్ పకడ్బందీ ప్రణాళికలతో కరోనాపై పోరాడుతుంటే కొందరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
నగరంలో ప్రిజమ్ పబ్ ప్రారంభం
-
‘మిక్స్డ్’ ఫైనల్లో సిక్కి–ప్రణవ్ జంట
సాక్షి, హైదరాబాద్: కెరీర్లో మరో అంతర్జాతీయ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించేందుకు తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి విజయం దూరంలో నిలిచింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న హైదరాబాద్ ఓపెన్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ సిక్కి–ప్రణవ్ ద్వయం 21–19, 21–15తో చాంగ్ టక్ చింగ్–ఎన్జీ వింగ్ యంగ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–14, 21–6తో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా (భారత్) జంటను అలవోకగా ఓడించి ఫైనల్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ గురుసాయిదత్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో గురుసాయిదత్ 21–16, 15–21, 11–21తో భారత్‌కే చెందిన సమీర్ వర్మ చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ఫైనల్స్‌లో పురుషుల డబుల్స్‌లో అక్బర్–ఇస్ఫహాని (ఇండోనేసియా) జంటతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం... పురుషుల సింగిల్స్‌లో సూంగ్ జూ వెన్ (మలేసియా)తో సమీర్ వర్మ... మిక్స్డ్ డబుల్స్‌లో అక్బర్–వినీ ఒక్తవినా (ఇండోనేసియా) జోడీతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట తలపడతాయి. ►నేటి ఫైనల్స్ మధ్యాహ్నం గం. 2.00 నుంచి డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘షటిల్’ సందడి
-
కనీస టికెట్ ధర రూ. 6 వేలు
నగరంలో ఐపీటీఎల్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: నగరంలో తొలిసారి ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టికెట్ ధరలను నిర్వాహకులు ప్రకటించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 9,10 తేదీల్లో లీగ్ మ్యాచ్‌లు, 11న ఫైనల్ జరుగుతాయి. ఈ టోర్నీ కోసం ఒక రోజు మ్యాచ్ టికెట్ కనీస ధర రూ. 6 వేలుగా నిర్ణయించారు. మూడు రోజులకు కలిపి సీజన్ టికెట్ కనీసం రూ. 15 వేలుగా ఉంది. వేర్వేరు కేటగిరీల్లో రూ. 35 వేలు, రూ. 42 వేలు, రూ. 81 వేలు విలువ గల టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభిమానులు kyazoonga.com సైట్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు నేరుగా హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో ప్రేక్షకుల కోసం టికెట్లు అమ్మకానికి ఉన్నాయి. బేగంపేటలోని క్యాజూంగా కార్యాలయం అవుట్ లెట్, 10 డౌనింగ్ స్ట్రీట్, ఎంజీ రోడ్ ఇండియానా స్పోర్ట్సలో ఇవి లభిస్తాయి. టోర్నీలో ఇండియన్ ఏసెస్, జపాన్ వారియర్స్, సింగపూర్ స్లామర్స్, యూఏఈ రాయల్స్ పాల్గొంటున్నాయి. -
తెలుగు టైటాన్స్ నాకౌట్ ‘కూత’
హైదరాబాద్: నగరంలో మరోసారి కబడ్డీ సందడి మొదలైంది. ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు నేడు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. తెలుగు టైటాన్స్ నాకౌట్ బరిలో ఉండటంతో నగర అభిమానులు ఈ మ్యాచ్‌లపై విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. సీజన్ అసాంతం నిలకడగా రాణించిన పట్నా పైరేట్స్ శుక్రవారం జరిగే తొలి సెమీస్‌లో పుణెరి పల్టన్‌తో పోటీపడనుంది. రెండో సెమీస్‌లో తెలుగు టైటాన్స్... జైపూర్ పింక్‌పాంథర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అభిమానుల ఆగ్రహం గచ్చిబౌలి : సెమీఫైనల్ మ్యాచుల్ని ప్రత్యక్షంగా తిలకించాలనుకున్న హైదరాబాదీ అభిమానులకు నిర్వాహకుల నుంచి నిరాశ ఎదురైంది. పరిమిత సంఖ్యలో ఉన్న టికెట్లను ఇదివరకే ఆన్లైన్లో విక్రయించిన నిర్వాహకులు స్టేడియం ముందు ఏర్పాటు చేసిన కౌంటర్లో మొక్కుబడిగా కేవలం పదుల సంఖ్యలో అందుబాటులో ఉంచారు. దీంతో టికెట్ల కోసం గురువారం క్యూలైన్లో బారులు తిరిన అభిమానులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు టికెట్లు ఇవ్వాలని నిలదీశారు. కౌంటర్లో ఇస్తామన్న 175 టికెట్లలో కేవలం 80 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని వారితో వాగ్వాదానికి దిగారు. -
ఉర్రూతలూగించిన ‘టుమారో ల్యాండ్ రిప్లికా’
-
చాంప్స్ చైనా, ఇండోనేసియా
రెండు విభాగాల్లోనూ జపాన్‌కు నిరాశ ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో చైనా... పురుషుల విభాగంలో ఇండోనేసియా విజేతలుగా నిలిచాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన ఈ ఈవెంట్లో మహిళల ఫైనల్లో చైనా 3-2తో జపాన్‌పై... పురుషుల ఫైనల్లో ఇండోనేసియా 3-2తో జపాన్‌పై విజయం సాధించాయి. పురుషుల విభాగంలో సెమీస్‌లో ఓడిన భారత్‌కు కాంస్యం లభిం చింది. భారత మహిళల జట్టు మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. జపాన్‌తో జరిగిన ఫైనల్లో చైనా మహిళల జట్టు అనూహ్యంగా పుంజుకుంది. తొలి మ్యాచ్‌లో షిజి యాన్ వాంగ్ 21-17, 16-21, 15-21తో నొజోమి ఒకుహారా చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో యింగ్ లు-కింగ్ తియాన్ జోడీ 12-21, 16-21తో మిసాకి మత్సుతోమో-అయాకా తకహాషి జంట చేతిలో పరాజయం పాలైంది. దాంతో చైనా 0-2తో వెనుకబడింది. అయితే ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో చైనా క్రీడాకారిణులు అద్వితీయ ఆటతీరుతో జపాన్ ఆశలను వమ్ము చేశారు. మూడో మ్యాచ్‌లో సున్ యు 22-20, 21-19తో సయాకా సాటోపై గెలుపొం దగా... నాలుగో మ్యాచ్‌లో యు లు-యువాన్‌టింగ్ టాంగ్ జంట 21-11, 21-10తో నోకో ఫకుమాన్-కురిమి ద్వయంపై నెగ్గింది. దాంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో హీ బింగ్జియావో 21-18, 21-12తో యు హాషిమోటోను ఓడించడంతో చైనా 3-2తో విజయాన్ని ఖాయం చేసుకొని టైటిల్‌ను సొంతం చేసుకుంది. పురుషుల విభాగం ఫైనల్ తొలి మ్యాచ్‌లో కెంటో మోమోటా 21-17, 21-7తో మౌలానా ముస్తఫాను ఓడించి జపాన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. రెండో మ్యాచ్‌లో అంగా ప్రతమ-రికీ సువార్ది ద్వయం 22-20, 14-21, 21-17తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావా జోడీపై గెలువడంతో స్కోరు 1-1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో జిన్‌టింగ్ ఆంథోనీ 21-7, 21-16తో షో ససాకిపై నెగ్గడంతో ఇండోనేసియా 2-1తో ముందంజ వేసింది. నాలుగో మ్యాచ్‌లో తకెషి కముర-కీగో సొనోడా జంట 21-16, 21-15తో బెరీ అంగ్రియవాన్-రియాన్ సపుత్ర జోడీని ఓడించడంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో క్రిస్టీ జొనాథన్ 14-21, 21-19, 21-13తో కెంటా నిషిమోటోపై నెగ్గడంతో ఇండోనేసియా 3-2తో విజయం సాధించి విజేతగా నిలిచింది. -
జపాన్ జోరు
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: స్టార్ ఆటగాళ్లతో కూడిన జపాన్ జట్లు ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయంతో శుభారంభం చేశాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఈవెంట్లో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ మహిళల జట్టు 5-0తో సింగపూర్‌ను... జపాన్ పురుషుల జట్టు 5-0తోనే నేపాల్‌ను చిత్తుగా ఓడించాయి. మహిళల మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో జపాన్ క్రీడాకారిణులు సయాకా సాటో 21-17, 21-17తో లియాంగ్ జియోవుపై... యు హాషిమోటో 21-15, 21-9తో జెన్ గ్రేస్ చువాపై... మినత్సు మితాని 19-21, 22-20, 21-19తో జియా మిన్ యోపై గెలిచారు. మిగతా రెండు డబుల్స్ మ్యాచ్‌ల్లో మిసాకి-అయాకా ద్వయం... నవోకో-కురిమి జోడీలు విజయం సాధించడంతో జపాన్ విజయం పరిపూర్ణమైంది. మహిళల విభాగం ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో చైనీస్ తైపీ 4-1తో శ్రీలంకపై, కొరియా 5-0తో మాల్దీవులుపై, మలేసియా 3-2తో హాంకాంగ్‌పై గెలిచాయి. పురుషుల విభాగం ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియా 4-1తో శ్రీలంకపై, చైనీస్ తైపీ 5-0తో మాల్దీవులుపై, ఇండోనేసియా 4-1/3-2తో థాయ్‌లాండ్‌పై విజయం సాధించాయి. బుధవారం ఆతిథ్య భారత్ బరిలోకి దిగుతుంది. భారత పురుషుల, మహిళల జట్లు తమ తొలి లీగ్ మ్యాచ్‌ల్లో సింగపూర్ జట్లతో తలపడనున్నాయి. -
నేటినుంచి ఆసియా బ్యాడ్మింటన్
* బరిలో 14 దేశాల జట్లు * టోర్నీకి సైనా నెహ్వాల్ దూరం సాక్షి, హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు (సోమవారం) ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఈ నెల 21 వరకు జరుగుతుంది. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి 14 దేశాలకు చెందిన 26 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఒక్కో విభాగంలో మూడేసి జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ పోటీల అనంతరం రెండు జట్లు ముందుకు వెళతాయి. ఆ తర్వాత క్వార్టర్స్‌నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. థామస్, ఉబెర్ కప్ తరహాలోనే ఇరు జట్ల మధ్య జరిగే పోరులో మూడు సింగిల్స్, రెండు డబుల్స్ మ్యాచ్‌లు ఉంటాయి. పురుషుల విభాగంలో ‘ఎ’ గ్రూప్‌లో భారత్‌తో పాటు చైనా, సింగపూర్ ఉండగా...మహిళల విభాగం గ్రూప్ ‘డి’లో భారత్, జపాన్, సింగపూర్ ఉన్నాయి. తొలి రెండు రోజుల పాటు భారత మ్యాచ్‌లు లేవు. బుధ, గురువారాల్లో మన జట్టు ప్రత్యర్థులతో తలపడుతుంది. ప్రపంచ నంబర్ 2 క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో పాటు కశ్యప్ కూడా గాయం కారణంగా ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం లేదు. శ్రీకాంత్, అజయ్ జైరాం, ప్రణయ్, సింధు, జ్వాల, అశ్వినిల ప్రదర్శనపై భారత జట్ల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
నేడు ఈవీఎంల పంపిణీ
గచ్చిబౌలి: గ్రేటర్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, సోమవారం ఈవీఎంలు పంపిణీ చేయనున్నట్లు ఎన్నికల అధికారి, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సర్కిల్-11, 12 డివిజన్ల ఎన్నికల ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈవీఎంలు, ఇతర మెటీరియల్ పంపిణీ చేస్తామన్నారు. పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆయా రూట్ల వారీగా పంపిణీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 6.30 లక్షల మంది ఓటర్ స్లిప్పులు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పేందుకు ఇది సంకేతమన్నారు. ఇప్పటికే 80 శాతం ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని, నేడు, రేపు వార్డు కార్యాలయాల్లో స్లిప్పులు అందిస్తారని తెలిపారు. ఓటర్ స్లిప్పులు తప్పనిసరేం కాద ని చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. శేరిలింగంపల్లి ఆర్ఓ మనోహర్ మెటీరియల్ పంపిణీ గురించి కమిషనర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ, వెస్ట్ జోన్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి, సర్కిల్-12 డిప్యూటీ కమిషనర్ మమత తదితరులు పాల్గొన్నారు. -
హైదరా‘బ్యాడ్’ హంటర్స్
సాక్షి, హైదరాబాద్: కీలక మ్యాచ్‌ల్లో తడబాటు కారణంగా హైదరాబాద్ హంటర్స్ జట్టుకు సొంతగడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురైంది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ జట్టు 3-4 పాయింట్ల తేడాతో చెన్నై స్మాషర్స్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఈ లీగ్‌లో హంటర్స్ జట్టుకిది ఓవరాల్‌గా మూడో పరాజయం. ప్రస్తుతం హంటర్స్ 10 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా... 12 పాయింట్లతో చెన్నై మూడో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్ పోటీలో కార్స్టెన్ మొగెన్సన్-గుత్తా జ్వాల (హైదరాబాద్) ద్వయం 7-15, 7-15తో క్రిస్ అడ్కాక్-పియా జెబాదియా (చెన్నై) జోడీ చేతిలో ఓడిపోయింది. అయితే పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో లీ చోంగ్ వీ (హైదరాబాద్) 15-3, 12-15, 15-8తో సో ద్వి కుంకురో (చెన్నై)పై నెగ్గడంతో హంటర్స్ జట్టు 1-1తో స్కోరును సమం చేసింది. మూడో మ్యాచ్‌గా జరిగిన రెండో పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ (హైదరాబాద్) 12-15, 12-15తో సిమోన్ సాంతోసో (చెన్నై) చేతిలో ఓడిపోయాడు. దాంతో హంటర్స్ 1-2తో వెనుకబడింది. మహిళల సింగిల్స్ ‘ట్రంప్ మ్యాచ్’లో పీవీ సింధు (చెన్నై) 15-8, 14-15, 15-5తో సుపనిద (హైదరాబాద్)ను ఓడించింది. దాంతో చెన్నై జట్టుకు రెండు పాయింట్లు లభించడంతోపాటు 4-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే విజయం ఖాయమైంది. ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్ ‘ట్రంప్ మ్యాచ్’లో కార్స్టెన్ మొగెన్సన్-మార్కిస్ కిడో (హైదరాబాద్) జంట 15-12, 15-12తో క్రిస్ అడ్కాక్-ప్రణవ్ చోప్రా (చెన్నై) జోడీని ఓడించి రెండు పాయింట్లు సాధించింది. దాంతో చెన్నై ఆధిక్యం 3-4కి తగ్గింది. నేడు సైనా X సింధు పోరు? సోమవారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. రాత్రి 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్‌తో అవధ్ వారియర్స్ (లక్నో) తలపడుతుంది. చెన్నై జట్టులో పీవీ సింధు, లక్నో జట్టులో సైనా నెహ్వాల్ ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో వీరిద్దరి మ్యాచ్ కోసం అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే గాయంతో బాధపడుతున్న సైనా ఈ మ్యాచ్‌లో ఆడుతుందో లేదో వేచి చూడాలి. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో ముంబైతో హైదరాబాద్ ఆడుతుంది. -
సుస్మితకు నాలుగు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన సోమ సుస్మిత నాలుగు స్వర్ణాలు సొంతం చేసుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఈ పోటీలు ముగిశాయి. సీనియర్ విభాగంలో బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్టింగ్, అన్ఈవెన్ బార్లలో సుస్మిత మొదటి స్థానంలో నిలిచింది. చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం చివరి రోజు అండర్-17, సీనియర్స్ విభాగాల్లో ఆరు ఈవెంట్లు జరిగాయి. ఈ చాంపియన్‌షిప్ ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్ట్‌ల హవా కొనసాగింది. పెద్ద సంఖ్యలో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించారు. ఇతర ఫలితాలు: అండర్-17 (పోమెల్ హార్స్): 1. నీరజ్ (కేరళ), 2. ధర్మేందర్ (ఏపీ), 3. సంజీవ్ (ఏపీ). (రింగ్స్): 1. సంజీవ్ (ఏపీ), 2. ధర్మేందర్ (ఏపీ), 3. ప్రశాంత్ (కేరళ). (టేబుల్ వాల్ట్): 1. ధర్మేందర్ (ఏపీ), 2. విక్రమ్ (ఏపీ), 3. శ్యామ్‌సుందర్ (కర్ణాటక), (ప్యార్లల్ బార్స్): 1. నీరజ్ (ఏపీ), 2. ధర్మేందర్ (ఏపీ), 3. ప్రశాంత్ (కేరళ), (హారిజాంటల్ బార్): ధర్మేందర్ (ఏపీ), 2. సంజీవ్ కుమార్ (ఏపీ), 3. నీరజ్ (కేరళ) సీనియర్స్: (ఫ్లోర్ ఎక్సర్సైజ్): 1. లఖన్ వాల్మీకీ (ఏపీ), 2. తేజదీప్ (ఏపీ), 3. వివేక్ సింగ్ .(పోమెల్ హార్స్): 1. మణికంఠ (ఏపీ), 2. తేజదీప్ (ఏపీ), 3. వివేక్ సింగ్ (ఏపీ), (రింగ్స్): 1. కాసుల నాయుడు (ఏపీ), 2. తేజదీప్ (ఏపీ), 3. వివేక్ సింగ్ (ఏపీ), (టేబుల్ వాల్ట్): 1. తేజదీప్ (ఏపీ), 2. లఖన్ వాల్మీకీ (ఏపీ), 3. కాసుల నాయుడు (ఏపీ), (ప్యార్లల్ బార్స్): 1. తేజ దీప్ (ఏపీ), 2. లఖన్ వాల్మీకీ (ఏపీ), 3. వివేక్ సింగ్ (ఏపీ), (హారిజాంటల్ బార్): 1. వివేక్ సింగ్ (ఏపీ), 2. కాసుల నాయుడు (ఏపీ), 3. లఖన్ వాల్మీకీ (ఏపీ).