కనీస టికెట్ ధర రూ. 6 వేలు | The minimum ticket price. 6 thousand | Sakshi
Sakshi News home page

కనీస టికెట్ ధర రూ. 6 వేలు

Published Tue, Dec 6 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

కనీస టికెట్ ధర రూ. 6 వేలు

కనీస టికెట్ ధర రూ. 6 వేలు

నగరంలో ఐపీటీఎల్ టోర్నీ   
సాక్షి, హైదరాబాద్: నగరంలో తొలిసారి ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టికెట్ ధరలను నిర్వాహకులు ప్రకటించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 9,10 తేదీల్లో లీగ్ మ్యాచ్‌లు, 11న ఫైనల్ జరుగుతాయి. ఈ టోర్నీ కోసం ఒక రోజు మ్యాచ్ టికెట్ కనీస ధర రూ. 6 వేలుగా నిర్ణయించారు. మూడు రోజులకు కలిపి సీజన్ టికెట్ కనీసం రూ. 15 వేలుగా ఉంది. వేర్వేరు కేటగిరీల్లో రూ. 35 వేలు, రూ. 42 వేలు, రూ. 81 వేలు విలువ గల టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఆసక్తి గల అభిమానులు kyazoonga.com సైట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు నేరుగా హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో ప్రేక్షకుల కోసం టికెట్లు అమ్మకానికి ఉన్నాయి. బేగంపేటలోని క్యాజూంగా కార్యాలయం అవుట్ లెట్, 10 డౌనింగ్ స్ట్రీట్, ఎంజీ రోడ్ ఇండియానా స్పోర్‌‌ట్సలో ఇవి లభిస్తాయి. టోర్నీలో ఇండియన్ ఏసెస్, జపాన్ వారియర్స్, సింగపూర్ స్లామర్స్, యూఏఈ రాయల్స్ పాల్గొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement