
ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం చౌర్యపాఠం(Chaurya Paatam Movie). ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, చూడామణి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా..ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఈ సినిమాకు రిలీజ్‌కు ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. దీంతో చౌర్యపాఠం చిత్రబృందం అందరికంటే కాస్తా భిన్నంగా ప్రమోషన్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఫుల్ స్వింగ్‌లో ఉండడంతో ప్రమోషన్లలో వాడేశారు. ఈనెల 23న హైదరాబాద్‌లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు ఉచితంగా టిక్కెట్స్ గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు. దీనికోసం ఓ చిన్న కాంటెస్ట్‌ను ప్లాన్ చేశారు. అదేంటో తెలుసుకుందాం.
చౌర్యపాఠం ట్రైలర్ చూసి అందులో ఐదు ప్రశ్నలకు కరెక్ట్‌గా సమాధానాలు పంపాలి. ఐదింటికి సరైన సమాధానాలు పంపిన వారిలో లక్కీ డ్రా ఎంపిక చేస్తారు. ఈ ప్రశ్నలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు హీరో ఇంద్ర రామ్. మొదటి ప్రశ్న- ట్రైలర్‌లో వినిపించే గ్రామం పేరేంటి? రెండోది- ప్రతి రోజు బెల్ ఎన్ని గంటలకు మోగుతుంది? మూడోది.. వీక్‌నెస్ కోసం వినియోగించే ట్యాబ్లెట్ పేరేంటి? నాలుగో ప్రశ్న- ఈ ట్రైలర్ వాడిన ముగ్గురు హీరోయిన్ల పేర్లు? ఇక ఐదో ప్రశ్న- చౌర్యపాఠం మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఈ ఐదింటికి సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపిస్తే విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి ట్రై చేయండి.
Hey hai #IPL lovers
Need #IPL tickets for Hyderbad match tomorrow ?
Then participate in our #ChauryaPaatam contents and the best answers can grab IPL tickets for free ☺️#ChauryaPaatamonApr25th #3daystogo pic.twitter.com/heEyYXqRQq— Velivela Indhra Ram (@indhraram) April 22, 2025