Mega 154: చిరంజీవి మూవీ సెట్‌లో సుకుమార్‌ సందడి | Sukumar In Director Bobby, Chiranjeevi Mega 154 Movie Set | Sakshi
Sakshi News home page

Mega 154: చిరంజీవి 154 మూవీ సెట్‌లో సుకుమార్‌ సందడి

Published Sat, Jun 18 2022 10:21 AM | Last Updated on Sat, Jun 18 2022 10:23 AM

Sukumar In Director Bobby, Chiranjeevi Mega 154 Movie Set - Sakshi

చిరంజీవి హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి 154వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘వాల్తేర్ వీర‌య్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ మూవీ సెట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శనం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో బాబీ సినిమాకి సంబంధించిన అవుట్ పుట్‌ను సుకుమార్‌కి చూపిస్తున్నట్లు కనిపించాడు. 

చదవండి: ఆ వార్తల్లో నిజం లేదు: ‘ప్రాజెక్ట్‌ కె’ టీం క్లారిటీ

ఈ ఫొటోను స్వయంగా బాబీ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘మెగా 154 రషెస్ చూశాక సుకుమార్ ఫీలింగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ రాసుకొచ్చాడు. కాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక సుకుమార్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన 'పుష్ప 2' మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉన్నాడు. 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమయ్యే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement