
మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చిరంజీవి 154వ చిత్రం తెరకెక్కనుందంటూ ఇటివల మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా అధికారిక ప్రకటన వెలుడింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అయితే మొదట ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలించిన మేకర్స్ వాల్తేరు శ్రీనుగా ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. ఈ సినిమాలో చిరు వాల్తేరు శ్రీనుగా మాస్‌లుక్‌తో అలరించబోతున్నాడట.
చదవండి: 'కథ చెప్పడానికి ఫోన్ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు'
కాగా ప్రస్తుతం చిరు మోహన్ రాజా దర్వకత్వంతో తెరకెక్కుతున్న లూసిఫర్ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు బర్త్‌డే సందర్భంగా ఈ మూవీకి గాడ్‌ఫాదర్‌గా టైటిల్‌ను ఖరారు చేసి మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఆయన ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్‌ను ప్రారంభించారు. దీనితో పాటు మెహర్ రమేష్‌తో ‘వేదాళమ్’ మూవీ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment