
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ ఉన్నాడు. ఇటీవల ఆచార్య సినిమాతో పలకరించిన చిరు ఆ వెంటనే భోళా శంకర్, గాడ్ ఫాదర్‌తో పాటు బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా లైన్లో పెట్టాడు. ఇటీవల గాడ్ ఫాదర్, బాబీ చిత్రాలు సెట్స్‌పైకి రాగా చిరు ఒకేసారి ఈ రెండు మూవీ షూటింగ్స్‌ల్లో పాల్గొంటున్నాడు చిరు. ఈ క్రమంలో మెగా 154 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న బాబీ చిత్రం నుంచి ఓ ఆసక్తిర అప్‌డేట్ వదిలాడు డైరెక్టర్.
చదవండి: అన్‌స్టాపబుల్: రెండో సీజన్ తొలి గెస్ట్ ఆ స్టార్ హీరోనట!
ఇప్పటికీ టైటిల్ ఖరారు చేయని ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా సంక్రాంతికి కలుద్దాం అంటూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ చిత్రం బృందం పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ముఠా మేస్త్రీ’ తరహా మాస్ యాంగిల్‌లో చిరు కనిపించనున్నట్లు గతంలో విడుదలైన పోస్టర్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రంలో చిరు అండర్‌కవర్ కాప్‌గా కనిపించనున్నాడు.
చదవండి: పదో తరగతి ఫలితాల్లో సత్తాచాటిన సూర్య కూతురు, ఆ సబ్జెక్ట్‌లో వందకు వంద
విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మాస్‌మహారాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి మెగా 154తో పాటు ప్రభాస్ ఆదిపురుష్, రామ్ చరణ్-శంకర్ ఆర్‌సీ 15 చిత్రాలు కూడా ఉన్నాయి. అదే విధంగా జరిగితే సంక్రాంతి బరిలో తండ్రికొడులకు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. మరి ఇందులో ఎవరి సినిమా ప్రేక్షక ఆదరన పొందుతుందో వేచి చూడాలి.
This time its going to be a MEGA festival!🤩
— Bobby (@dirbobby) June 24, 2022
Make way for MASS MOOLA VIRAT for this Sankranthi 2023🌟
Can’t hold my eagerness to witness the MASS Euphoria of MY HERO @KChiruTweets garu on the big screens with my film #Mega154😊
Kaluddam Sankranthi ki😎#Mega154ForSankranthi 💥 pic.twitter.com/2tVoBxqvYm
Comments
Please login to add a commentAdd a comment