
ఫార్ములా 4- ఇండియన్ చాంపియన్‌షిప్
చెన్నై: ఇండియన్ రేసింగ్ లీగ్‌లో భాగంగా జరిగిన ఎఫ్‌ఐఏ ఫార్ములా–4 ఇండియా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్ట్స్ రేసర్ అఖీల్ అలీఖాన్ సత్తా చాటాడు. ఆదివారం చెన్నై నైట్ సర్క్యూట్‌లో జరిగిన ఈ పోటీల రెండో రౌండ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన అలీఖాన్ విజేతగా నిలిచాడు. కారులో సాంకేతిక లోపం కారణంగా తొలి రౌండ్ నుంచి అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్న అలీ రెండో రౌండ్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించాడు.
గ్రిడ్‌లో నాలుగో స్థానం నుంచి మొదలు పెట్టిన అతను వేగంగా దూసుకుపోయాడు. ఈ క్రమంలో ఇద్దరు భారత రేసర్లు దివీ నందన్, జేడెన్ పారియట్‌ను అతను అధిగమించాడు. తొలి రౌండ్‌లో విజేతగా నిలిచిన హ్యూజ్ బార్టర్ (గాడ్‌స్పీడ్ కొచ్చి టీమ్) రెండో రౌండ్ క్వాలిఫయింగ్‌లో విఫలమై గ్రిడ్‌లో చివరి స్థానంనుంచి మొదలు పెట్టాడు. చివరకు ఐదో స్థానంతో అతను రేస్‌ను ముగించాడు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగచైతన్య హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్‌కు యజమానిగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment