black bird
-
నాగచైతన్య బ్లాక్‌బర్డ్స్ జట్టు రేసర్‌కు తొలి స్థానం
చెన్నై: ఇండియన్ రేసింగ్ లీగ్‌లో భాగంగా జరిగిన ఎఫ్ఐఏ ఫార్ములా–4 ఇండియా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్ట్స్ రేసర్ అఖీల్ అలీఖాన్ సత్తా చాటాడు. ఆదివారం చెన్నై నైట్ సర్క్యూట్లో జరిగిన ఈ పోటీల రెండో రౌండ్లో దక్షిణాఫ్రికాకు చెందిన అలీఖాన్ విజేతగా నిలిచాడు. కారులో సాంకేతిక లోపం కారణంగా తొలి రౌండ్ నుంచి అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్న అలీ రెండో రౌండ్లో అంచనాలకు అనుగుణంగా రాణించాడు.గ్రిడ్‌లో నాలుగో స్థానం నుంచి మొదలు పెట్టిన అతను వేగంగా దూసుకుపోయాడు. ఈ క్రమంలో ఇద్దరు భారత రేసర్లు దివీ నందన్, జేడెన్ పారియట్ను అతను అధిగమించాడు. తొలి రౌండ్లో విజేతగా నిలిచిన హ్యూజ్ బార్టర్ (గాడ్స్పీడ్ కొచ్చి టీమ్) రెండో రౌండ్ క్వాలిఫయింగ్‌లో విఫలమై గ్రిడ్‌లో చివరి స్థానంనుంచి మొదలు పెట్టాడు. చివరకు ఐదో స్థానంతో అతను రేస్‌ను ముగించాడు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగచైతన్య హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్‌కు యజమానిగా ఉన్నాడు. -
స్పై ప్లేన్ : కనురెప్ప మూసి తెరచేలోగా..!
వాషింగ్టన్ : ప్రపంచం ఇంతవరకూ ఎరుగని వేగంతో ప్రయాణించే విమానాన్ని అమెరికా రూపొందిస్తోంది. ఆ దేశానికి చెందిన ఫైటర్ జెట్ల తయారీ సంస్థ లాక్ హీడ్ మార్టిన్ స్పై ప్లేన్ ‘ఎస్ఆర్ - 72 బ్లాక్‌బర్డ్’ను అభివృద్ధి చేస్తోంది. కోల్డ్‌వార్ సమయంలో ఎస్ఆర్-71 బ్లాక్‌బర్డ్ విమానం ద్వారా రష్యాపై అమెరికా గూఢచర్యం నిర్వహించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఎస్ఆర్ -71 విధుల నుంచి తప్పుకుంది. ఆ తర్వాత అమెరికా ఎలాంటి స్పై జెట్‌ను రూపొందించలేదు. తాజాగా రూపొందుతున్న ఎస్ఆర్ -72ను ‘సన్ ఆఫ్ బ్లాక్‌బర్డ్’ గా లాక్ హీడ్ మార్టిన్‌కు చెందిన అధికారులు చెబుతున్నారు. 2030లో ఈ ప్లేన్ విధుల నిర్వహణను ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు. హైపర్ సోనిక్ టెక్నాలజీని వినియోగించడం వల్ల ఎస్ఆర్ -72 ధ్వని వేగం కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగం(మాక్ -6)తో ప్రయాణిస్తుంది. కోల్డ్‌వార్ సమయంలో సేవలందిచిన ఎస్ఆర్ -71 మాక్ -3.5 వేగం(సుమారు గంటకు 2వేల కిలోమీటర్లు)తో ప్రయాణించేది. ఎస్ఆర్ -72పై తమకు ఎలాంటి సమాచారం లేదని అమెరికా ఎయిర్‌ఫోర్స్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.