స్పై ప్లేన్‌ : కనురెప్ప మూసి తెరచేలోగా..! | Spy Plane Blackbird To Fly in 2030 | Sakshi
Sakshi News home page

స్పై ప్లేన్‌ : కనురెప్ప మూసి తెరచేలోగా..!

Published Wed, Jan 17 2018 4:30 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Spy Plane Blackbird To Fly in 2030 - Sakshi

లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఎస్‌ఆర్‌-72 బ్లాక్‌ బర్డ్‌

వాషింగ్టన్‌ : ప్రపంచం ఇంతవరకూ ఎరుగని వేగంతో ప్రయాణించే విమానాన్ని అమెరికా రూపొందిస్తోంది. ఆ దేశానికి చెందిన ఫైటర్‌ జెట్ల తయారీ సంస్థ లాక్‌ హీడ్‌ మార్టిన్‌ స్పై ప్లేన్‌ ‘ఎస్‌ఆర్‌ - 72 బ్లాక్‌బర్డ్‌’ను అభివృద్ధి చేస్తోంది.

కోల్డ్‌వార్‌ సమయంలో ఎస్‌ఆర్‌-71 బ్లాక్‌బర్డ్‌ విమానం ద్వారా రష్యాపై అమెరికా గూఢచర్యం నిర్వహించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఎస్‌ఆర్‌ -71 విధుల నుంచి తప్పుకుంది. ఆ తర్వాత అమెరికా ఎలాంటి స్పై జెట్‌ను రూపొందించలేదు.

తాజాగా రూపొందుతున్న ఎస్‌ఆర్‌ -72ను ‘సన్‌ ఆఫ్‌ బ్లాక్‌బర్డ్‌’ గా లాక్‌ హీడ్‌ మార్టిన్‌కు చెందిన అధికారులు చెబుతున్నారు. 2030లో ఈ ప్లేన్‌ విధుల నిర్వహణను ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు.

హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీని వినియోగించడం వల్ల ఎస్‌ఆర్‌ -72 ధ్వని వేగం కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగం(మాక్‌ -6)తో ప్రయాణిస్తుంది. కోల్డ్‌వార్‌ సమయంలో సేవలందిచిన ఎస్‌ఆర్‌ -71 మాక్‌ -3.5 వేగం(సుమారు గంటకు 2వేల కిలోమీటర్లు)తో ప్రయాణించేది. ఎస్‌ఆర్‌ -72పై తమకు ఎలాంటి సమాచారం లేదని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement