ఇన్నర్ వ్యూ
పుట్టినరోజు : 1924 సెప్టెంబర్ 20 (శనివారం)
జన్మస్థలం : కృష్ణాజిల్లా గుడివాడ సమీపం లోని వెంకట రాఘవాపురం గ్రామం
తల్లిదండ్రులు : అక్కినేని పున్నమ్మ, వెంకటరత్నం
పేరు వెనుక కథ : నేను పుట్టే ముందు, బిడ్డ చుట్టూ నాగుపాము మూడుసార్లు ప్రదక్షిణ చేసినట్టు మా అమ్మ పున్నమ్మగారికి కల రావడం వల్ల నాగేశ్వరరావు అని పేరు పెట్టారు.
విద్యార్హత : ఐదో తరగతి మధ్యలోనే ఆపేశాను. హిందీ మాధ్యమిక పాసయ్యాను.విద్యాభ్యాసం పెదవిరివాడలో జరిగింది.
జీవితంలో తొలిసారిగా చేసిన పాత్ర : స్కూల్‌లో చంద్రమతి పాత్ర
చిత్రరంగ ప్రవేశం : 1944 మే 8న ‘ధర్మపత్ని’ సినిమాతో.
హీరోగా తొలి చిత్రం : సీతారామ జననం
తొలి పారితోషికం : ‘సీతారామ జననం’లో నా పాత్రకు 250 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారు. ‘ధర్మపత్ని’కి నెలకి 25 రూపాయలు ఇచ్చారు.
గాయకునిగా తొలి చిత్రం : ‘సీతారామజననం’లో గురుబ్రహ్మ గురుదేవో అనే శ్లోకం
తొలి ద్విపాత్రాభినయ చిత్రం : ఇద్దరు మిత్రులు
తొలి సంగీత ప్రధాన చిత్రం : జయభేరి
తొలి క్రైమ్ చిత్రం : దొంగల్లో దొర
తొలి నవలా చిత్రం : దేవదాసు
తొలి కలర్ సినిమా : అమరశిల్పి జక్కన్న
తొమ్మిది పాత్రలు చేసిన చిత్రం : నవరాత్రి
తొలి వాన పాట : ఆత్మబలం (చిటపట చినుకులు పడుతూ ఉంటే)
తొలి వృద్ధ పాత్ర : పరదేశి
తొలి విదేశీ యాత్ర : సిలోన్ 1952లో
తమిళంలో చేసిన చిత్రాలు : 26
వివాహం : 1949 ఫిబ్రవరి 18న అన్నపూర్ణతో
షష్టిపూర్తి మహోత్సవం : 1984 సెప్టెంబర్ 20న జరిగింది.
అన్నపూర్ణా స్టూడియోస్ శంకుస్థాపన : 1975 ఆగస్ట్ 13న, నా మనవడు చిరంజీవి సుమంత్‌చే జరిగింది.
అన్నపూర్ణా స్టూడియోస్ ప్రారంభం : 1976 జనవరి 14న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు.
నటసమ్రాట్ బిరుదు : 1957లో విజయవాడలో బెజవాడ గోపాలరెడ్డి ఇచ్చారు.
ముద్దు పేర్లు : ఇంట్లో అంతా నాగేశ్వర్రావ్ అనే పిలిచేవారు. సినీ పరిశ్రమలోని సన్నిహితులు మాత్రం ముద్దుపేర్లతో పిలిచేవారు. పేకేటి శివరామ్ ‘నాగూభాయ్’ అని, సముద్రాల రాఘవాచార్యులు‘నాగు’, నాగయ్య అని, ముదిగొండ లింగమూర్తి ‘చిరంజీవి’ అని, ఘంటసాల బలరామయ్య ‘రాముడు’ అని, శాంతకుమారి ‘అబ్బీ’అని, సావిత్రి ‘హీరోగారు’ అనేవారు.
తెలిసిన భాషలు : తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్
బాగా ఇష్టమైన పాట : అందమె ఆనందం
నా సినిమాల్లో నాకు బాగా ఇష్టమైన సినిమా : బాటసారి
అభిమాన పాత్రలు : రామకృష్ణ పరమహంస, యోగి వేమన, అన్నమాచార్య, రామానుజాచార్య
అభిమాన తారలు : అశోక్‌కుమార్, నర్గీస్
ఇష్టమైన దుస్తులు : వైట్ అండ్ వైట్ డ్రెస్
ఇష్టపడే వంటకాలు : పులుసు కూరలు
ప్లస్ పాయింట్స్ : నా లోపాలు తెలియడమే కాకుండా నా మెరిట్స్ తెలుసుకోవడం
మైనస్ పాయింట్స్ : పెద్ద గొంతు కాదు... ఎత్తు లేను... అందగాణ్ణి కాదు... అని అనుకుంటాను
మరిచిపోలేని విషాదకర సంఘటన : 1960 మార్చి 19న నా పెద్దకొడుక్కి చికిత్స చేయడానికని వచ్చిన చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకయ్య తిరిగివెళ్తూ యాక్సిడెంట్‌లో చనిపోవడం.
బాగా ప్రేమించేది : నట జీవితాన్ని
ద్వేషించేది : దొంగతనాల్ని, అబద్ధాల్ని
జీవిత లక్ష్యం : ఇప్పుడు నాక్కావల్సినవి ఏమీలేవు.ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా, ఆరోగ్యంగా ఉంటూ చనిపోవాలని ఉంది.
మొదట్నుంచీ నాకు సున్నిపిండి వాడే అలవాటు ఉంది. చలిరోజుల్లో చర్మం డ్రై కాకుండా సున్నిపిండి ఉపకరిస్తుంది. సబ్బులు పైపై మెరుగులకే కానీ, సున్నిపిండి వల్ల వంటి మీద మురికి మొత్తం పోతుంది. సున్నిపిండి నలుగు పెట్టుకోవడం కండరాలకు ఎక్సర్‌సైజ్. అలాగే బకెట్‌లో నీరు పెట్టుకుని వంగి తీసుకుని పోసుకుంటాను. అది కూడా తెలీకుండా ఒక మంచి ఎక్సర్‌సైజ్!
ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా చనిపోవాలని...
Published Thu, Jan 23 2014 1:41 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM
Advertisement
Advertisement