నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు | Naga Chaitanya And Sobhita Wedding Works Start | Sakshi
Sakshi News home page

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు

Published Mon, Oct 21 2024 2:02 PM | Last Updated on Mon, Oct 21 2024 3:07 PM

Naga Chaitanya And Sobhita Wedding Works Start

అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. నాగార్జున వారసుడు నాగచైతన్యతో నటి శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఆగష్టులో వారిద్దరి నిశ్చితార్థం వేడుకగా కుటుంబ సమక్షంలో జరిగింది. అయితే, ఈ జోడీ కలసి ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈమేరకు శోభితా తన ఇన్‌స్టాలో ఫోటోలు పంచుకున్నారు.  పసుపు దంచుతున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, పెళ్లి వేడుక ఎక్కడ అనేది తెలియాల్సి ఉంది.

ఆగష్టు 8న నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నూతన జంటకు శుభాకాంక్షలు. ప్రేమ, సంతోషాలతో వీరి జీవితాలు నిండిపోవాలని కోరుకుంటూ.. 8.8.8.. (ఎనిమిదో తేదీ... ఎనిమిదో నెల... 2024ని కూడితే ఎనిమిది) అనంతమైన ప్రేమకు నాంది అని వారి నిశ్చితార్థం నాడు నాగార్జున తెలిపారు.

అడివి శేష్‌ నటించిన ఓ చిత్రానికి సంబంధించిన హౌస్‌పార్టీలో నాగచైతన్య, శోభితాలకు తొలిసారి పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని టాక్‌. ‘జోష్‌’తో హీరోగా ప్రయాణం మొదలుపెట్టి, ఇప్పుడు చేస్తున్న ‘తండేల్‌’ వరకూ నాగచైతన్య కెరీర్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇక శోభితా ధూళిపాళ్ల విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో వేణుగోపాల్‌ రావు, శాంతాకామాక్షి దంపతులకు జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం.

2013లో ఫెమీనా మిస్‌ ఇండియా ఎర్త్‌ టైటిల్‌ విజేతగా నిలిచారామె. ఆ తర్వాత ‘రామన్‌ రాఘవ్‌ 2.ఓ’తో నటిగా శోభిత ప్రయాణం హిందీలో మొదలైంది. ‘బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్, మేడ్‌ ఇన్‌ హెవెన్, ది నైట్‌ మేనేజర్‌’ వంటి హిందీ వెబ్‌ సిరీస్‌ల ద్వారానూ పాపులర్‌ అయ్యారు. 2018లో వచ్చిన అడివి శేష్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘గూఢచారి’లో ఓ లీడ్‌ రోల్‌లో నటించారు శోభిత. ‘మేజర్‌’లోనూ ఓ ముఖ్య పాత్ర చేశారు. హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘మంకీ మ్యాన్‌’లోనూ నటించారు. ఇక 2017లో నాగచైతన్య–సమంత పెళ్లి చేసుకున్న విషయం, 2021లో విడిపోయిన విషయం తెలిసిందే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement