
వెంకటేశ్ హీరోగా 75వ చిత్రం ‘సైంధవ్’. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలలో మార్పు చోటు చేసుకుంది.
(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?)
క్రిస్మస్ కానుకగా ఈ మూవీని డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ అప్పుడు ప్రభాస్ సలార్ విడుదల కానున్న విషయం తెలిసిందే. అందువల్ల సైంధవ్ విడుదల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘సైంధవ్’ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో గాయత్రి అనే పాత్రను బేబీ సారా పోషిస్తోంది.
ఇందులో ఆమె రోల్ ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’గా ఉంటుందని మేకర్స్ చెప్పారు. సైంధవ్‌లోని లోతైన భావోద్వేగానికి ఈ పాప ప్రతిరూపం. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు పోస్టర్‌తో తెలిపారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెంకటేష్ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్ అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment