
మణికందన్, వెంకట్ బోయనపల్లి, వెంకటేశ్, సంతోష్ నారాయణన్, శైలేష్ కొలను
‘‘ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘సైంధవ్’ నా 75వ చిత్రం. యాక్షన్, భావోద్వేగాలు చాలా అద్భుతంగా వచ్చాయి. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీతో కలిసి అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.
చిత్ర సంగీతదర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘రాంగ్ యూసేజ్..’ అంటూ సాగే తొలిపాటని సీఎంఆర్ గ్రూప్ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈపాటను నకాష్ అజీజ్‌పాడారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘కళాశాల దశలో నేను బ్యాక్ బెంచర్‌ని.
ఇప్పుడున్న నాలాంటి విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ విద్యార్థులు, అధ్యాపకులు సహకారం అందించాలి. 35 ఏళ్లుగా నా సినీ జర్నీ కొనసాగుతోంది. నా మొదటి చిత్రం విడుదల అప్పటినుంచి ఇప్పుడున్న యువత తల్లిదండ్రులు నన్ను ఆదరిస్తున్నారు. ఇప్పుడు యువత ఆదరిస్తున్నారు. ఈ తరం వారిని కూడా నా సినిమాలు రీచ్ అవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment