వెంకటేశ్ 'సైంధవ్' ట్రైలర్.. రూ.17 కోట్ల ఇంజెక్షన్ కథే సినిమా! | Venkatesh's Saindhav Movie Telugu Trailer | Sakshi
Sakshi News home page

Saindhav Trailer: చాలారోజుల తర్వాత వెంకీ అలా.. ట్రైలర్‌లోనే దాదాపు కథంతా!

Jan 3 2024 11:30 AM | Updated on Jan 3 2024 11:45 AM

Venkatesh Saindhav Trailer Telugu  - Sakshi

ఈసారి సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. మిగతా మూవీస్ సంగతి పక్కనబెడితే వెంకటేశ్ 75వ మూవీ 'సైంధవ్' కూడా ఉందండోయ్. జనవరి 13న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్.. ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. దాదాపు సినిమా ఎలా ఉండబోతుందో చూపించేశారు. అలానే వెంకీ మామని సరికొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేశారు కూడా.

(ఇదీ చదవండి: వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?)

హీరో ఓ ఫ్యామిలీ మ్యాన్. భార్య-కూతురితో హ్యాపీగా జీవిస్తుంటాడు. తన కూతురు.. 'స్పైనల్ మాస్క్యూలర్ ఎట్రోఫి' అనే అరుదైన వ్యాధి బారిన పడిందని తెలుస‍్తుంది. దీని నుంచి బయటపడాలంటే రూ.17 కోట్ల విలువైన ఓ ఇంజెక్షన్ పాపకు ఇవ్వాలి. అప్పుడు బతుకుతుంది. అయితే ఈ ఇంజెక్షన్ విలన్ దగ్గర.. విలన్‌కి కావాల్సిన కంటైనర్స్ హీరో దగ్గర ఉంటుంది. చివరకు హీరో.. తన కూతుర్ని బతికుంచుకున్నాడా? లేదా? అనేదే ట్రైలర్ బట్టి అనిపించిన స్టోరీ.

ఫ్యామిలీ ప్రేక్షకుల ఫేవరెట్ హీరో వెంకటేశ్.. చాలారోజుల నుంచి సాఫ్ట్ లేదా థ్రిల్లర్ సినిమాలే చేస్తూ వస్తున్నాడు. 'సైంధవ్'లో మాత్రం యాక్షన్‌తో అదరగొట్టేసినట్లు కనిపిస్తుంది. కత్తి, గన్.. ఇలా దేనితో పడితే దానితో విలన్ గ్యాంగ్‌ని చంపుతూ కనిపించాడు. మరోవైపు ఫ్యామిలీ పర్సన్‌గా డిఫరెండ్ షేడ్స్ చూపించాడు. ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్‌గానే ఉంది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement