వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ కొత్త షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్’ కీలక షూటింగ్ షెడ్యూల్ శ్రీలంకలో జరుగుతోంది. ‘‘వెంకటేష్ కెరీర్‌లో 75వ మైలురాయిగా ‘సైంధవ్’ రూపొందుతోంది. శ్రీలంక షెడ్యూల్‌లో భాగంగా ముఖ్యమైన టాకీ భాగంతో పాటు ఇంటె¯Œ ్స యాక్షన్ బ్లాక్, ఒక పాట కోసం కొన్ని మాంటేజ్‌లు చిత్రీకరిస్తున్నాం.
వెంకటేష్‌తో పాటు ప్రధాన నటీనటులు పాల్గొంటున్నారు. ఈ సినిమా కథ పూర్తిగా వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా, జయప్రకాశ్.. ఇలా ఎనిమిది పాత్రల చుట్టూనే తిరుగుతుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘సైంధవ్’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న విడుదల చేస్తున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎస్.మణికందన్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం(వెంకట్).
Comments
Please login to add a commentAdd a comment