
సూర్య అయ్యలసోమయజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తోన్న చిత్రం రామ్ (RAM). ఈ చిత్రం ద్వారా సూర్య హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. తాజాగా ఈ సినిమా వీక్షించిన సైంధవ్ డైరెక్టర్ శైలేశ్ కొలను ప్రశంసలు కురిపించారు.
రామ్ ప్రీమియర్ షో చూసిన డైరెక్టర్ శైలేష్ కొలను ప్రత్యేకంగా చిత్రయూనిట్‌ను అభినందించారు. ఈ సినిమా కథాంశం, అందులోని సోషల్ మెసేజ్ గురించి ఆయన ప్రస్తావించారు. సినిమాను అద్భుతంగా తీశారని ప్రశంసించారు. ధారన్ సుక్రి విజువల్స్, ఆశ్రిత్ సంగీతం బాగుందని కొనియాడారు. చిత్రయూనిట్‌కు మంచి విజయం చేకూరుతుందని శైలేష్ అన్నారు. విడుదలకు ముందే ప్రీమియర్ షోలతో రామ్ చిత్రయూనిట్ ప్రమోషన్స్ చేస్తూ దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment