75 అనేది నెంబర్ మాత్రమే..ప్రతి సినిమా ప్రత్యేకమే: వెంకటేశ్‌ | Victory Venkatesh Talks About Saindhav Movie | Sakshi
Sakshi News home page

Saindhav : 75 అనేది నెంబర్ మాత్రమే..ప్రతి సినిమా ప్రత్యేకమే: వెంకటేశ్‌

Published Thu, Jan 11 2024 5:15 PM | Last Updated on Thu, Jan 11 2024 5:29 PM

Victory Venkatesh Talk About Saindhav Movie - Sakshi

దగ్గుబాటి వెంకటేశ్.. ఈ పేరు కంటే విక్టరీ వెంకటేశ్ అంటే చాలు అందరు గుర్తుపడతారు. విక్టరిని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో  వెంకటేశ్. వారసత్వం తొలి అవకాశం మాత్రమే ఇస్తుంది. కానీ.. సొంత ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చు అని రుజువు చేశాడు వెంకటేశ్. హీరోగా 74 సినిమాల్లో నటించడమే కాదు..వాటిలో ఎక్కువ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక తన 75వ సినిమాగా ‘సైంధవ్‌’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.  శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వెంకటేశ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

సైంధవ్ మీ లాండ్ మార్క్ 75వ సినిమా కదా.. ఆ ఒత్తిడి ఏమైనా ఉందా ? 
నాకు ఆ ఒత్తిడి ఏమీ లేదు. 75 అనేది నెంబర్ మాత్రమే. అయితే ఒక కెరీర్ లో 50,  75, 100 నెంబర్స్ సహజంగానే ఒక మైల్ స్టోన్ లా అనుకోవచ్బు. నా వరకూ .. ఆ సమయానికి వచ్చింది నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తాను. ప్రతి సినిమా ప్రత్యేకమే. ప్రతి సినిమాకి కష్టపడి పని చేయాలి. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. 

దర్శకుడు శైలేష్ కొలను కథ చెప్పినపుడు మీకు నచ్చిన అంశం ఏమిటి ? 
చాలా బ్యుటీఫుల్ డాటర్ సెంటిమెంట్ ఉంది. రెగ్యులర్ గా కాకుండా కథకు అవసరమైయ్యే ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. యాక్షన్ చాలా నేచురల్ గా ఉంది. చాలా ఫాస్ట్ పేస్డ్ మూవీ ఇది. ఇది నాకు ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ అవుతుందనిపించింది. దర్శకుడు శైలేష్ కొలను వర్క్ చేయడం చాలా మంచి అనుభూతి. 

పిల్లలతో కలసి చాలా సినిమాలు చేశారు కదా.. బేబీ సారా నటన ఎలా అనిపించింది ? 
పిల్లలతో కలసి పని చేయడం నాకు చాలా ఇష్టం. బేబీ సారాలో స్పార్క్ ఉంది. అద్భుతంగా నటించింది. 

‘సైంధవ్’ కథకు సంబంధించి మీరేమైనా సూచనలు చేశారా ? 
దర్శకుడు శైలేష్ చాలా మంచి కథతో వచ్చారు. ఒకసారి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా టీంతో కలసిపోతాను. సాధారణమైన చర్చలు సహజంగానే జరుగుతుంటాయి. ఎక్కడైనా మెరుగుపరిచే అవకాశం ఉందనిపిస్తే చెబుతాను. నా దృష్టి మాత్రం నటనపైనే ఉంటుంది. 

‘సైంధవ్’లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తారని, క్లైమాక్స్ సరికొత్తగా ఉంటుందని వినిపిస్తోంది ? 
-సైంధవ్ చాలా మంచి కథ. స్టొరీ నడిచే విధానం చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ ని ఎక్స్ ట్రార్డినరీ గా డిజైన్ చేశారు. హైలీ ఎమోషనల్ గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇవన్నీ ఒక కొత్తదనం తీసుకొచ్చాయి. 

ఈ సినిమా విషయానికి వస్తే ప్రమోషన్స్ లో స్టేజ్ పై డ్యాన్స్ చేశారు కదా ? 
నాకు సహజంగానే సౌండ్ వింటే కాళ్ళు ఆడుతాయి. సడన్ గా వాసు పాట వేసేసరికి అలా వచ్చేసింది. ఆ బీట్ అలాంటిది (నవ్వుతూ) 

‘సైంధవ్’ పాత్రలో మీ ‘ధర్మచక్రం’ పోలికలు ఉన్నాయా ? 
లేదండీ. ఈ రెండు కంప్లీట్ గా డిఫరెంట్.  

నవాజుద్దీన్ సిద్ధిఖి గారు ఈ సినిమాతో తెలుగులోకి వస్తున్నారు.. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? 
నవాజుద్దీన్ సిద్ధిఖి గారితో పని చేయడం చాలా మంచి అనుభూతి. ఆయన ఎక్స్ ట్రార్డినరీ యాక్టర్. గ్యాంగ్స్ అఫ్ వాసేపూర్ నుంచి ఆయన ప్రయాణం చాలా విలక్షణంగా సాగుతోంది. సైంధవ్ లో చాలా క్రేజీ రోల్ చేశారు. మాములు సీక్వెన్స్ ని కూడా డిఫరెంట్ గా చేసే నటుడు ఆయన. ఇందులో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. 

‘సైంధవ్’ లో సంగీతంకు ఎంత ప్రాధన్యత ఉంటుంది ? 
సంతోష్ నారాయణ్ అద్భుతమైన మ్యూజిక్ చేశారు. నేపధ్య సంగీతం ఎక్స్ లెంట్ గా ఉంటుంది. రాంగ్ యూసెజ్, సరదాలే పాటలు అద్భుతంగా వచ్చాయి. లిరిక్స్ కూడా చాలా చక్కగా కుదిరాయి. 

75 సినిమాల కెరీర్ లో ఒక్క వివాదం కూడా లేకుండా మీ ప్రయాణం సాగడం ఎలా సాధ్యమైయింది? 
అది ఎలా అని తెలుసుంటే అందరికీ చెప్పేవాడిని( నవ్వుతూ). నిజంగా నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఎవరికీ అసౌకర్యం కలిగించకూడదనే మనస్తత్వం నాది. స్కూల్, కాలేజీలో కూడా ఇలానే ఉండేవాడిని. 

నాని గారితో సినిమా చేస్తున్నారని విన్నాం ?  
చేద్దాం. అన్నీ చేసేద్దాం (నవ్వుతూ) 

స్వామి వివేకనంద సినిమా గురించి ? 
ఆ స్క్రిప్ట్ ఒక లెవల్ వరకు వచ్చింది. ఇద్దరు మేకర్స్ చేస్తున్నారు. అయితే స్క్రిప్ట్ పై వాళ్ళకి పూర్తి స్థాయి సంతృప్తి రాలేదు.

నెక్స్ట్ సినిమా గురించి ? 
రెండు మూడు కథలు ఉన్నాయి. ఇంకా ఏమీ లాక్ చేయలేదు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. నాలుగు సినిమాలు అద్భుతంగా ఆడాలి. అందరూ ఆనందంగా ఉండాలి. థాంక్ యూ సో మచ్.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement