ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. రిలీజ్ ముందు వరకు చూసుకుంటే ఎప్పుడు లేనంత రచ్చ ఈసారి జరిగింది. చిన్నా పెద్దా అనే అంతరాలు చేసి మాట్లాడటం, థియేటర్ల కేటాయింపు దగ్గర వివాదం.. ఇలా ఊహించని మలుపులతో ప్లాన్ చేసుకున్న నాలుగు మూవీస్ కూడా థియేటర్లలోకి వచ్చేశాయి. మరి వీటిలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నవి ఏవి? ప్రస్తుతం ఎంతెంత కలెక్షన్స్ సాధించాయి?
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?)
'గుంటూరు కారం'.. అలా అలా
ఈసారి వచ్చిన వాటిలో భారీ అంచనాలతో రిలీజైన సినిమా 'గుంటూరు కారం'. మహేశ్-త్రివిక్రమ్ కాంబోనే దీనికి కారణం. మాస్ ఎలిమెంట్స్ గట్టిగా ఉంటాయని చెప్పడంతో అభిమానులు అంచనాలు పెంచేసుకున్నారు. తీరా చూస్తే.. మహేశ్ తన వరకు బాగా న్యాయం చేశాడు. స్వాగ్, డ్యాన్సులు రెచ్చిపోయి మరీ చేశాడు. కానీ కథ, డైలాగ్స్, దర్శకత్వం విషయంలో త్రివిక్రమ్ పెద్దగా కొత్తదనం చూపించలేకపోయాడు. దీంతో బెన్ఫిట్ షో అయిపోగానే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మూడు రోజుల్లోనే రూ.164 కోట్లు వచ్చిన ప్రకటించుకున్నారు. వసూళ్లు అయితే రావొచ్చేమో గానీ మిగతా విషయాల్లో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయిందనేది చాలామంది మాట!
హనుమాన్.. ఊహించని సక్సెస్
రిలీజ్‌కి ముందే చిన్న సినిమా అని తక్కువ చేసి చూడటం, థియేటర్లు ఇవ్వకపోవడం లాంటి వాటివల్ల 'హను-మాన్' సినిమాపై సింపతీ పెరిగింది. ఇక స్టోరీ పరంగా కాస్త ల్యాగ్ అనిపించినప్పటికీ.. హై ఇచ్చే ఎలిమెంట్స్, దేవుడి సెంటిమెంట్ లాంటివి జనాలకు బాగా కనెక్ట్ అయిపోయాయి. సినిమాకు ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వచ్చేసింది. తెలుగులో థియేటర్ల తక్కువ కావడం వల్ల కలెక్షన్స్ తక్కువ వచ్చుండొచ్చు కానీ లాంగ్ రన్‌లో మిగతా మూడు సినిమాల కంటే దీనికే ఎక్కువ వస్తాయి.
(ఇదీ చదవండి: సంక్రాంతి అంటే సినిమా ఉండాల్సిందేనా? అసలు ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది?)
సైంధవ్.. అంతంత మాత్రమే
విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్' సినిమాతో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే టేకింగ్, యాక్టింగ్ పరంగా పెద్దగా వంకపెట్టడానికి ఏం లేదు గానీ స్క్రీన్ ప్లే కాస్త సాగదీత, స్టోరీలో చిన్నచిన్ పారపొట్లు ఈ చిత్రానికి కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు. అలానే దీనికంటే ముందు 'గుంటూరు కారం', 'హనుమాన్' రావడంతో ఇక అందరి దృష్టి వాటిపైనే ఉండిపోయింది. దీంతో వెంకీమామని పట్టించుకునేవాళ్లు తక్కువైపోయారు. అయితే ఈ సినిమాకు తొలిరోజు రూ.6 కోట్లు వచ్చినట్లు సమాచారం. లాంగ్ రన్‌లో బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు.
నా సామిరంగ.. స్లో పాయిజన్
నాగార్జున విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా 'నా సామి రంగ'. విడుదలయ్యేంత వరకు దీనిపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. బడ్జెట్ కూడా తక్కువే. అలా తాజాగా సంక్రాంతికి రిలీజైన ఈ మూవీకి హిట్ టాక్ వచ్చిందని అంటున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే యావరేజ్ అంటున్నారు. పండగ హడావుడిలో పెట్టిన బడ్జెట్‌లో ఈ మూవీ సేఫ్ అయిపోవచ్చు.ఈ చిత్రానికి కూడా తొలిరోజు రూ.6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇక నాలుగు సినిమాల పరంగా చూసుకుంటే మాత్రం ఈసారి ఎలా చూసుకున్నాసరే 'హను-మన్' సంక్రాంతి విన్నర్!
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment