
టాలీవుడ్ అగ్ర హీరోల్లో విక్టరీ వెంకటేష్ స్టైలే వేరు. ఒకవైపు సోలో హీరోగా రాణిస్తూనే.. మరోవైపు యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా సైంధవ్ మూవీ రానుంది. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ రోజు విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.
వెంకీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దగ్గుబాటి హీరో భారీగానే ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం వెంకటేష్ ఏకంగా రూ. 17 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. అంతకు ముందు ఎఫ్3 లో నటించిన వెంకటేష్.. ఆ సినిమాకు రూ.15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సైంధవ్‌కు మాత్రం మరో రెండు కోట్లు పెంచేసినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం వెంకటేశ్ నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో రానాకు తండ్రిగా నటించాడు. మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌తో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment