‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో పదకొండేళ్ల ప్రయాణం నాది (తొలి చిత్రం ‘అందాల రాక్షసి’). ఇన్నేళ్ల కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నాను. అయితే నా పాటలు తెలిసినంతగా నేనెక్కువగా జనాలకు తెలియదేమో అనిపిస్తుంటుంది. అయినా నేను కాదు.. నా పాటలు వారికి తెలియడం సంతృప్తిగా ఉంది’’ అని పాటల రచయిత కృష్ణకాంత్ అన్నారు. నేడు ఆయన బర్త్‌డే (జనవరి 10).
ఈ సందర్భంగా మంగళవారం కృష్ణకాంత్ మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్లలో ఎన్నో పాటలు రాశాను. 2023లో ‘విరూపాక్ష, కోట బొమ్మాళి, హాయ్ నాన్న, సలార్, జైలర్, జవాన్, లియో’.. ఇలా 27 సినిమాల్లో 70 పాటలు రాశాను. సిద్ధార్థ్ ‘చిన్నా’, ‘ది మార్వెల్స్’ చిత్రాలకు పాటలు, మాటలు రాశా. మన పాట వైరల్ కావాలనే ఆలోచనతో రాస్తే సినిమా ఆడినన్ని రోజులు గుర్తుంటుంది.. ఆ తర్వాత మరచిపోతారు. నా ప్రతి పాటలో ఓ భావం, అర్థం ఉండాలనే ఆలోచనతో రాస్తాను. నేను పాటలు రాసిన ‘హను–మాన్’, ‘సైంధవ్’, ‘ఈగల్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమాకీ పాటలు రాశాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment