krishna kanth
-
ఎస్ బాస్‌లకే ‘రెడ్’ కార్పెట్!
‘రెడ్బుక్కే రూల్ బుక్...! కచ్చితంగా అమలు చేయడమే జిల్లా ఎస్పీల బాధ్యత..! టీడీపీ ప్రధానకార్యాలయంతోపాటు జిల్లాల్లోని పార్టీ నేతలు సూచించిన ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులుపెట్టాల్సిందే..! వారిని తీవ్రంగా వేధించాల్సిందే..!’ - ముఖ్యనేత అల్టిమేటం...!‘ప్రభుత్వ పెద్దలు చెప్పింది అర్థమైంది కదా...! ఫాలో కావాల్సిందే...! లేదంటే చార్జ్‌మెమోలు ఇస్తాం.. చెప్పినట్లుగా నడుచుకోని ఎస్పీలను పక్కనబెడతాం.. డీఎస్పీలతో రెడ్‌బుక్ కేసులు ఫాలో అప్ చేయిస్తాం..!’ - పోలీస్ బాస్ హుకుం..! రెడ్‌బుక్ అరాచకాలతో పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ రెడ్‌బుక్ ఒత్తిళ్లతో తీవ్ర అస్వస్థతకు గురి కావడం ఎస్పీలను ఆందోళనకు గురి చేస్తోంది. గత 20 రోజులుగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామాలను వాకబు చేస్తూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. - సాక్షి, అమరావతి నెల రోజులుగా కృష్ణకాంత్‌కు వేధింపులు..!రెడ్‌బుక్ కుట్రను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌పై ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం నెల రోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు, అక్రమ అరెస్టులో ఎస్పీ తమ అంచనాలకు తగ్గట్టుగా పని చేయడం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014–19 మధ్య పెండింగ్‌లో ఉన్న పలు కేసులను తిరగదోడి రాజకీయ ప్రత్యర్థులపై ఐపీసీ సెక్షన్ 307 చేర్చి హత్యాయత్నం కింద కేసులు బనాయించాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ నేతల ఒత్తిళ్లతో పలువురు స్టేషన్ హౌస్ అధికారులు వాస్తవాలతో నిమిత్తం లేకుండా వివిధ కేసుల్లో సెక్షన్ 307 చేర్చేందుకు యత్నించారు. ఈ విషయం తెలియడంతో ఎస్పీ కృష్ణకాంత్ వారిని వారించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా సెక్షన్ 307 చేర్చితే న్యాయపరంగా ఇబ్బందులు తప్పవని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని సహించలేని సోమిరెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆదేశించడంతో కృష్ణకాంత్‌ను డీజీపీ తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. రెడ్‌బుక్ కేసులకు సంబంధించి చెప్పినట్లు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అనంతరం రోజూ ఫోన్లు చేస్తూ ఒత్తిడి పెంచడంతో ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు తక్షణం మెరుగైన చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయనకు హృదయ సంబంధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని, ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. రెడ్‌బుక్‌ను కాదనే ఎస్పీలకు మెమోలుఅడ్డగోలుగా వ్యవహరించేందుకు వెనుకంజ వేసే ఎస్పీలను వెంటనే పక్కనబెట్టాలని డీజీపీని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. ఆయా జిల్లాల్లో టీడీపీ వీర విధేయ డీఎస్పీలను గుర్తించి వారితో రెడ్‌బుక్ కేసుల దర్యాప్తును పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం అదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్‌ను తెరపైకి తెచ్చారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధ్థన్‌రెడ్డిపై అక్రమ కేసుతోపాటు ఇతర రెడ్‌బుక్ కేసుల దర్యాప్తును ఆయనే పర్యవేక్షిస్తుండటం గమనార్హం. పోలీసు బృందాల ఏర్పాటు, వివిధ ప్రాంతాలకు పంపించడం, జిల్లావ్యాప్తంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం తదితర వ్యవహారాలను డీఎస్పీ శ్రీనివాసే నిర్వర్తిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు మోడల్‌నే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఎస్పీలకు డీజీపీ కార్యాలయం తేల్చి చెప్పినట్లు సమాచారం. రెడ్‌బుక్‌ను ఫాలో కాకుంటే ఎస్పీలకు చార్జ్ మెమోలు తప్పవని, ఆ తరువాత తాము ఎంపిక చేసిన డీఎస్పీలు ఆయా కేసులను పర్యవేక్షిస్తారని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఐపీఎస్ అధికారులైన ఎస్పీలను అవమానించడమేనని పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
కూటమి కుట్రలతో ఐపీఎస్‌ల బెంబేలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రలు, అరాచకాలను అమలు చేయలేక పోలీసు శాఖ బెంబేలెత్తుతోంది. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఏకంగా ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తుండడంతో పోలీసు ఉన్నతాధికారులు హడలెత్తిపోతున్నారు. కొందరు మానసిక ఒత్తిడితో అస్వస్థత పాలవుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ హఠాత్తుగా అస్వస్థతకు గురికావడం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయనపై వరుస కేసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో పాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఒత్తిడి తీవ్రం చేశారు. కాకాణిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను హైదారాబాద్‌కు పంపించారు. ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్‌లు అంతటితో సంతృప్తి చెందలేదు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో నమోదైన పలు కేసుల్లో కాకాణి పేరును ఇరికించాలని కూడా ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఇంకా ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రతి రోజూ నిలదీస్తున్నారు. ఈ పరిణామాలతో ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఓ పరిమితి వరకు నిబంధనలకు కాస్త అటూ ఇటూగా ఉల్లంఘించగలంగానీ... బరితెగించి అక్రమ కేసులు, వేధింపులు ఐపీఎస్ అధికారిగా తనకు సాధ్యం కాదని ఆయన భావించారు. చట్ట పరిధిలోనే కేసులను దర్యాప్తు చేయగలను తప్ప.. రాజకీయ కక్షసాధింపు చర్యలకు సాధనంగా మారలేనంటూ ఆయన లోలోన మథన పడుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తీవ్రంగా మందలించిన పోలీస్ బాస్కాకాణిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని నిలదీస్తూ.. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఎస్పీ కృష్ణకాంత్‌పై గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఎస్పీపై మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. ఆయన తన నివాసంలో మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది హుటాహుటిన కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర ఒత్తిడితో ఎస్పీ కృష్ణకాంత్ బీపీ పడిపోయిందని వైద్యులు చెప్పారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. కొన్ని రోజలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొత్త ఎస్పీగా టీడీపీ వీర విధేయ సుబ్బారాయుడు!రెడ్‌బుక్ కుట్ర అమలులో అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరించనందుకు నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్‌పై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఆయనను బదిలీ చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ సానుభూతిపరుల కుటుంబానికి చెందిన, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును నెల్లూరు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. తిరుపతి ఎస్పీగా నియమితులయ్యారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో పోలీసుల వైఫల్యంతో ఆరుగురు భక్తులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీనికి బాధ్యుడిగా తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడును ప్రభుత్వం సస్పెండ్ చేయాలి. కానీ, బదిలీతో సరిపెట్టింది. అనంతరం ‘ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్’ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో సభ్యుడిగా సుబ్బారాయుడును నియమించారు. -
నా పాట తెలిసినంతగా నేను తెలియను: కృష్ణకాంత్
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో పదకొండేళ్ల ప్రయాణం నాది (తొలి చిత్రం ‘అందాల రాక్షసి’). ఇన్నేళ్ల కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నాను. అయితే నా పాటలు తెలిసినంతగా నేనెక్కువగా జనాలకు తెలియదేమో అనిపిస్తుంటుంది. అయినా నేను కాదు.. నా పాటలు వారికి తెలియడం సంతృప్తిగా ఉంది’’ అని పాటల రచయిత కృష్ణకాంత్ అన్నారు. నేడు ఆయన బర్త్‌డే (జనవరి 10). ఈ సందర్భంగా మంగళవారం కృష్ణకాంత్ మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్లలో ఎన్నో పాటలు రాశాను. 2023లో ‘విరూపాక్ష, కోట బొమ్మాళి, హాయ్ నాన్న, సలార్, జైలర్, జవాన్, లియో’.. ఇలా 27 సినిమాల్లో 70 పాటలు రాశాను. సిద్ధార్థ్ ‘చిన్నా’, ‘ది మార్వెల్స్’ చిత్రాలకు పాటలు, మాటలు రాశా. మన పాట వైరల్ కావాలనే ఆలోచనతో రాస్తే సినిమా ఆడినన్ని రోజులు గుర్తుంటుంది.. ఆ తర్వాత మరచిపోతారు. నా ప్రతి పాటలో ఓ భావం, అర్థం ఉండాలనే ఆలోచనతో రాస్తాను. నేను పాటలు రాసిన ‘హను–మాన్’, ‘సైంధవ్’, ‘ఈగల్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమాకీ పాటలు రాశాను’’ అన్నారు. -
నా పనే మాట్లాడుతుంది
‘‘ఈ ఏడాది 65 పాటలు రాశాను. పబ్లిసిటీపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. అందుకే ఏ వేదికపైనా మాట్లాడలేదు. నా పనే మాట్లాడాలని కోరుకుంటాను’’ అని పాటల రచయిత కృష్ణకాంత్ అన్నారు. శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ చిత్రంలో అన్ని పాటలు రాసిన కృష్ణకాంత్ విలేకర్లతో మాట్లాడారు. ∙ఈ సినిమా టైటిల్ ‘పడిపడి లేచె మనసు’ అనుకోగానే ‘ప్రళయంలోనూ ప్రణయంతోనే పరిచయం అయ్యే మనసు పడిపడి లేచె మనసు’ అనే త్రీ లైన్స్ రాశాను. ఈ లైన్స్‌లోనే సినిమా కథ ఉంది. అన్ని ప్రేమకథలు ఒకేలా ఉంటాయి. కానీ ప్రేమికులు ఎదుర్కొనే సంఘర్షణ డిఫరెంట్. ఈ సినిమాలో ఓ కొత్త కాన్ఫ్లిక్ట్ ఉంది. అది ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ∙హను రాఘవపూడి అన్ని సినిమాలకు నేను పని చేశాను. ఆయన సినిమాలో అన్ని పాటలు సందర్భానుసారంగానే ఉంటాయి. ఈ సినిమాలోనూ అంతే. విశాల్ చంద్రశేఖర్ కూల్‌గా ఉంటాడు. తనతో వర్క్ చేయడం ఈజీ. ∙నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరో ఒకరి పేరు చెప్పలేను. ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్‌తో ఒక్కో అనుభవం ఉంది. కీరవాణి, రెహమాన్గార్లతో కాకుండా అందరితో వర్క్ చేశాను. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్ర్రి, వేటూరిగార్లంటే నాకు ఇష్టం. వేటూరిగారు నాకు ప్రేరణ. ఆయన లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాసే పాటలు రిక్షావాడికి కూడా అర్థం అవుతాయి. ఐదేళ్ల క్రితం సినిమాలోని పాటల్లో బీట్స్‌కి ఇంపార్టెన్స్ ఉండేది. ఇప్పుడు లిరిక్స్‌కి ఉంటున్నాయి. ∙ఇప్పటివరకు ప్రేమకథా చిత్రాలు చేశాను. డిఫరెంట్‌గా చేయడానికి సిద్ధమే. గీత రచయితలకు సాహిత్యంపై అవగాహన ఉండాలి. జీవితాన్నైనా చదవాలి.. లేకపోతే పుస్తకాలైనా చదవాలి. ∙ప్రభాస్ 20వ చిత్రానికి ఇప్పటివరకు మూడు పాటలు రాశాను. ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమాకు సింగిల్ కార్డ్ రచయితగా చేశాను. రాజశేఖర్ ‘కల్కి’, నాని ‘జెర్సీ’లకు రాస్తున్నా. -
ప్రేమ పేరుతో పార్క్‌కు తీసుకెళ్లి..
అమీర్‌పేట : ప్రేమ పేరుతో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్ కథనం మేరకు నెల్లూరు ప్రాంతానికి చెందిన యువతి ఉద్యోగం కోసం గత ఏడాది నగరానికి వచ్చి ఎస్ఆర్నగర్లో ఉంటోంది. ఆమెకు తన స్నేహితురాలి ద్వారా కూకట్‌పల్లిలో ఉంటున్న కృష్ణాజిల్లా నివాసి సుధీర్‌తో పరిచయం ఏర్పడింది. తనకు తెలిసిన సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతను ఈ నెల 20న కృష్ణ కాంత్ పార్క్‌కు తీసుకెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘మేగా.. కాదు మే..ఘ’
‘లై’ సినిమాతో నిరాశపరిచిన నితిన్.. త్వరలో ఛల్ మోహన్ రంగ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రౌడీఫెలో ఫేం కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. ఇటీవల టీజర్ తో ఆకట్టుకున్న ‘ఛల్ మోహన్ రంగ’ యూనిట్ తాజాగా తొలిపాటను రిలీజ్ చేసింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా పాటగా రూపొందిన ‘గ..ఘ..మేఘ’ పాటను రిలీజ్ చేశారు. రాహుల్ నంబియార్ ఆలపించిన ఈ గీతానికి కృష్ణకాంత్ సాహిత్యమందించారు. తమన్ సంగీత మందిస్తున్న సినిమాలో లై ఫేం మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. -
తెలంగాణ కోసం ఇద్దరి బలిదానం
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ కోసం మరో యువకుడు బలిదానం చేసుకున్నాడు. హైదరాబాద్‌ను యూటీ చేయవద్దని పేర్కొంటూ హైదరాబాద్‌లోని రసూల్‌పురాకు చెందిన కృష్ణకాంత్ అనే విద్యార్థి గురువారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 7న సీమాంధ్ర సభ జరగనీయకూడదంటూ తెలంగాణ నేతలను కోరుతూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. కృష్ణకాంత్ ఇటీవలే ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరై ఘట్కేసర్లోని సిద్ధార్థ కాలేజీలో సీటు దక్కించుకున్నాడు. ఈనెల 7న ఎల్బీ స్టేడియంలో సమైక్య సభకు పోలీసులు అనుమతివ్వడం, హైదరాబాద్‌ను యూటీ చేయనున్నారన్న వార్తలతో కలత చెందిన కృష్ణకాంత్ గురువారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కృష్ణకాంత్ మృత దేహానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ నేతలు, తెలంగాణవాదులు నివాళులర్పించారు. ఆదిలాబాద్‌లో మరో యువకుడు నార్నూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ కోసం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు కలత చెంది ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం రాజులాగూడ గ్రామానికి చెందిన రాథోడ్ గోవింద్, శేషుబాయిల కుమారుడు శుశాంక్(20) ఇంటర్‌తో చదువు మానేసి వ్యవసాయం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం నుంచి సుశాంక్ ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు. వచ్చిన తెలంగాణను అడ్దుకోవడానికి జరుగుతున్న యత్నాలపై ఆందోళన చెందాడు. రాత్రి 8.15 గంటల సమయంలో పురుగుల మందు తాగి ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేస్తూ నా చావుతోనైనా తెలంగాణకు అడ్డంకులు తొలగాలని చెప్పాడు. వైద్యం కోసం ఆటోలో ఉట్నూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుని ప్యాంటు జేబులో తెలంగాణ కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ దొరికింది.