హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ కోసం మరో యువకుడు బలిదానం చేసుకున్నాడు. హైదరాబాద్‌ను యూటీ చేయవద్దని పేర్కొంటూ హైదరాబాద్‌లోని రసూల్‌పురాకు చెందిన కృష్ణకాంత్ అనే విద్యార్థి గురువారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 7న సీమాంధ్ర సభ జరగనీయకూడదంటూ తెలంగాణ నేతలను కోరుతూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. కృష్ణకాంత్ ఇటీవలే ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరై ఘట్‌కేసర్‌లోని సిద్ధార్థ కాలేజీలో సీటు దక్కించుకున్నాడు. ఈనెల 7న ఎల్బీ స్టేడియంలో సమైక్య సభకు పోలీసులు అనుమతివ్వడం, హైదరాబాద్‌ను యూటీ చేయనున్నారన్న వార్తలతో కలత చెందిన కృష్ణకాంత్ గురువారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కృష్ణకాంత్ మృత దేహానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్‌ఎస్ నేతలు, తెలంగాణవాదులు నివాళులర్పించారు.
ఆదిలాబాద్‌లో మరో యువకుడు
నార్నూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ కోసం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు కలత చెంది ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం రాజులాగూడ గ్రామానికి చెందిన రాథోడ్ గోవింద్, శేషుబాయిల కుమారుడు శుశాంక్(20) ఇంటర్‌తో చదువు మానేసి వ్యవసాయం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం నుంచి సుశాంక్ ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు. వచ్చిన తెలంగాణను అడ్దుకోవడానికి జరుగుతున్న యత్నాలపై ఆందోళన చెందాడు. రాత్రి 8.15 గంటల సమయంలో పురుగుల మందు తాగి ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేస్తూ నా చావుతోనైనా తెలంగాణకు అడ్డంకులు తొలగాలని చెప్పాడు. వైద్యం కోసం ఆటోలో ఉట్నూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుని ప్యాంటు జేబులో తెలంగాణ కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ దొరికింది.
తెలంగాణ కోసం ఇద్దరి బలిదానం
Published Sat, Sep 7 2013 4:14 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement