Viral Video: Man Helps Eagle Drink Water From The Bottle, Thank You, Says Internet - Sakshi
Sakshi News home page

వైరల్‌: డేగ దాహం తీర్చిన ఓ బాటసారి

Published Tue, May 25 2021 3:16 PM | Last Updated on Tue, May 25 2021 5:30 PM

Man Helps Parched Eagle Drink Water In Netherlands - Sakshi

ఆమ్‌స్టర్‌డామ్‌: ఆకలి రుచిఎరుగదు నిద్ర సుఖమెరుగదు అనేది నానుడి. మరి దాహం వేస్తే. అది అనుభవించే వారికే తెలుస్తుంది. వేసవిలో గింజలు, నీళ్లు దొరక్క అనేక పక్షులు చనిపోతుంటాయి. అయితే తాజాగా నెదర్లాండ్స్‌లో ఓ డేగ నీళ్ల కోసం అల్లాడిపోయింది. రోడ్డు దగ్గరకొచ్చి ఆ దారివెంట పోయే వాళ్లను తదేకంగా గమనిస్తోంది. దాని బాధను అర్థం చేసుకున్నాడు ఓ బాటసారి. డేగకి తన దగ్గర ఉన్న బాటిల్‌లోని నీళ్లును తాగించి దాన్ని దాహార్తిని తీర్చాడు. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన 20 సెకన్ల నివిడి గల ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 53,000 వేల మంది నెటిజన్లు వీక్షించగా..వందల మంది కామెంట్‌ చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి సీసాలోని నీటిని డేగ నోటికి అందించడానికి ప్రయత్నిస్తాడు. ఆ పక్కనే ఇద్దరు స్నేహితులు దాన్ని గమనిస్తున్నట్లు ఉండే ఈ వీడియోను ఓ హైవేపై రికార్డ్ చేసినట్టు కనిపిస్తుంది. కాగా డేగకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు అంటూ నెటిజన్లు ఆ జంతు ప్రేమికుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

(చదవండి: వైరల్‌: వృద్ధుడి స్టెప్పులకు..నెటిజన్ల కళ్లు జిగేల్‌)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement