ఈ తెల్లటి డేగ రేటెంతో తెలుసా? జస్ట్ 3.4 కోట్లు!! సౌదీ అరేబియాలోని మల్హంలో జరిగిన వేలంలో దీనికా రేటు పలికింది. అమెరికాకు చెందిన ఈ తెల్లటి జిర్‌ఫాల్కన్ డేగ జాతుల్లో అతి పెద్దది. ఎందుకింత అంటే.. సౌదీలో ఏళ్లుగా డేగలతో చిన్న జంతువులను వేటాడించే సంప్రదాయ ఆట ఒకటి ఉంది. దాన్ని ఫాల్కన్రీ అంటారు. ఇందుకోసమే అక్కడి ధనవంతులు ఈ వేటాడే పక్షులకు భారీ మొత్తాలు చెల్లించి కొంటుంటారు.
అయితే.. ఈ స్థాయి ధర గతంలో ఎన్నడూ లేదట. ఇదో ప్రపంచ రికార్డట. ఈ ఇంటర్నేషనల్ ఫాల్కన్ బ్రీడర్ ఆక్షన్‌లో 14 దేశాలకు చెందిన డేగల పెంపకందారులు పాల్గొన్నారు. సౌదీ టీవీల్లో, సోషల్ మీడియాలో ఈ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
చదవండి: పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్
పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో
Comments
Please login to add a commentAdd a comment