Falcon
-
అముర్ ఫాల్కన్ సూపర్ర్...బర్డ్..
సాక్షి, అమరావతి: అలుపెరుగని బాటసారిలా... వేలాది కిలోమీటర్లు ఎగురుతూ అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే అముర్ ఫాల్కన్ వలస పక్షుల్లో ఓ పక్షి తాజా పయనం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. భారత్ నుంచి బయలుదేరిన అముర్ ఫాల్కన్ 5 రోజుల 17 గంటల్లో సోమాలియా చేరుకుని, అక్కడ నుంచి కెన్యాలోకి ప్రవేశించింది. మధ్యలో ఎక్కడా ఆగకుండా పలు దేశాలతో పాటు, ఏకంగా అరేబియా సముద్రాన్ని కూడా దాటుకుని తన గమ్యస్థానం చేరుకుంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు, స్థానిక వలంటీర్లు సైబీరియా నుంచి వచి్చన రెండు పక్షులను మణిపూర్‌లో పట్టుకుని వాటికి స్థానిక గ్రామాలైన చిలువాన్, గ్యాంగ్‌రామ్ పేర్లు పెట్టారు. ఈనెల 8వ తేదీన చిలువాన్–2 పక్షికి శాటిలైట్ రేడియో ట్యాగ్ అమర్చారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న గుహగర్ నుంచి 10వ తేదీన నాన్‌స్టాప్ జర్నీ మొదలుపెట్టిన చిలువాన్–2, 15వ తేదీ నాటికి సోమాలియాలోని మొదటి గమ్యానికి చేరుకున్నట్లు రేడియో ట్యాగ్ ద్వారా పక్షి గమనాన్ని పర్యవేక్షించిన సైంటిస్టు సురేశ్ కుమార్ తెలిపారు. అయితే గ్వాంగ్రామ్ పేరు పెట్టిన మరో పక్షి మాత్రం తమెంగ్‌లాంగ్‌లోని చిలువాన్ రూస్టింగ్ సైట్లోనే ఉన్నట్లు గుర్తించారు. చిలువాన్–2 గ్రేట్ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని స్కోటోరా ద్వీపం సమీపంలోని ఓ విమాన మార్గంలో ఉందని తెలిపారు. లక్షల సంఖ్యలో పక్షులు ‘ఆర్కిటిక్ టర్న్’ అనే పక్షి తర్వాత అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే పక్షులుగా అముర్ ఫాల్కన్కు పేరుంది. 2018 నుంచి మణిపూర్‌లో ఈ పక్షుల వలస ప్రయాణాలు, మార్గాలను తెలుసుకునేందుకు రేడియో ట్యాగింగ్ చేసి అధ్యయనం చేస్తున్నారు. రేడియో ట్యాగ్లు అమర్చిన అన్ని పక్షులు గమ్యాలను చేరుకోలేకపోవడంతో వాటి గురించి పూర్తి వివరాలు తెలియలేదు. లక్షల సంఖ్యలో వెళ్లే పక్షుల్లో కేవలం రెండు, మూడు పక్షులకు మాత్రమే రేడియో ట్యాగ్లు అమర్చడం వల్ల వాటికి ఏమైనా హాని జరిగితే వాటి వలసల గురించి పూర్తి వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. 2019లో ఒక అముర్ ఫాల్కన్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించి 26 వేల కిలోమీటర్లు వెళ్లడాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మళ్లీ చిలువాన్–2 ద్వారా కొన్ని వివరాలు సేకరించగలిగారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే పక్షుల వలస మార్గాన్ని అధ్యయనం చేయడం ఈ పరిశోధన లక్ష్యమని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) సైంటిస్టు సురేశ్‌కుమార్ తెలిపారు. వాతావరణంలో జరిగే మార్పులను తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పక్షులు పొలంలోని పురుగులు, క్రిములు, కీటకాలను తినడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తాయని, అవి రాకపోతే పంట దిగుబడులు కూడా అనూహ్యంగా తగ్గిపోయే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.సైబీరియా టు ఆఫ్రికా... వయా ఇండియా ఫాల్కన్ కుటుంబానికి చెందిన పక్షుల్లో చిన్నవైన అముర్ ఫాల్కన్ పక్షులు ఆగ్నేయ సైబీరియా, ఉత్తర చైనాలో సంతానోత్పత్తి చేస్తాయి. వేసవికాలం అక్కడే ఉండే ఈ పక్షులు తీవ్రమైన శీతాకాలం నుంచి తప్పించుకోవడానికి ఆఫ్రికా తీర ప్రాంతాల్లోని శీతాకాలపు మైదానాలకు వెళతాయి. ఈ క్రమంలో 15 నుంచి 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. సైబీరియా నుంచి ఆఫ్రికాకు వెళ్లే మార్గ మధ్యంలో నాగాలాండ్, మణిపూర్ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో ఆగిపోతాయి. వీటిని నాగాలాండ్, మణిపూర్‌లో ‘అఖుయిపుయినా’ అని పిలుస్తారు. సగటున 45 రోజులు అవి ఇక్కడే ఉండి ఆహారాన్ని సమకూర్చుకుని సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా సన్నద్ధమవుతాయి. నిరంతరాయంగా ఎగిరేందుకు వీలుగా బరువును తగ్గించుకుంటాయి. ఆఫ్రికాలో శీతాకాలం ముగిశాక ఏప్రిల్, మే నెలల్లో ఇవి తిరుగు ప్రయాణమై మళ్లీ సైబీరియా వెళతాయి. తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఇవి మన దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఆగుతాయి. -
ఈ తెల్లటి డేగ రేటెంతో తెలుసా? జస్ట్ 3.4 కోట్లు!!
ఈ తెల్లటి డేగ రేటెంతో తెలుసా? జస్ట్ 3.4 కోట్లు!! సౌదీ అరేబియాలోని మల్హంలో జరిగిన వేలంలో దీనికా రేటు పలికింది. అమెరికాకు చెందిన ఈ తెల్లటి జిర్ఫాల్కన్ డేగ జాతుల్లో అతి పెద్దది. ఎందుకింత అంటే.. సౌదీలో ఏళ్లుగా డేగలతో చిన్న జంతువులను వేటాడించే సంప్రదాయ ఆట ఒకటి ఉంది. దాన్ని ఫాల్కన్రీ అంటారు. ఇందుకోసమే అక్కడి ధనవంతులు ఈ వేటాడే పక్షులకు భారీ మొత్తాలు చెల్లించి కొంటుంటారు. అయితే.. ఈ స్థాయి ధర గతంలో ఎన్నడూ లేదట. ఇదో ప్రపంచ రికార్డట. ఈ ఇంటర్నేషనల్ ఫాల్కన్ బ్రీడర్ ఆక్షన్‌లో 14 దేశాలకు చెందిన డేగల పెంపకందారులు పాల్గొన్నారు. సౌదీ టీవీల్లో, సోషల్ మీడియాలో ఈ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. చదవండి: పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్ పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో -
ఆగిపోయిన రౌడీ-సుకుమార్ మూవీ.. క్లారిటీ వచ్చేసింది!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు దర్శకుడు సుకుమార్. ఈ మూవీ అనంతరం యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమాను పట్టాలెక్కించాల్సి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు బయటకు రాకపోవడంతో సినిమా ఆగిపోయిందని పుకార్లు వినిపిస్తున్నాయి. అదే విధంగా పుష్ప సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడని టాక్ వచ్చింది. దాంతో ఇక రౌడీతో సినిమా వాయిదా పడిందని అంతా అనుకున్నారు. కాగా తాజాగా సుకుమార్- విజయ్ దేవరకొండ సినిమాపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు చెందిన నిర్మాణ సంస్త ఫాల్కన్ అధికారికంగాఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. విజయ్ దేవరకొండతో సుకుమార్ చేయబోయే సినిమా తొందరలోనే ఉంటుందని స్పష్టం చేసింది. దర్శకుడు సుకుమార్, హీరో విజయ్ దేవరకొండ కలయికలో ప్రతిష్టాత్మకంగా తొలి ప్రాజెక్టును ఫాల్కన్ ప్రకటించింది. సుక్కు, రౌడీ ముందుగా కమిట్ అయిన చిత్రాలు పూర్తయిన వెంటనే ఈ సినిమా మొదలవుతుందని పేర్కొంది. ఇక మూవీకి సంబంధించి ఎలాంటి రూమర్లు నమ్మవద్దని కోరింది. ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదని, అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమా భారీగా తెరకెక్కనుందని ఫాల్కన్ టీమ్ ప్రకటించింది. 2022లో షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు వెల్లడించింది. చదవండి: కొట్టడం అంటే ఓకే కానీ.. కిడ్నాప్ అంటే రిస్క్ రామ్ చరణ్ మూవీ: జర్నలిస్టుగా రష్మిక! View this post on Instagram A post shared by FalconCreationsLLP (@falconcreationsllp) -
ఏడు కోట్ల ఫాల్కన్!
అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్. సినిమాల్లో లుక్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్ని విషయాల్లో స్టైలిష్‌గా ఉండేలా జాగ్రత్త పడతారు. ఇప్పుడు కేరవాన్‌ని కూడా చాలా స్టైలిష్‌గా డిజైన్ చేయించుకున్నారు. షూటింగ్ చేస్తూ బ్రేక్ సమయాల్లో స్టార్స్ తమకోసం ప్రత్యేకంగా కేటాయించిన వాహనాల్లో విశ్రాంతి తీసుకుంటారు. అదే ‘కేరవాన్’. మామూలుగా నిర్మాతలే వాహనం సమకూరుస్తుంటారు. కొందరు స్టార్స్ సొంత కేరవాన్ ఏర్పాటు చేసుకుంటారు. అల్లు అర్జున్ తన కేరవాన్ను సరికొత్త ఫీచర్స్‌తో డిజైన్ చేయించారని తెలిసింది. ‘‘360 డిగ్రీలు తిరిగే కుర్చీ, మూడ్ లైటింగ్, సన్ రూఫ్, గేమింగ్ జోన్, ఎల్ఈడీ లైటింగ్‌తో మేకప్ మిర్రర్’ ఈ కేరవాన్ స్పెషాలిటీ. వీటికి తోడు మల్టీ పర్పస్ లాంజ్, బాత్రూమ్ దేనికదే సపరేట్గా ఉండేలా డిజైన్ చేశారు. మల్టీపర్పస్ లాంజ్‌ను సరికొత్త లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. కొత్త కేరవాన్ గురించి అల్లు అర్జున్ తన ట్వీటర్లో ‘‘జీవితంలో నేనేదైనా ఖరీదైన వస్తువుని కొనుగోలు చేసిన ప్రతిసారీ నా మనసులో ఒకటే ఆలోచన మెదులుతుంది. ప్రజలు నా మీద ఎంతో ప్రేమ చూపించారు. అంత ప్రేమను చూపించబట్టే ఇలాంటివి కొనగలుగుతున్నాను. అందరికీ థ్యాంక్స్. కృతజ్ఞుడ్ని. దీని (కేరవాన్) పేరు ఫాల్కన్’’ అన్నారు. ఇంతకీ ఈ లగ్జరీ కేరవాన్ ఖరీదు ఎంతో తెలుసా? దాదాపు 7 కోట్లు అని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. -
పాక్ నుంచి ఈసారి ఏమొచ్చిందో తెలుసా?
జైసల్మేర్: భారత్-పాకిస్థాన్ సరిహద్దులో గాలి బుడగులు దుమారం, పావురాల లేఖల కలకలం సద్దుమణగక ముందే మరోసారి కలకలం రేగింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన గద్ద(డేగ) ఈసారి కలవరపాటుకు గురిచేసింది. శిక్షణ పొందిన ఈ గద్దను రాజస్థాన్ లోని జైసల్మేర్ లో బీఎస్ ఎఫ్ అధికారులు దీన్ని పట్టుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో అనూప్ గఢ్ వద్ద దీన్ని బంధించారు. అయితే దీని వద్ద ఎటువంటి ట్రాన్స్ మీటర్, యాంటెనాలు లభ్యం కాలేదని బీఎస్ ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ పక్షిని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ గద్ద సౌదీ షేక్ లకు సంబంధించినదై ఉండొచ్చని బీఎస్ ఎఫ్ వర్గాలు తెలిపాయి. వీటిని పాకిస్థాన్ నుంచి సౌదీ షేక్ లు తెచ్చుకుంటారని వెల్లడించారు. ఇదేవిధంగా అక్టోబర్ 2న పఠాన్ కోట్ సమీపంలోని బమియాల్ సెక్టార్ లోగల సింబాల్ పోస్ట్ వద్ద.. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన పావురాన్ని బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. ప్రధాని నరేంద్ర మోదీని హెచ్చరిస్తూ ఉర్దూలో రాసిన లేఖను పావురం కాళ్లకు కట్టివుండడాన్ని గమనించారు. గాలి బుడగలకు కట్టిన లేఖలు కూడా పాక్ నుంచి మనదేశంలోకి వచ్చిపడిన విషయం తెలిసిందే. -
రాకెట్ల చరిత్ర తిరగరాతకు..!
రాకెట్ అంతరిక్ష ప్రయోగం కొత్త పుంతలు తొక్కనుందా?.. అవును! స్పేస్ ఎక్స్ తాజాగా చేసిన ప్రయోగం దీన్నే సూచిస్తోంది. రాకెట్ వేగంగా దూసుకుపోవడానికి ఉపయోగపడే బూస్టర్లను తిరిగి ఉపయోగించుకునే విధంగా చేసిన ప్రయోగం విజయవంతమైంది. శనివారం స్పేస్ ఎక్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన ఫాల్కన్ రాకెట్ విజయవంతమైంది. ఇందుకు ఉపయోగించిన బూస్టర్ తిరిగి విజయవంతంగా సముద్రంలో ఉన్న స్టేషన్ మీద ల్యాండ్ అయింది. ఇందుకోసం ప్రత్యేకమైన టెక్నాలజీని రాకెట్లో ఉపయోగించింది స్పేస్ ఎక్స్. ప్రధాన భాగాన్ని విడుదల చేసిన అనంతరం రాకెట్ నుంచి విడిపోయిన బూస్టర్ 50 మైళ్ల వేగం నుంచి ఇంజన్ల సాయంతో సముద్రంలో ఉంచిన స్టేషన్ మీద ఆగింది. గత ఏడాది డిసెంబర్లో కేప్ కానవేరల్లో బూస్టర్‌ను విజయవంతంగా నిలిపినా సాంకేతికలోపంతో పేలిపోయిన సంగతి తెలిసిందే. ప్రయోగ విజయానంతరం స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ మాట్లాడుతూ విమానాల్లా తిరిగి ఉపయోగించగల రాకెట్ల తయారీయే కంపెనీ లక్ష్యమని తెలిపారు. ముందు ముందు ఇలాంటి విజయాలు ప్రజలకు సాధారణమైపోతాయని అన్నారు. గత కొద్ది నెలల కిందట జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్‌ను పశ్చిమ టెక్సాస్‌లో విజయవంతంగా ప్రయోగించినా అది ఫాల్కన్ అంత వేగంగా గమ్యాన్ని చేరుకోలేకపోయింది. స్పేస్ ఎక్స్ విజయంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.