వైరల్‌ : బతుకు జీవుడా అనుకున్న గద్ద | Watch Video, Eagle Rescued By Salmon Farmers Became Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ : బతుకు జీవుడా అనుకున్న గద్ద

Published Sun, Dec 15 2019 12:25 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM

సాధారణంగా గద్దలు ఆహారం కోసం సముద్రమార్గంలో అన్వేషిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. వాటి అన్వేషణలో భాగంగా దొరికిన చేపలను,పాములను నోట కరచుకొని వెళ్తుంటాయి.  కానీ కెనెడాలోని వాంకోవర్‌ ఐలాండ్‌లో మాత్రం ఒక గద్దకు వింత అనుభవం ఎదురైంది.

ఆహారం కోసమని నీటిలో దిగగా ఒక ఆక్టోపస్‌ వచ్చి గద్దను తన కబంద హస్తాలలో బంధించి ఉక్కిరిబిక్కిరి చేసింది. దాని నుంచి విడిపించికునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆక్టోపస్‌ గద్దను ఇంకా గట్టిగా పట్టుకోవడంతో హాహాకారాలు మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయానికి చేపలను పెంచే సాల్మన్‌ బృందం పడవలో వెళ్తూ గద్ద అరుపులు విని అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆక్టోపస్‌ హస్తాలలో చిక్కుకున్న గద్ద బయటికి వచ్చేందుకు చేస్తున్న పోరాటాన్ని ఆ బృందం గమనించింది.

ఎలాగైనా గద్దను కాపాడాలనే ప్రయత్నంలో ఒక కర్రకు హుక్‌ను తగిలించి దానితో ఆక్టోపస్‌ను కదిలించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆక్టోపస్‌ తన పట్టు విడవడంతో చివరికి ఎలాగోలా గద్ద బతుకుజీవుడా అంటూ పక్కనే ఉన్న ఒడ్డుకు చేరుకుంది. మొత్తం 54 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోనూ కాస్తా సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ యూట్యూబ్‌లో 1.78 మిలియన్ల మంది వీక్షించారు. ఆక్టోపస్‌ చేతులలో బంధీగా మారిన గద్దను సురక్షితంగా కాపాడిన బృందాన్ని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement