
తమిళసినిమా: తన సినిమాలను షూటింగ్‌కు ముందే సంగీతాన్ని అందిస్తానని.. యువ సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ తెలిపారు. తొలి చిత్రం అంబులితోనే గుర్తింపు పొందిన శ్యామ్ విక్రమ్ వేదా చిత్రంతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపు పడేలా చేసుకున్నారు. తాజాగా సుళల్ వెబ్ సిరీస్‌కు, మాధవన్ దర్శక, నిర్మాణంలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌లో నటించిన రాకెట్రీ చిత్రానికి ఈయన అందించిన సంగీతంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
శనివారం ఆయన మాట్లాడుతూ తెలుగులో రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీతో పాటు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు చెప్పారు.
చదవండి: Anasuya Bharadwaj: వెబ్ సిరీస్‌లో వేశ్యగా యాంకర్ అనసూయ ?